Just In
- 1 hr ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 4 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- 7 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
రెనో క్విడ్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై రూ.75,000 వరకూ డిస్కౌంట్స్!
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ ఎమ్‌పివి మరియు డస్టర్ ఎస్యూవీ మోడళ్లపై మార్చి 2021 నెలలో భాగంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈనెలలో రూ.75,000 వరకూ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటుగా రెనో తమ కార్ల కొనుగోలు కోసం జీరో పర్సెంట్ వడ్డీ రేట్లను కూడా ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ డిస్కౌంట్ల జాబితాలో కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ మాత్రం లేదు. వివిధ మోడళ్లపై రెనో ఇండియా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
1. రెనో క్విడ్
రెనో ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై కంపెనీ మార్చి 2021 నెల ఆఫర్లలో భాగంగా రూ.50,000 వరకూ తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు (విన్ 20 వాహనాలపై రూ.20,000 నగదు తగ్గింపు, విన్ 21 వాహనాలపై రూ.10,000 నగదు తగ్గింపు), రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ మరియు రూ.10,000 లాయల్టీ బెనిఫిట్లను ఆఫర్ చేస్తున్నారు.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]
వీటితో పాటుగా, ఈ నెలలో క్విడ్ కారును కొనాలనుకునే కస్టమర్లకు రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అలాగే రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కోసం రూ.5,000 ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నారు. లోన్ ద్వారా ఈ కారును కొనాలనుకునే కస్టమర్ల కోసం 5.99 శాతం చొప్పున రుణాలను కూడా ఆఫర్ చేస్తున్నారు.
2. రెనో ట్రైబర్
భారతదేశంలోనే అత్యంత సరమైన 7-సీటర్ కాంపాక్ట్ ఎమ్‌పివి రెనో ట్రైబర్ కొనుగోలుపై కంపెనీ రూ.60,000 తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో ఏఎమ్‌టి వేరియంట్‌పై రూ.30,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ లేదా రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తున్నారు.
MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి
అదే సమయంలో, మాన్యువల్ వేరియంట్‌పై రూ.20,000 నగదు తగ్గింపును అందిస్తున్నారు. మిగిలిన ఆఫర్లు ఏఎమ్‌టి వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. ఈ మోడల్ కొనుగోలుపై కూడా రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రూ.5000 తగ్గింపు మరియు 5.99 శాతం చొప్పున రుణాలను అందిస్తున్నారు.
3. రెనో డస్టర్
రెనో ఇండియా అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్యూవీ డస్టర్‌పై కంపెనీ గరిష్టంగా రూ.75,000 వరకూ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో డస్టర్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్‌పై రూ.75,000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఈ మొత్తంలో రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 వరకు లాయల్టీ బోనస్ మరియు ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.30,000 నగదు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.
MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!
రెనో డస్టర్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్‌పై రూ.45,000 తగ్గింపును ఇస్తున్నారు. ఇందులో ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ.30,000 మరియు లాయల్టీ బెనిఫిట్ రూ.15,000 వరకు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.
వీటితో పాటు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ.15,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ ఎస్‌యూవీలోని టర్బో వేరియంట్ కొనుగోలుపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఈజీ కేర్ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మరియు ఇతర ఆఫర్లకు సంబంధించి మరింత సమాచారం కోసం మీ సమీపం రెనో డీలర్‌షిప్‌ను కూడా సంప్రదించవచ్చు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన