భారత్‌లో హెచ్‌టి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

భారత మార్కెట్లో 'పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్' మూడు కొత్త ఏప్ హెచ్‌టి(ApeHT) సిరీస్ వాహనాలను విడుదల చేసింది. వీటిలో సిఎన్‌జితో నడిచే ఏప్ ఎక్స్‌ట్రా హెచ్‌టి, ఏప్ ఆటో హెచ్‌టి మరియు పెట్రోల్‌తో నడిచే ఏప్ ఎక్స్‌ట్రా హెచ్‌టి వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వాహనాల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హెచ్‌టిసి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

పియాజియో కంపెనీ ఈ వాహనాలు సరుకు రవాణా చేయడానికి మరియు ప్యాసింజర్ విభాగంలో విడుదల చేశారు. మార్కెట్లో ఏప్ ఎక్స్‌ట్రా హెచ్‌టి ధర రూ. 2.25 లక్షలు కాగా, ఏప్ ఎక్స్‌ట్రా హెచ్‌టి సిఎన్‌జి ధర రూ. 2.46 లక్షల వరకు ఉంది. అదేవిధంగా ఏప్ ఆటో హెచ్‌టి ధర రూ. 2.56 లక్షలు.

హెచ్‌టిసి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

హెచ్‌టి సిరీస్‌లో కొత్త 300 సిసి వాటర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 11.39 బిహెచ్‌పి పవర్ మరియు 22.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్ పవర్ తో పనిచేసే ఏప్ ఎక్స్‌ట్రా హెచ్‌టి 12 బిహెచ్‌పి మరియు 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పియాజియో స్థానికంగా ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది.

హెచ్‌టిసి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

ఈ ఇంజిన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది లో ఎన్‌విహెచ్ లెవెల్స్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. దేశీయ మార్కెట్లో పియాజియో కంపెనీ యొక్క ఆటోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు, పట్టణ ప్రాంతాల్లో ప్యాసింజర్ వాహనాలుగా బాగా ప్రసిద్ధి చెందాయి.

హెచ్‌టిసి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

త్రీ-వీలర్ కార్గో విభాగంలో పెట్రోల్ వెర్షన్‌ను అందిస్తున్న ఏకైక సంస్థ పియాజియో. సిఎన్‌జి వాహనాలకు అధిక డిమాండ్ ఉన్న జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ వాహనాల డిమాండ్ పెరిగిందని కంపెనీ తెలిపింది.

హెచ్‌టిసి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

పియాజియో రాబోయే రోజుల్లో ఏప్ ఆటో హెచ్‌టి పెట్రోల్ యొక్క ప్యాసింజర్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. కార్గో సిరీస్‌లో విక్రయించే 3 మోడళ్లకు 5.0 అడుగులు, 5.5 అడుగులు మరియు 6.0 అడుగుల డెక్ పొడవు ఎంపికలు ఉన్నాయి. నాన్-బ్రాండెడ్ ఫ్యూయెల్ విభాగంలో త్రీ-వీలర్ ఇంజిన్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి" అని పియాజియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లోని ఈవీపీ కమర్షియల్ వెహికల్ బిజినెస్ హెడ్ 'సాజు నాయర్' అన్నారు.

హెచ్‌టిసి సిరీస్ త్రీ-వీలర్స్ విడుదల చేసిన పియాజియో; ధర & వివరాలు

పియాజియో భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇటీవలే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. పియాజియోలో ప్రస్తుతం 725 మందికి పైగా వాహన డీలర్లు మరియు దాదాపు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 1,100 టచ్ పాయింట్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Piaggio Ape HT Three-Wheelers Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X