భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT(O); ధర రూ. 7.37 లక్షలు

ప్రముఖ ప్రెంచ్ వాహన తయారీదారు రెనాల్ట్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కిగర్ ఎస్‌యువికి అతి తక్కువ కాలంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. కావున ఇప్పుడు కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ఏకంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ మార్కెట్లో తన రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్ విడుదల చేసింది. ఈ కొత్త రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) ప్రారంభ ధర రూ. 7.37 లక్షలు. ఈ వేరియంట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

రెనాల్ట్ ఇండియా యొక్క అమ్మకాలు మునుపటి నెలలో చాలా వరకు మందకొడిగా ఉండేవి. అవితే కంపెనీ దేశీయ మార్కెట్లో తన కిగర్ ఎస్‌యువిని విడుదల చేసిన తర్వాత నెలవారీ అమ్మకాల సంఖ్య పెరుగుదల దిశకు చేరింది. అయితే కంపెనీ ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్ బుకింగ్‌లు 2021 ఆగస్టు 06 నుండి ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

రెనాల్ట్ కిగర్ యొక్క ఈ కొత్త వేరియంట్ 1.0-లీటర్ ఎనర్జీ ఇంజిన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, రెనాల్ట్ కిగర్ యొక్క కొత్త వేరియంట్ 'ట్రై-ఆక్టా' ఎల్ఈడీ ప్యూర్ విజన్ హెడ్‌లైట్లు మరియు 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లను పొందుతుంది.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్లో అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ఫీచర్లు కిగర్ యొక్క అత్యంత ఖరీదైన ఆర్ఎక్స్జెడ్ వేరియంట్ నుండి తీసుకోబడ్డాయి. అయితే ఈ ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఈ కొత్త వేరియంట్ ధర తక్కువగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

రెనాల్ట్ కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్లోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పిఎమ్2.5 అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఇది క్యాబిన్లోని గాలిని శుద్ధి చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇందులో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

కిగర్ ఆర్ఎక్స్‌టి(ఓ) వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌ను కూడా పొందుతుంది, ఇది వినియోగదారుని తన స్మార్ట్‌ఫోన్‌ను 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌కు ప్రతిబింబించేలా చేస్తుంది. కంపెనీ తన అమ్మకాలను మరింత పెంచే ప్రయత్నంలో, మహారాష్ట్ర, గుజరాత్, గోవా మరియు కేరళ మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో రెనాల్ట్ 'ఫ్రీడమ్ కార్నివాల్' పేరుతో ఆఫర్లను ప్రవేశపెట్టింది.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కంపెనీ ఈ అద్భుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ రాబోయే వినాయక చవితి మరియు ఓనమ్ వంటి పండుగ సమయాల్లో ప్రవేశపెట్టబడుతుంది. 'ఫ్రీడమ్ కార్నివాల్' ఆగస్టు 6 నుంచి 15 మధ్య అందుబాటులో ఉంటుంది. 'ఫ్రీడమ్ కార్నివాల్' ఆఫర్ కింద రెనాల్ట్ కార్లను బుక్ చేసుకునే కస్టమర్‌లకు దాదాపు రూ. 90,000 వరకు సాధారణ ప్రయోజనాలను మరియు అదనపు ఆఫర్‌లను పొందుతారు.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు కొత్తగా 'ఇప్పుడు కొనండి, 2022 లో చెల్లించండి' పథకాన్ని కూడా అందిస్తోంది, ఇక్కడ కస్టమర్ క్విడ్, ట్రైబర్ లేదా కిగర్ వంటి కార్లను కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా కొనుగోలు చేసిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత నుంచి ఈఎమ్ఐ చెల్లించడం ప్రారంభించవచ్చు.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

ఫ్రెంచ్ తయారీదారు అయిన రెనాల్ట్ కంపెనీ భారతీయ మార్కెట్లో గత పది సంవత్సరాల నుంచి దాదాపు 7 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. ఈ సంఖ్య కంపెనీ యొక్క గరిష్ట అమ్మకాలను తెలుపుతుంది. దీన్ని బట్టి చూస్తే రెనాల్ట్ కంపెనీ దేశీయ మార్కెట్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది.

భారత్‌లో విడుదలైన రెనో కిగర్ RXT (O); ధర రూ. 7.37 లక్షలు

రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ల వల్ల మరిన్ని ఎక్కువ అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారత మార్కెట్లో విడుదలైన కొత్త కిగర్ యొక్క కొత్త ఆర్ఎక్స్‌టి(ఓ) వేరియంట్ మరింత సరసమైన ధర వద్ద ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Renault kiger rxt o variant launched in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X