కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో కోసం ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనాల్ట్ తన కొత్త కిగర్ ఎస్‌యూవీ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ స్పెక్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. కొత్త రెనాల్ట్ కిగర్ భారతదేశంలో బ్రాండ్ యొక్క సబ్-4 మీటర్ల కాంపాక్ట్-ఎస్‌యూవీ ఆఫర్‌గా ఉంటుంది. ఇది అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి స్పోర్టి డిజైన్ కలిగి ఉండటంతో పాటు బలమైన పనితీరు గల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంటుంది.

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

కొత్త రెనాల్ట్ కిగర్ గత సంవత్సరం 2020 చివరలో ఆవిష్కరించబడిన దాని కాన్సెప్ట్ వెర్షన్ నుండి చాలా స్టైలింగ్ అంశాలతో ముందుకు తీసుకువెళుతుంది. దీని ముందు భాగంలో సొగసైన క్రోమ్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది. ఇది ఎల్ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ డిఆర్ఎల్ తో అనుసంధానించబడి ఉంటుంది.

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

రెనాల్ట్ కిగర్ డిఆర్‌ఎల్‌ల క్రింద ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఫ్రంట్ బంపర్‌ బ్లాక్ క్లాడింగ్‌తో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ ఉంది. ఇది ఎస్‌యూవీ చుట్టూ కూడా విస్తరించి ఉంది. రెనాల్ట్ కిగర్ బలమైన బోనెట్‌ను కలిగి ఉంది. ఇది వాహనానికి చాలా దూకుడుగా మరియు స్పోర్టి రూపాన్ని ఇస్తుంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

సైడ్ ప్రొఫైల్ విషయానికి వెళ్లేకొద్దీ రెనాల్ట్ యొక్క కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవీలో 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, వీటికి పెద్ద వీల్ ఆర్చెస్ కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌తో ముగుస్తుంది. బ్లాక్ రూఫ్ మరియు సి-ఫిల్లర్ స్పోర్ట్‌నెస్‌కు మరింత తోడ్పడతాయి.

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

రెనాల్ట్ కిగర్ వెనుక భాగం మినిమాలిక్ ఇంకా స్టైలిష్. సి-ఆకారపు ఎల్‌ఈడీ టైల్లైట్‌లు ఎస్‌యూవీ బాడీవర్క్ యొక్క అంచు వరకు విస్తరించబడ్డాయి. బూట్ లిడ్ మధ్యలో 'కిగర్' బ్యాడ్జింగ్‌తో ఉంచబడుతుంది. వెనుక బంపర్ బ్లాక్ కలర్ లో పూర్తవుతుంది మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కలిగి ఉంది.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

రెనాల్ట్ కిగర్ యొక్క ఇంటీరియర్స్ కూడా అనేక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కిగర్ మల్టీ-స్కిన్ 7 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అందించబడుతుంది, ఇది డ్రైవర్‌కు వివిధ సమాచారాన్ని అందిస్తుంది. స్టీరింగ్ వీల్‌లోని స్విచ్‌ల ద్వారా సమాచారాన్ని మరింత టోగుల్ చేయవచ్చు.

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

కిగర్‌లోని సెంటర్ కన్సోల్ వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, 29.1-లీటర్స్ బెస్ట్-ఇన్-సెగ్మెంట్ క్యాబిన్ స్టోరేజ్ స్పేస్, ఆర్కామిస్ 3 డి సౌండ్ సిస్టమ్, కీలెస్ ఇగ్నీషియస్, యాంబియంట్ లైటింగ్ మరియు పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్ వంటివి ఉన్నాయి.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

కొత్త రెనాల్ట్ కిగర్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 100 బిహెచ్‌పి మరియు 160 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ సివిటి మరియు / లేదా ఎఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లకు జతచేయబడుతుంది.

కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్ ; పూర్తి వివరాలు

కిగర్ కూడా 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుందని, 405 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. రెనాల్ట్ కిగర్ గత సంవత్సరం కరోనా మహమ్మరి కారణంగా ఇప్పుడు ఆవిష్కరించబడింది. అయినప్పటికీ, రెనాల్ట్ లాంచ్ తేదీ మరియు దాని కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవీ ధరలను ఇంకా వెల్లడించలేదు. కొత్త రెనాల్ట్ కిగర్ దేశీయ మార్కెట్లో ఒకసారి లాంచ్ అయినా తర్వాత నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

Most Read Articles

English summary
All-New Renault Kiger Compact-SUV Globally Unveiled. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X