నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ (Porsche) వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రెండు కొత్త కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో మొదటి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'మకాన్' (Macan) ఎస్‌యూవీ మరియు రెండవది టేకాన్ ఈవీ (Taycan EV) ఆల్-ఎలక్ట్రిక్ కారు.

నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

భారతదేశంలో పోర్ష్ సంస్థకు టేకాన్ ఈవీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ Porsche Taycan EV కంపెనీ తొలిసారిగా సెప్టెంబర్ 2019 లో ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఆ తర్వాత 2020 ప్రారంభంలో వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయబడింది. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ కారు గత ఏడాదే భారత మార్కెట్లో లాంచ్ కావల్సి ఉంది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దాని లాంచ్ ఆలస్యం అయింది.

నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

కాగా, ఇప్పుడు ఈ ఆల్-ఎలక్ట్రిక్ టేకాన్ ఈవీ సెడాన్ ను కంపెనీ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేయనుంది. తాజా సమాచారం ప్రకారం, కొత్త పోర్ష్ మకాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పోర్ష్ టేకాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు నవంబర్ 12, 2021 వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. పోర్ష్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

ముందుగా పోర్ష్ టేకాన్ ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇది బహుళ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో 4ఎస్, టర్బో మరియు టర్బో ఎస్ వేరియంట్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారి రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌ లతో లభిస్తుంది. టేకాన్ ఈవీ 4ఎస్ ట్రిమ్‌ లో తక్కువ-స్పెక్ 79.2kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, టర్బో వేరియంట్‌ లలో 93.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

టేకాన్ ఈవీ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గణాంకాలను పరిశీలిస్తే, 4ఎస్ వేరియంట్‌ 530 పిఎస్ శక్తిని మరియు 640 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, టర్బో వేరియంట్‌ 670 పిఎస్ శక్తిని మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని టాప్-స్పెక్ టర్బో ఎస్ వేరియంట్ 750 పిఎస్ శక్తిని మరియు 1050 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

Porsche Taycan EV యొక్క WLTP సర్టిఫైడ్ రేంజ్ వివరాలు ఇలా ఉన్నాయి (పూర్తి చార్జ్ పై):

  • టేకాన్ ఈవీ 4ఎస్ - 463 కిమీ
  • టేకాన్ ఈవీ టర్బో - 450 కిమీ
  • టేకాన్ ఈవీ టర్బో ఎస్ - 420 కిమీ
  • నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

    పోర్ష్ టేకాన్ ఈవీ ఈ జర్మన్ బ్రాండ్ లభిస్తున్న మొట్టమొదటి మరియు ఆల్-ఎలక్ట్రిక్ సూపర్ కార్. టేకాన్ ఈవీ మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఇది టెస్లా మాదిరిగా సుదీర్ఘమైన రేంజ్‌ను అందించనప్పటికీ, పెర్ఫార్మెన్స్ మరియు మెయింటినెన్స్‌లో ఇది దానికంటే మెరుగ్గా ఉంటుంది. ఆధునిక ఈవీ సాంకేతిక పరిజ్ఞానం, పోర్ష్ యొక్క పాపులర్ హ్యాండ్లింగ్ మరియు డ్రైవింగ్ డైనమిక్‌ల కలయికతో టేకాన్ ఈవీ తయారు చేయబడింది.

    నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

    ఇక ఫేస్‌లిఫ్టెడ్ మకాన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని ఈ ఏడాది జూలై 2021 నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. మునుపటి మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త పోర్ష్ మకాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొన్ని విజువల్ అప్‌డేట్‌లు మరియు కొత్త ఫీచర్లను పొందుతుంది. అలాగే, దీని వేరియంట్ లైనప్ లో కూడా కంపెనీ మార్పులు చేసింది.

    నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

    కొత్త 2022 పోర్ష్ మకాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ శక్తివంతమైన ఇంజన్‌ లతో పాటుగా ముఖ్యమైన మెకానికల్ అప్‌డేట్‌ లను పొందింది. స్టాండర్డ్ పోర్ష్ మకాన్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది, ఇది 265 పిఎస్‌ ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాగా, మకాన్ ఎస్ మోడల్ లోని పాత 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ కు బదులుగా, కంపెనీ ఈ కొత్త మోడల్ లో 2.9 లీటర్ వి6 ఇంజన్‌ ను ఉపయోగించింది.

    నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

    మకాన్ ఎస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క కొత్త 2.9 లీటర్ వి6 ఇంజన్‌ గరిష్టంగా 380 పిఎస్ ల శక్తిని విడుదల చేస్తుంది. అయితే, ఇదే ఇంజన్ టాప్-స్పెక్ మకాన్ జిటిఎస్ మోడల్ గరిష్టంగా 440 పిఎస్ ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ వేరియంట్ కోసం ఇంజన్ ను అప్‌ట్యూన్ చేశారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ పిడికె డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇందులో ఆల్-వీల్ డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

    నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

    పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. కంపెనీ ఇప్పటికే 28,640 యూనిట్లను టేకాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను గ్లోబల్ మార్కెట్లలో విక్రయించింది. ఈ కారు విషయంలో, కంపెనీ కేవలం తొమ్మిది నెలల్లోనే అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు 800 వోల్ట్ ఛార్జర్‌తో అందించబడనుంది. దీని సాయంతో చాలా ఎక్కువ సమయంలోనే బ్యాటరీలను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.

    నవంబర్ 12న Porsche Taycan EV మరియు Macan ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల

    చివరిగా, ధరల విషయానికి వస్తే ప్రస్తుతం, భారత మార్కెట్లో పోర్ష్ మకాన్ ధర రూ. 68.14 లక్షల నుండి రూ. 79.14 లక్షల మధ్యలో ఉంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న మకాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర రూ. 80 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇకపోతే, పోర్ష్ టేకాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Porsche to launch taycan ev and macan facelift in india on 12th november details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X