Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ప్రముఖ జర్మన్ లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ బ్రాండ్ పోర్షే ఇండియా (Porsche India) దేశీయ మార్కెట్ కోసం కొత్త పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్‌ (Porsche Panamera Platinum Edition) ప్రకటించింది. ఈ కొత్త Porsche Panamera Platinum Edition చాలా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ అధునాతన కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్‌ (Porsche Panamera Platinum Edition) దాని స్టాండర్డ్ ఎడిషన్‌ కంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. అయితే దీనిని కొనుగోలు చేయాలనుకునే వాహన ప్రియులు భారతదేశంలోని కంపెనీ యొక్క అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో ఆర్డర్ చేసుకోవచ్చు.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

పోర్షే ఇండియా (Porsche India) భారతీయ మార్కెట్లో 2021 ఫిబ్రవరి నెలలో ఇడుదల చేసింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి స్టాండర్డ్ మోడల్, జిటిఎస్, టర్బో ఎస్ మరియు ఎస్ ఈ-హైబ్రిడ్ వేరియంట్‌లు. ఇందులో కంపెనీ యొక్క స్టాండర్డ్ మోడల్ ధర రూ. 1.55 కోట్లు కాగా, టాప్-ఎండ్ S E-హైబ్రిడ్ ధర దాదాపు రూ. 2.71 కోట్లు వరకు ఉంటుంది.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

2021 పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్‌ (Porsche Panamera Platinum Edition) యొక్క జిటిఎస్ వేరియంట్ ధర రూ. 1.99 కోట్లు మరియు టర్బో S వేరియంట్‌ ధర రూ. రూ. 2.31 కోట్లు (ఎక్స్-షోరూమ్) అరకు ఉంటుంది. కానీ కంపెనీ యొక్క స్టాండర్డ్ వేరియంట్ ప్రారంభ ధర మాత్రం దేశీయ మార్కెట్లో రూ. 1.71 కోట్లు.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త Porsche Panamera కారు భారతదేశంలో ప్లాటినం ఎడిషన్‌తో నవీనీకరించబడుతుంది, ఇది గత నెలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా, మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

2021 పోర్స్చే పనామెరా ప్లాటినం ఎడిషన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో బ్లాక్ టెయిల్ పైప్, విండో ట్రిమ్‌లకు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ మరియు మెటాలిక్ కలర్‌ వంటి వాటిని స్టాండర్డ్ గా పొందుతుంది. ఇది ఎయిర్ అవుట్‌లెట్ ట్రిమ్ కోసం శాటిన్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ బూట్ లిడ్ పైన పోర్షే బ్రాండింగ్ కనిపిస్తుంది.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇందులో ప్లాటినం ఫినిషింగ్ తో కూడిన 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 'ప్లాటినమ్ ఎడిషన్' లోగోతో బ్లాక్ కలర్ లో బ్రష్ చేసిన అల్యూమినియం డోర్ సిల్ గార్డ్‌లు మరియు బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్‌తో బ్లాక్ ఇంటీరియర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతాయి. మొత్తానికి ఇది చాలా చూడముచ్చటగా ఉంటుంది.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

2021 Porsche Panamera ప్లాటినం ఎడిషన్ 14 వె ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, 14-స్పీకర్‌తో బోస్ సౌండ్ సిస్టమ్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహనానికి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి. పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్ స్టాండర్డ్ ఎడిషన్ మరియు టాప్-ఎండ్ స్టాండర్డ్ ఎస్ ఈ-హైబ్రిడ్ ఎడిషన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్‌ (Porsche Panamera Platinum Edition) యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ మోడల్ 2.9-లీటర్ వి6 ట్విన్-టర్బో ఇంజన్‌ ఉంటుంది. ఇది 326 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అదే విధంగా దీని SE-హైబ్రిడ్ వేరియంట్ 690 బిహెచ్‌పి పవర్ మరియు 870 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్‌ ఎస్ ఈ-హైబ్రిడ్ వేరియంట్‌ మాత్రం 4.0-లీటర్ వి8 ఇంజిన్‌తో పాటు 100 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది కూడా మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. కంపెనీ యొక్క నాలుగు వేరియంట్లు కూడా 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ పిడికె గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

Porsche Panamera Platinum Edition ఇప్పుడు భారత్‌లో; కూడా త్వరపడండి.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త టైకాన్‌ (Taycan) EV ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆల్ ఎలక్ట్రిక్ కార్ ప్రారంభ ధర రూ. 1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి టైకాన్‌ (Taycan) EV రెండు బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉంది. అవి టైకాన్‌ సెడాన్ మరియు టైకాన్ క్రాస్ టురిస్మో ఎస్టేట్.

Porsche Taycan EV గరిష్టంగా 600 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 500 కిమీల రేంజ్‌ను అందించే రెండు హై వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీల ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. టైకాన్ క్రాస్ టురిస్మో టర్బో ఎస్ వేరియంట్ 761 బిహెచ్‌పి పవర్ మరియు 1050 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత శక్తివంతమైన EV గా నిలిచింది.

Most Read Articles

English summary
Porsche panamera platinum edition now available in india details
Story first published: Thursday, December 16, 2021, 9:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X