Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఫ్రెంచ్ కార్ బ్రాండ్ 'రెనో' (Renault) కూడా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, జర్మనీలో జరుగుతున్న ఐఏఏ మ్యూనిచ్ 2021 ఆటో షోలో కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు రెనో మెగాన్ ఇ-టెక్ (Renault Megane E-Tech) ను ఆవిష్కరించింది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

Renault Megane అనేది కంపెనీ యొక్క ఐకానిక్ కార్ బ్రాండ్, ఇది 26 సంవత్సరాలుగా మరియు నాలుగు వేర్వేరు తరాల పాటు కంపెనీ లైనప్‌లో ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన ఎలక్ట్రిక్ వెర్షన్ మెగాన్, దాని డిజైన్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. రెనో యొక్క CMF-EV మాడ్యులర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ పై రూపొందిన Megane E-Tech ఎలక్ట్రిక్ ఒక జీరో-ఎమిషన్ క్రాస్ఓవర్.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

Renault Megane E-TECH ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ ను అభివృద్ధి చేసింది. ఈ ఎస్‌యూవీ యొక్క చౌకైన వేరియంట్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 130 హార్స్ పవర్ ల శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని ఖరీదైన వేరియంట్ గరిష్టంగా 218 హార్స్ పవర్ ల శక్తిని మరియు 300 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

ఈ ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ సామర్థ్యాల ఎంపికతో రానుంది. ఇందులో మొదటిది 40 kWh మరియు రెండవది 60 kWh. కస్టమర్ ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ ని బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్ వరుసగా 300 కిమీ మరియు 470 కిమీ గా ఉంటుందని కంపెనీ వివరించింది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

ఇక Renault Megane E-TECH డిజైన్ ను గమనిస్తే, ఇది చాలా వరకూ ఫ్లోటింగ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ముందు వైపు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హెడ్‌ల్యాప్ క్లస్టర్, ఫ్రంట్ హుడ్ మరియు బంపర్ మధ్యలో అమర్చిన పెద్ద రెనో లోగో, పెద్ద ఎయిర్ డ్యామ్ తో కూడిన ఫ్రంట్ బంపర్, వెనుక వైపు స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రెండు లైట్లను కలుపుతూపోయే సన్నటి ఎల్ఈడి లైట్ స్ట్రిప్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కలర్ రూఫ్ మరియు విశాలమైన ఫ్రంట్ విండ్‌షీల్డ్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

అలాగే, ఇంటీరియర్‌లను గమనిస్తే, ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు సెంట్రల్ కన్సోల్ మల్టీమీడియా స్క్రీన్‌ను కలిపే ఓపెన్ఆర్ సింగిల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. సెంటర్ కన్సోల్ లో నిలువుగా అమర్చిన టాబ్లెట్ మాదిరిగా ఉండే టచ్‌స్క్రీన్ సాయంతో ఈ కారులోని అన్ని ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

ఇది లేటెస్ట్ జనరేషన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, USB-C పోర్ట్‌లతో పాటుగా అధునాతన కనెక్టివిటీ మరియు ఆన్‌బోర్డ్ సేఫ్టీ మరియు ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. రెనో ఇందులో కొత్త ఓపెన్‌ఆర్ లింక్ సిస్టమ్‌ను గూగుల్‌తో జోడించింది, దీని ద్వారా డ్రైవర్ సహజమైన మరియు కనెక్ట్ అయిన అనుభవాన్ని పొందుతారని తెలిపింది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ యొక్క CMF-EV ప్లాట్‌ఫారమ్ పై రూపుదిద్దుకున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం చాలా విశాలంగా ఉండి, మెరుగైన ప్రాక్టికాలిటీని అందిస్తుంది అని Renault పేర్కొంది. ఈ కారులో డ్రైవ్-షాఫ్ట్ టన్నెల్‌ని మరియు సెంటర్ కన్సోల్‌పై గేర్ స్టిక్ ను తీసివేసి, వాటిని కంట్రోల్ ప్యానెల్‌లో ఇంటిగ్రేటెడ్ చేసినందున ఇంటీరియర్ స్పేస్ గరిష్టంగా లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొత్తం పొడవు 4.21 మీటర్లు, ఎత్తు 1.50 మీటర్లు, వీల్‌బేస్ 2.7 మీటర్లు మరియు బరువు 1,624 కిలోలుగా ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీల కలయికతో రూపొందిన డిజైన్ కారణంగా దీని ఏరోడైనమిక్ సామర్థ్యం చాలా మెరుగ్గా ఉంటుంది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

Renault Megane E-TECH ఎలక్ట్రిక్ కారును రాఫెల్ గ్రే, స్కిస్ట్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, డైమండ్ బ్లాక్ మరియు గ్లేసియర్ వైట్ అనే ఆరు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులో డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

భారత మార్కెట్లో 2021 Renault Kwid లాంచ్..

ఇదిలా ఉంటే, Renault India దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న Kwid (క్విడ్) హ్యాచ్‌బ్యాక్‌ లో ఓ కొత్త 2021 మోడల్ ను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 4.06 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. అలాగే, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 5.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ఫుల్ డీటేల్స్..

రెనో ఈ కొత్త 2021 Kwid హ్యాచ్‌బ్యాక్ కారుని 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. మునుపటితో పోలిస్తే, ఈ కొత్త 2021 Renault Kwid హ్యాచ్‌బ్యాక్ లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా స్వల్ప అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault megane e tech electric suv revealed at iaa munich 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X