4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న చిన్న కారు రెనో క్విడ్ (Renault Kwid) అరుదైన మైలురాయిని చేరుకుంది. రెనో క్విడ్ భారతదేశంలో 4 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని కంపెనీ ప్రకటించింది. రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ను తొలిసారిగా 2015 లో భారత మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి ఇది ఈ విభాగంలో గేమ్ ఛేంజర్ గా మారింది. సరసమైన ధర, పెప్పీ లుక్ మరియు అద్భుతమైన ఫీచర్ల కారణంగా మార్కెట్లో ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

రెనో బ్రాండ్ భారతదేశంలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఇటీవలే రిఫ్రెష్డ్ 2021 మోడల్ రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ను ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో కొత్త 2021 రెనో క్విడ్ ధరలు రూ. 4.11 లక్షల నుండి, రూ. 5.56 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఈ కొత్త మోడల్ మునుపటి మోడల్ కంటే ఆకర్షణీయమైన ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు మరియు మెరుగైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

కంపెనీ ఈ కొత్త 2021 Renault Kwid హ్యాచ్‌బ్యాక్ ని 0.8 లీటర్ మరియు 1.0 లీటర్ అనే రెండు రకాల ఇంజన్ ఆప్సన్లతో అందిస్తోంది. ఈ కారులో కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్‌ లైట్లు మరియు అల్లాయ్ వీల్స్‌ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కూడిన 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్ఈడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లతో లభిస్తుంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్తగా అప్‌డేట్ చేయబడిన రెనో క్విడ్ యొక్క అన్ని వేరియంట్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తాయి. ఇంకా ఇందులో రియర్ సెన్సార్లు, స్పీడ్-అలర్ట్ సిస్టమ్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) మరియు డ్రైవర్ సైడ్ పైరోటెక్ అండ్ ప్రీటెన్షనర్‌ తో కూడిన సీట్‌బెల్ట్ తో వస్తుంది. సేఫ్టీ ఫీచర్ల విషయంలో ఇది ప్రస్తుత భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

కొత్త రెనో క్విడ్ ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో వైట్ విత్ బ్లాక్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ కారులో ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ మరియు డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

క్విడ్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ కొత్త 2021 మోడల్ లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో కేవలం కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. ముందు చెప్పుకున్నట్లుగా, రెనో క్విడ్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒకటి 800 సిసి ఇంజన్ మరొకటి 1000 సిసి ఇంజన్.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

ముందుగా, 0.8 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 54 బిహెచ్‌పి పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అలాగే, ఇందులోని 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 68 బిహెచ్‌పి పవర్ ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

భారత మార్కెట్లో రెనో క్విడ్ విడుదలైనప్పటి నుండి ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. మొదటిసారిగా కారు కొనాలనుకునే వారికి రెనో క్విడ్ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది. దీని కాంపాక్ట్ పరిమాణం వలన నగర వీధుల్లో సంచరించడానికి మరియు ఇరుకైన ప్రదేశాల్లో కూడా సులువుగా పార్క్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

తాజాగా, దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Renault Kwid (రెనాల్ట్ క్విడ్) ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, నిర్ధిష్టమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ ఇప్పుడు మునుపటికంటే కూడా ఎక్కువ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల మార్కెట్లో మంచి అమ్మకాలను కొనసాగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఈ విభాగంలో మారుతి సుజుకి సుజుకి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ శాంత్రో మరియు డాట్సన్ రెడి-గో వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ:

ఇదిలా ఉంటే, రెనో భారతదేశంలో క్విడ్ మరియు కైగర్ మోడళ్ల విజయం తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్ కోసం మరొక కొత్త ఎస్‌యూవీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఓ కొత్త టీజర్ ను కూడా విడుదల చేసింది. రెనో అర్కానా (Renault Arkana) ఎస్‌యూవీ టీజర్ తో పాటుగా కంపెనీ "మేము సిద్ధంగా ఉన్నాము" (we're ready) అంటూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

4 లక్షల మంది కస్టమర్లకు చేరువైన Renault Kwid.. ఈ కారు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

రెనో అర్కానా అనేది ఎస్‌యూవీ-ప్రేరేపిత డిజైన్‌ తో రూపొందించబడిన ఓ 5 సీటర్ క్రాస్ఓవర్ మోడల్ కారు. రెనో ఇప్పటికే ఈ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఒకవేళ, ఈ క్రాసోవర్ భారతదేశంలో విడుదల చేయబడితే, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault kwid achieves 4 lakh sales milestone in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X