నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనో ఇండియా గత నెల 15వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో కైగర్' డెలివరీలను నేటి (మార్చి 3వ తేదీ) నుండి దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని రూ.5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది.

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

సరసమైన ధరకే అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ కైగర్ వినియోగదారుల నుండి మంచి స్పందన పొందుతోంది. రెనో ఇండియా ఈ మోడల్‌ను రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. కంపెనీ త్వరలోనే ఈ మోడల్ బుకింగ్ గణాంకాలకు సంబంధించిన సమాచారం తెలియజేయనుంది.

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

నిస్సాన్ మాగ్నైట్ (రూ.5.49 లక్షల ప్రారంభ ధర) ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ రూ.5.45 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.55 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెనో కైగర్ విడుదలైంది. ఈ విభాగంలో ఇది హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ సిఎమ్‌ఎఫ్-ఎ + ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ మాగ్నైట్‌ను కూడా తయారు చేస్తున్నారు. మాగ్నైట్ మాదిరిగానే కైగర్ కూడా రెండు పెట్రోల్ ఆంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది మొత్తం RXE, RXL, RXT మరియు RXZ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనో కైగర్ సింగిల్ కలర్ ఆప్షన్స్‌తో పాటుగా, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్స్‌తో కూడా లభిస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

టాప్ ఎండ్ వేరియంట్ అయిన రెనో కైగర్ ఆర్ఎక్స్‌జెడ్‌లో ట్రై-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ట్విన్-స్లాట్ క్రోమ్ గ్రిల్, సి-ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇందులో నార్మల్, ఎకో మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైన ఉన్నాయి.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

నేటి నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఇదిలా ఉంటే, రెనో కైగర్ కోసం కంపెనీ ప్రత్యేకమైన యాక్ససరీ ప్యాకేజ్‌లను కూడా అందిస్తోంది. ఈ ఎస్‌యూవీని మరింత అందంగా మార్చుకోవటం కోసం కంపెనీ ఇందులో స్మార్ట్ ప్యాక్, స్మార్ట్ ప్లస్ ప్యాక్, అట్రాక్టివ్ ప్యాక్, ఎస్‌యూవీ ప్యాక్ మరియు ఎసెన్షియల్ ప్యాక్ అనే 5 యాక్సెసరీ ప్యాక్‌లను అందిస్తోంది. కస్టమర్లు వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయవచ్చు.

Image Courtesy: Gopinathji Renault

Most Read Articles

English summary
Renault Kiger Compact SUV Deliveries Commenced From Today, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X