QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

దేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో వాహనాలకు సంబంధించిన DL (డ్రైవింగ్ లైసెన్స్) మరియు RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) వంటివి కూడా డిజిటలైజేషన్ విధానంలోకి మారుతున్నాయి. ఇందులో భాగంగానే దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇక వాహనదారులకు అందించే డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి వాటికి QR (క్యూఆర్) కోడ్ మరియు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) వంటి ఫీచర్లతో మైక్రోచిప్ కలిగి ఉంటుంది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

ఇక QR కోడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే మొత్తం ప్రక్రియ డిజిటలైజ్ చేయబడుతోంది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ముందు భాగంలో వాహన యజమాని పేరు ముద్రించబడి ఉంటుంది, అదేవిధంగా ఆ కార్డుకి రెండవవైపున మైక్రోచిప్ మరియు QR కోడ్ అమర్చబడి ఉంటుంది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

ఇప్పటికే ఢిల్లీతో సహా అనేక ఇతర ప్రాంతాలలో ఎంబెడెడ్ చిప్‌లతో కార్డులు జారీ చేయబడుతున్నాయి. ఇలాంటి కార్డులు జరీ చేస్తున్నప్పటికీ తనిఖీ చేసే పోలీసుల వద్ద అవసరమైన సంఖ్యలో చిప్ రీడర్ యంత్రాలు అందుబాటులో లేనందున, చిప్ నుండి సమాచారం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

అంతే కాకుండా చిప్‌లు సంబంధిత రాష్ట్రాలచే రూపొందించబడి ఉంటాయి. కావున చిప్ నుండి సమాచారాన్ని పొందటంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే QR ఆధారిత స్మార్ట్ కార్డులు ఈ సమస్యను సులభంగా నియంత్రిస్తాయి. ఈ QR కోడ్ నుంచి సమాచారం పొందటం కూడా చాలా సులభంగా ఉంటుంది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

ఈ QR కోడ్స్ అన్ని డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన నమోదు వివరాలను వెబ్ ఆధారిత డేటాబేస్, సారథి మరియు వాహన్‌తో లింక్ చేస్తుంది. ఇప్పుడు కార్డ్‌లో ఇచ్చిన QR ని స్కాన్ చేయడం ద్వారా డ్రైవర్ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ గురించి మొత్తం సమాచారం పొందవచ్చు.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

2018 అక్టోబర్ నెలలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నోటిఫికేషన్‌లో, డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో మార్పులు చేయబడ్డాయి. చిప్ మరియు QR ఆధారంగా రూపొందించిన కొత్త DL మరియు RC స్మార్ట్‌కార్డ్‌లను అమలు చేయాలని ఆదేశించింది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

దీనితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు పొందుపరచడానికి డిజిలాకర్ వంటివి ఉపయోగించవచ్చు. స్మార్ట్ డిఎల్ మరియు ఆర్‌సి కార్డులపై ఉండే QR కోడ్ సెక్యూరిటీ ఫీచర్‌గా పనిచేస్తుంది. వాహన యజమాని యొక్క స్మార్ట్ కార్డు స్వాధీనం చేసుకున్న వెంటనే, డిఎల్ హోల్డర్ యొక్క రికార్డులను 10 సంవత్సరాల వరకు మరియు వాహన డేటాబేస్‌లో జరిమానాను సంబంధిత శాఖ చూడవచ్చు. ఈ స్మార్ట్ QR కోడ్ కలిగిన DL మరియు RC వంటివి ఇప్పుడు వాహన వినియోగదారులకు మరియు వాహన తనిఖీదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో వెహికల్ లోన్ తీసుకునే వారు 1 నవంబర్ 2021 నుండి బ్యాంక్ శాఖలు లేదా రవాణా శాఖ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ వాహన్ పోర్టల్‌తో వెహికల్ లోన్ డేటాను అనుసంధానం చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు NBFC లను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

నవంబర్ నుండి, ఢిల్లీలోని ఏదైనా ఆర్థిక సంస్థ నుండి వెహికల్ లోన్ తీసుకునే దరఖాస్తుదారుడు బ్యాంకుకు వెళ్లి వాహనాన్ని హైపోథీకేట్ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ రవాణా శాఖ ఒక ఉత్తర్వులో పేర్కొంది. 2021 అక్టోబర్ 31 తర్వాత ఢిల్లీలో వాహనాల హైపోథికేషన్ కోసం భౌతిక పత్రాలు అవసరం లేదు. వాహన రుణ సంస్థలు లేదా ఆర్థిక సంస్థలు హైపోథికేషన్ రద్దు మరియు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధానం వెహికల్ లోన్ పొందేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

ఢిల్లీ రవాణా శాఖ వెహికల్ ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మొదలైన వాటికి సంబంధించిన పత్రాల చెల్లుబాటును ఇప్పుడు నవంబర్ 30, 2021 వరకు పొడిగించింది. ఫిబ్రవరి, 2020 నుండి సెప్టెంబర్ 30, 2021 మధ్య గడువు ముగిసిన పత్రాలను ఇప్పుడు నవంబర్ 30 వరకు రెన్యువల్ చేసుకోవచ్చు.

QR కోడ్‌తో రానున్న DL మరియు RC.. ఎక్కడో తెలుసా?

ఈ వాహన పత్రాల జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటుగా మోటారు వాహనాల చట్టం 1988 మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 కిందకు వచ్చే అన్ని పత్రాలు ఉంటాయి. దీనికి సంబందించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Qr code based smart driving licence to be issued soon in delhi
Story first published: Friday, October 15, 2021, 15:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X