మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కైగర్'కు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి రెనో ఇండియా అమ్మకాలు భారీగా పెరిగాయి.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

ఈ నేపథ్యంలో, రెనో ఇండియా దేశీయ విపణిలో తమ నెట్‌వర్క్ పరిధిని విస్తరించుకొని, దేశంలోని మారుమూల గ్రామీణ మార్కెట్లలో సైతం తమ కార్లను అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, రెనో ఇండియా సిఎస్‌సి గ్రామీణ్ ఈస్టోర్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తన ఉనికిని బలోపేతం చేయడానికి సిఎస్‌సి గ్రామీణ్ ఈస్టోర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రెనో ఇండియా ప్రకటించింది. రెనో ప్రస్తుతం భారత మార్కెట్లో క్విడ్, ట్రైబర్, కైగర్ మరియు డస్టర్ వంటి కార్లను విక్రయిస్తోంది.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సిఎస్‌సి గ్రామీణ్ ఈస్టోర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొట్టమొదటి నాలుగు చక్రాల వాహనాల తయారీ సంస్థ రెనో ఇండియా కావటం. ఇరు సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా, పెనో తమ ఉత్పత్తులను సిఎస్‌సి గ్రామీణ్ ఈస్టోర్‌లో లిస్ట్ చేయడం జరుగుతుంది.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

ఈ భాగస్వామ్యంలో భాగంగా, రెనో ఇండియా సిఎస్‌సి గ్రామీన్ ఈస్టోర్‌లో లిస్ట్ చేసిన తమ వాహనాలను విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (విఎల్‌ఈ) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సంభావ్య వినియోగదారులకు అందుబాటులో ఉంచబడుతాయి.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్డరింగ్ మరియు డెలివరీని ప్రోత్సహించడానికి సిఎస్‌సి (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో) నిర్వహిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామే ఈ సిఎస్‌సి గ్రామీన్ ఈస్టోర్. ఇది గ్రామీణ భారతదేశంలో డిజిటల్ చేరికను రియాలిటీ చేస్తుంది.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

రెనో ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ తమ ఉత్పత్తులను విఎల్‌ఈలకు సరఫరా చేయడానికి ఒక యంత్రాంగాన్ని తీసుకువస్తుందని, ఇది ఎంపిక చేసిన సిఎస్‌సి రూరల్ ఇస్టోర్‌లో ఉత్పత్తులను జాబితా చేయడంలో సహాయపడుతుందని తెలిపింది. విఎల్‌ఈలు గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో ఉండే సంబంధిత రెనో అధీకృత డీలర్‌షిప్‌ల సపోర్ట్ ద్వారా కస్టమర్ ఎండ్ ఎంక్వైరీలను ప్రోత్సహిస్తారు.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

ఈ విషయం గురించి రెనో ఇండియా కంట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిల్లాపల్లె మాట్లాడుతూ.. తమ సంస్థ గ్రామీణ మార్కెట్లలో విపరీతమైన సామర్థ్యాన్ని చూస్తుందని మరియు గ్రామీణ మార్కెట్లో తమ ఉనికిని పెంచుకోవడానికి ఒక వినూత్నమైన మరియు సమగ్ర వ్యూహంతో అగ్రెసివ్‌గా వ్యవరిస్తోందని అన్నారు.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

ఇటీవలి కాలంలో దేశంలో వచ్చిన డిజిటల్ పరివర్తన భౌతిక సరిహద్దులు మరియు అవరోధాలను చెదరగొట్టడంలో విప్లవాత్మక మార్పును తెచ్చిపెట్టింది. ఇది వివిధ గ్రామీణ మరియు పాక్షిక పట్టణ మార్కెట్లను సాధారణ వేదికపైకి తీసుకురావడానికి సహాయపడింది.

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!

రెనో ఇండియా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని పెంచుకునేందుకు గ్రామీణ మరియు చిన్న పట్టణాల నుండి 500 మంది విద్యావంతులైన యువకులను నియమించుకుంది. ఆయా ప్రాంతాల్లో రెనో కార్లను మార్కెటింగ్ చేయటానికి వారికి తగిన శిక్షణ ఇచ్చి, గ్రామీణ సేల్స్ ఇంజనీర్లు మార్చారు. ఇది దేశంలో తమ పరిధిని పెంచడానికి మరియు గ్రామీణ మార్కెట్లో బలమైన నెట్‌వర్క్‌ను సృష్టించడానికి కంపెనీ చేపట్టిన మరొక చొరవ అని ఆయన అన్నారు.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault India Partnership With CSC Grameen eStore To Expand Its Rural Presence, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X