మైలేజ్ విషయంలో Renault Kiger అదుర్స్.. మైలేజ్ ఎంతో తెలుసా..!!

Renault (రెనాల్ట్) కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన SUV లలో ఒకటి Renault Kiger (రెనాల్ట్ కిగర్). ఈ సబ్ 4 మీటర్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. ఈ కారణంగా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇటీవల కంపెనీ ARAI (ఏఆర్ఏఐ) టెస్టింగ్ సర్టిఫికేషన్ ప్రకారం ఈ Kiger ఒక లీటరుకు 20.5 కిలోమీటర్ల మైలేజ్ అందించినట్లు ప్రకటించింది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

రెనాల్ట్ కిగర్ దేశీయ మార్కెట్లో రూ. 5.64 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ SUV AMT మరియు CVT మరియు మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లతో (ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్) వస్తుంది. ఈ SUV ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి RXE, RXL, RXT, RXT (O) మరియు RXZ. ఇప్పటివరకు కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఈ SUV నిలిచింది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

దేశీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అత్యంత పాపులర్ మోడల్ 'రెనాల్ట్ కిగర్' నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్ మరియు భారత మార్కెట్లో ఇటీవల విడుదలయిన టాటా పంచ్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. పంచ్ ఎస్‌యువి మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 18.97 కిలోమీటర్లు మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 18.82 కిమీ/లీ మరియు AMT గేర్‌బాక్స్ ప్రకారం 18.82 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రెనాల్ట్ కిగర్ మైలేజ్ పరంగా టాటా పంచ్ కంటే కూడా ముందు ఉంటుంది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

అయితే నిస్సాన్ మాగ్నైట్ యొక్క మాన్యువల్ వేరియంట్ 18.75 కిమీ/లీ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు CVT వేరియంట్‌లలో వరుసగా 20 కిమీ/లీ మరియు 17.7 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది. అదేవిధంగా కియా సోనెట్ డీజిల్ ఆటోమేటిక్ 19.0 కిమీ/లీ మరియు టర్బో పెట్రోల్ IMT 18.2 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది. ఈ మోడల్స్ పరిధి కూడా రెనాల్ట్ కిగర్ కంటే తక్కువ.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

ఇక మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ వెన్యూ విషయానికి వస్తే, ఇందులోని 1.0 లీ టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్‌ వేరియట్స్ వరుసగా 18.27 కిమీ/లీ మరియు 18.15 కిమీ/లీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిలో అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలుదారులు కోరుకుంటారు. కావున ప్రస్తుతం మైలేజ్ పరంగా రెనాల్ట్ కిగర్ పైన చెప్పిన మోడల్స్ అన్నింటికంటే ముందు నిలిచింది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

Renault కంపెనీ యొక్క Renault Kiger కాంపాక్ట్ SUV పై కంపెనీ అరుదైన ఆఫర్స్ అందిస్తుంది. ఈ కారుపై కంపెనీ ఇప్పుడు రూ .95,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ .10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ మరియు 'Buy Now, Pay in 2022' వంటి ఆఫర్ అందిస్తోంది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

రెనాల్ట్ కిగర్ CMFA+ ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేయబడింది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్, ఫ్రంట్ లార్జ్ గ్రిల్ క్రోమ్ హనీకాంబ్ ప్యాటర్న్ మరియు ఫ్లాట్ బోనెట్ పొందుతుంది. రెనాల్ట్ కిగర్‌కు SUV- కూపే లాంటి డిజైన్ ఇవ్వబడింది, అంతే కాకుండా, ఇది 205 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది, కావున ఇది సాధారణ ఆఫ్ రోడింగ్ కి చాలా ఉత్తమమైనది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

రెనాల్ట్ కిగర్ మంచి ఇంటీరియర్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. క్యాబిన్‌లో హై సెంటర్ కన్సోల్ ఇవ్వబడింది, దీనిలో కన్సోల్‌లు, ఫ్యాన్ స్పీడ్ మరియు టెంపరేచర్ కంట్రోల్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కిగర్ SUV లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి నార్మర్ మోడ్, ఎకో మోడ్ మరియు స్పోర్ట్స్ మోడ్. ఇందులో అర్కామి యొక్క 3 డి సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది, ముందు క్యాబిన్‌లో 4 స్పీకర్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

ప్రస్తుతం, భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న సమయంలో వాహనాలను వినియోగించేవారి పరిస్థితి చాలా వర్ణనాతీతం అయ్యింది. ఈ సమయంలో ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు, కావున ఇప్పుడు రెనాల్ట్ కంపెనీ యొక్క కిగర్ ఉత్తమమైన మైలేజ్ అందించే వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది.

మైలేజ్ విషయంలో నేనే బెస్ట్: Renault Kiger

ప్రస్తుతం దేశంలో మొదలైన పండుగ సీజన్లో ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడానికి రెనాల్ట్ కంపెనీ ఉతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తోంది. కావున ఈ సమయంలో కార్లు కొనాలని యోచించే వారికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Renault kiger mileage revealed best in segment details
Story first published: Tuesday, October 19, 2021, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X