Just In
- 7 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 20 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 21 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Sports
దిగ్గజాలా మజాకా.. మొన్న సెహ్వాగ్.. నిన్న లారా, తరంగా.. ఆ జోరు ఏ మాత్రం తగ్గలేదు.!
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, గడచిన డిసెంబర్ 2020 నెలలో భారతదేశంలో మొత్తం 40 కొత్త కస్టమర్ టచ్‌పాయింట్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. వీటితో కలిపి గత ఏడాది కంపెనీ దేశంలో మొత్తం 120 కొత్త టచ్‌పాయింట్‌లను ప్రారంభించింది.

ఈ కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ ఎన్‌సిఆర్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ ప్రారంభించినట్లు కంపెనీ వివరించింది.

తాజా డేటా ప్రకారం, రెనో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 సేల్స్, 475 సర్వీస్ టచ్‌పాయింట్స్ మరియు 200కి పైగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి రెనో తమ డీలర్‌షిప్‌లను కూడా మెరుగుపరస్తూ వస్తోంది. అంతేకాకుండా, అన్ని డీలర్‌షిప్‌లు మరియు వర్క్‌షాప్‌లలో కస్టమర్లు మరియు సిబ్బంది భద్రత కోసం కోవిడ్-19కి సంబంధించిన అన్ని నిబంధనలను కంపెనీ పాటిస్తోంది.
MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

ఇదిలా ఉంటే, ఈ ఏడాది మధ్య భాగం నాటికి రెనో తమ సరికొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారును జనవరి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనున్నారు. ఇది రెనో కార్ లైనప్‌లో క్విడ్, డస్టర్ మరియు ట్రైబర్ తర్వాత నాల్గవ మోడల్‌గా రానుంది.

రెనో-నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సిఎమ్ఎఫ్ఏ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ మాగ్నైట్‌ను కూడా తయారు చేశారు. ఈ నేపథ్యంలో, నిస్సాన్ మాగ్నైట్ కారులో కనిపించే అనేక ఫీచర్లు, పరికరాలు రెనో కిగర్‌లోనూ కనిపించే అవకాశం ఉంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

రెనో కిగర్ ఎస్‌యూవీని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు. ఇక్కడి నుండే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. గతంలో రెనో విడుదల చేసిన కిగర్ కాన్సెప్ట్‌కి ప్రొడక్షన్ వెర్షన్‌కి అనేక పోలికలు ఉండే అవకాశం ఉంది.

ఈ కారులో ఐస్-క్యూబ్ స్టైల్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఫ్రంట్ గ్రిల్ మధ్యలో పెద్ద రెనో బ్యాడ్జ్ ఉంటాయి. ముందు భాగంలో అమర్చిన ఐస్-క్యూబ్ స్టైల్ డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌లో ప్రతి హెడ్‌ల్యాంప్‌లో మూడు స్ప్లిట్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి. ఫ్రంట్ బంపర్ మధ్యలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా ఉంది. బంపర్ దిగువ భాగంలో మరో మెష్ గ్రిల్, కారు బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుందని తెలుస్తోంది.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

ఇంటీరియర్స్ ఫీచర్ల విషయానికి వస్తే, కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కాగా, రెనో ఇండియా తన గ్లోబల్ లాంచ్ ప్లాన్‌లో భాగంగా, 2025 నాటికి 14 కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ 14 కార్లలో 7 కార్లు పూర్తి ఎలక్ట్రిక్ కార్లు కాగా మిగిలిన 7 కార్లను ఫ్యూయెల్ లేదా హైబ్రిడ్ ఇంజన్‌లతో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.