2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ Pravaig Dynamics (ప్రవైగ్ డైనమిక్స్) గత కొంత కాలంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును తయారుచేయడంలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే చాలా సార్లు రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. Pravaig Dynamics యొక్క ఎలక్ట్రిక్ కారు, లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండనుంది. అయితే కంపెనీ ఈ కారుని పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులతో తయారు చేయబడుతుంది. ఇది అధునాతన లక్షణాలు కలిగిన భారతీయ లగ్జరీ కారు కానుంది.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Pravaig Dynamics కంపెనీ ప్రణాళిక ప్రకారం తన మొదటి ఎలక్ట్రిక్ కారుని 2022 లో విడుదల చేయనుంది. అంతే కాకుండా కంపెనీ 2022 లో దాదాపు 2,500 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే ప్రణాళికలో 2023 నాటికి ఒక లక్ష కార్లను మరియు 2025 నాటికీ మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి సన్నాహాలు చేస్తుంది.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

2022 లో కేవలం 2,500 మాత్రమే ఎందుకు విక్రయిస్తుంది అంటే, ఇది మొదట టాక్సీ ఆపరేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అంటే కంపెనీ మొదటి దశలో దీనిని టాక్సీగా నడపబోతోంది. ఫేజ్ 2 లో ఇది ప్రైవేట్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. కావున మొదటి దశలో అటానమస్ లెవల్ 2 సామర్థ్యం ఇవ్వబడుతుంది. అంతే కాకుండా ఫేజ్ 2 నాటికి వీటి సామర్ధ్యం మరింత మేరుపడుతుంది. అప్పటికి ఇందులో అనేక అప్డేట్స్ వస్తాయని కంపెనీ తెలిపింది.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును టాక్సీగా అందుబాటులోకి తీసుకురానున్న మొదటి కంపెనీ Pravaig Dynamics. ఈ కంపెనీ యొక్క టాక్సీ కార్లను కస్టమర్ Pravaig యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఆధునిక సాంకేతికతలు కలిగి ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్ బెంజ్ వంటి పెద్ద కంపెనీ వాహనాలకి ప్రత్యర్థిగా నిలువనుంది.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

భారతదేశంలో తయారవుతున్న చాలా కార్లు సాధారణంగా చైనా లేదా ఇతర దేశాల నుండి బ్యాటరీలను మరియు ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ సమయంలో Pravaig Dynamics కంపెనీ అన్ని వస్తువులను స్వదేశంలోనే తయారు చేసి వినియోగిచనున్నట్లు తెలిపింది. అంతే కాకూండా Pravaig Dynamics యొక్క యాప్ కూడా కంపెనీ తయారు చేస్తుంది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా, Pravaig Dynamics యొక్క ఎలక్ట్రిక్ కార్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీనికోసం ఇది అటానమస్ టెక్నాలజీ కోసం NVIDIA తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతే కాకుండా ECU మరియు ఇతర కంట్రోల్ మెటీరియల్స్ అన్నీ కూడా కంపెనీ తయారుచేసుకుంటుంది. ప్రీమియం సౌండ్ సిస్టమ్ డెవియాలెట్ నుండి తీసుకోబడుతుంది. టైర్లు సియట్ బ్రాండ్ ఉపయోగించబడతాయి.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Pravaig Dynamics యొక్క ప్రవేగ్ ఎక్స్‌టింక్షన్ అనేది Mk1 ఎలక్ట్రిక్ కారు పేరు, దాని స్కెచ్ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయబడింది. ఇందులో గమనించినట్లయితే కారు యొక్క క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో నాలుగు సీట్లు ఉన్నాయి. దీనిలో ముందు మరియు వెనుక మధ్య విభజన ఇవ్వబడింది. వెనుక కూర్చున్న వ్యక్తుల కోసం ఒక స్పెషల్ డిస్ప్లే ఇవ్వబడింది.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

Pravaig Dynamics యొక్క ఎక్స్‌టింక్షన్ MK1 కారు 96 కిలో వాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 201.5 బిహెచ్‌పి పవర్ మరియు 2400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌టింక్షన్ MK1 ఒక్క బ్యాటరీ ఛార్జ్‌లో గరిష్టంగా 504 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

2022 లో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న Pravaig ఎలక్ట్రిక్ కార్; వివరాలు

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇదే సమయంలో భారతీయ కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా ప్రవేశించడం గర్వించదగ్గ విషయం. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రముఖ లగ్జరీ కార్లతో పోటీ పడే అవకాశం ఉందని భావిస్తున్నాము.భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా ఎక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వాలు కూడా మద్దతుగా అనేక రాయితీలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. కావున ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూడా అత్యంత ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Pravaig dynamics first electric car launch timeline plan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X