Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల్లో ఒకటిగా నిలబడింది. ఈ కంపెనీ ఇటీవల తన ఐకానిక్ కారు రెనాల్ట్ 4ఎల్ (Renault 4L) ఉత్పత్తి యొక్క 60 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఎయిర్4 అనే ఫ్యూచరిస్టిక్ షో-కార్‌ను రూపొందించడానికి మోషన్ డిజైన్ హబ్ 'ది ఆర్సెనల్'తో జతకట్టింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

రెనాల్ట్ కంపెనీ తన 4L మోడల్‌ ఫ్లైయింగ్ కారుని దాదాపు 30 సంవత్సరాలకు పైగా 100 దేశాలలో విక్రయిస్తూనే ఉంటుంది. కంపెనీ 60 వ వార్షికోత్సవాన్ని జరుపునే సందర్భంలో ఇది తన ఫ్లైయింగ్ కారు కొత్త డిజైన్‌లో మోడల్‌ను పునర్నిర్వచించింది. ఇది చాలా అధునాతనంగా ఉంటుంది.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

రెనాల్ట్ కంపెనీ షోకార్‌ను రూపొందించడానికి డిజైన్ హబ్ ది ఆర్సెనల్'తో ప్రత్యేకంగా జతకట్టింది. ఇది 4ఎల్ తరహాలో తయారు చేసిన ఎయిర్4 ఫ్లైయింగ్ కారు. ఈ కారులో రెండు బ్లేడ్లతో కూడిన నాలుగు రోటర్లు అమర్చబడి ఉంటాయి. ఎయిర్4 పరిచయంతో, కంపెనీ భవిష్యత్తులో ఎగిరే కార్లను తయారు చేసే ప్రణాళికలను కూడా వెల్లడించింది. కావున కంపెనీ భవిష్యత్ లో ఎగిరే కార్లను మార్కెట్లో అందించే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

రెనాల్ట్ కంపెనీ యొక్క ఎయిర్4 విషయానికి వస్తే, దీని డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని నిర్మాణాన్ని తేలికగా ఉంచడానికి కంపెనీ పూర్తిగా కార్బన్-ఫైబర్‌తో తయారు చేయబడింది. ఈ ఎగిరే కారులో పైలట్‌తో పాటు ఒక ప్యాసింజర్ సీటు కూడా ఇవ్వబడింది. కావున ఇందులో ప్యాసింజర్లు కూడా ప్రయాణించవచ్చు.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

ఈ ఫ్లైయింగ్ కారు యొక్క రోటర్‌కు శక్తినివ్వడానికి, ఇందులో 22,000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ ఎగిరే కారు సెకనుకు 26 మీటర్ల వేగంతో ఎగురుతుంది అని కంపెనీ తెలిపింది. అదే సమయంలో, టేకాఫ్ చేసేటప్పుడు, ఇది సెకనుకు 14 మీటర్ల వేగంతో భూమి పైకి చేరుకుంటుంది.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

ఈ కొత్త రెనాల్ట్ కారు గరిష్టంగా 700 మీటర్ల ఎత్తులో ఎగురుతుందని కార్ల తయారీ సంస్థ తెలిపింది. ఇది కేవలం కంపెనీ యొక్క కాన్సెప్ట్ మోడల్ మాత్రమే, అయితే కంపెనీ తన భవిష్యత్ ఎగిరే కార్లను దాని లైన్‌లలో డిజైన్ చేసే అవకాశం ఉంటుంది. కావున డిజైన్ ఈ కారు మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది.

ఈ కారులోని నాలుగు ప్రొపెల్లర్లు 380 కిలోల వర్టికల్ థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎయిర్4 పూర్తిగా ఫ్రాన్స్‌లోని టెక్నాలజీ పార్క్ సోఫియా యాంటిపోలిస్‌లో రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. ఈ సంవత్సరం రెనాల్ట్ కంపెనీ భారతీయ మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారంభించి దాదాపు 10 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

కంపెనీ ఇప్పటికి తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు 'క్విడ్' 4 లక్షలకు పైగా యూనిట్లను దేశీయ విక్రయించింది. ఈ హ్యాచ్‌బ్యాక్ డిజైన్ దీని అతిపెద్ద ఫీచర్. ఇది దాని కాంపాక్ట్ SUV డిజైన్ మరియు సరసమైన ధర కారణంగా ఎక్కువమంది కొనుగులు దారులు దీనిని కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తూ ఉంటారు.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

రెనాల్ట్ కంపెనీ యొక్క క్విడ్ కారు 2020 లో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. అంతే కాకుండా కంపెనీ ఇటీవల, క్విడ్ మోడల్ లైనప్‌లో స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్‌తో, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మరియు రాబోయే భద్రతా నిబంధనలకు అనుగుణంగా కారు సిద్ధంగా ఉంది.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

ఇది కాకుండా, కంపెనీ రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ ఎడిషన్‌ను కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో (బ్లాక్ రూఫ్‌తో వైట్ బాడీ పెయింట్) పరిచయం చేసింది. కంపెనీ ఈ కారులో ఎలక్ట్రిక్ ORVM మరియు డే & నైట్ IRVM ఫీచర్లను కూడా చేర్చింది. ప్రస్తుతం, రెనాల్ట్ క్విడ్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విక్రయించబడుతోంది, దీని ధరలు రూ. 4.11 లక్షల నుండి రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

Renault నుంచి రానున్న కొత్త ఫ్లైయింగ్ కార్ AIR4: వివరాలు

రెనాల్ట్ క్విడ్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో విక్రయించబడుతోంది. అంతే కాకూండా రెనాల్ట్ క్విడ్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కూడా కలిగి ఉంటుంది కావున ఇప్పటికి కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి కూడా ఇది చాలా దోహదపడుతూనే ఉంది.

Most Read Articles

English summary
Renault flying car air4 unveiled range features details
Story first published: Saturday, November 27, 2021, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X