రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా, ఇటీవల 'రూరల్ ఫ్లోట్' అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ కొత్త విధానం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా రెనాల్ట్ అమ్మకాలను పెంచుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ఈ ప్రచారాన్ని ఇప్పటికే 13 రాష్ట్రాల్లోని 233 నగరాల్లో కేవలం 3 నెలల కాలంలో ప్రారంభించింది.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

రెనాల్ట్ యొక్క 'రూరల్ ఫ్లోట్' అనేది పూర్తిగా మొబైల్ షోరూమ్ లాంటిది. ఇది కొత్త రెనాల్ట్ కిగర్‌ను చాలా నగరాల్లో ప్రదర్శించింది. ఈ విధానాన్ని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలు చేసింది. ఇందులో హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు రాజస్థాన్ ఉన్నాయి.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 2,700 కి పైగా టెస్ట్ డ్రైవ్‌లు నిర్వహించామని, దీని ద్వారా సుమారు 23,000 మంది వినియోగదారులు ఆసక్తి చూపారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, రెనాల్ట్ దేశవ్యాప్తంగా 500 కి పైగా షోరూమ్‌లు మరియు సర్వీస్ సెంటర్లను కలిగి ఉంది. వీటిలో 200 కి పైగా వర్క్‌షాప్-ఆన్-వీల్స్ ఉన్నాయి.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

కొంతకాలం క్రితం రెనాల్ట్ యొక్క ట్రైబర్‌ ఎంపివికి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ కారణంగా ఇది దేశంలో అత్యంత సురక్షితమైన ఎంపివిలలో ఒకటిగా నిలిచింది. కావున ఈ కారు యొక్క అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ఈ రూరల్ ఫ్లోట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

ఈ నెల ప్రారంభంలో, రెనాల్ట్ ఇండియా తన కార్ల ధరలను పెంచినట్లు అధికారికంగా తెలిపింది. ఈ ధరల పెరుగుదల రెనాల్ట్ యొక్క కొత్త కిగర్ ఎస్‌యూవీపై కూడా ప్రభావం చూపింది. ధరల పెరుగుదల తర్వాత ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర 39,000 రూపాయలు అధికంగా ఉంది.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

ఈ ఎస్‌యూవీకి చెందిన వివిధ వేరియంట్ల ధరలను కంపెనీ రూ. 9,000 నుంచి రూ. 39,000 వరకు పెంచింది. ఈ కారణంగా, ఇప్పుడు కిగర్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో రూ. 5.64 లక్షల నుంచి రూ. 10.08 లక్షల మధ్య విక్రయిస్తున్నారు.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

రెనాల్ట్ కిగర్ దాని విభాగంలో ఆకర్షణీయంగా రూపొందించిన మోడల్, ఇది ట్రైబర్ మరియు క్విడ్ కలయికగా కనిపిస్తుంది. ఇది ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, సి ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి టెయిల్ లైట్, ఓఆర్‌విఎంలపై టర్న్ ఇండికేటర్, బ్లాక్ ఓఆర్‌విఎంలు, రియర్ స్పాయిలర్, శాటిన్ సిల్వర్ రూఫ్ రైల్ వంటివాటిని కలిగి ఉంటుంది.

రెనో అమ్మకాలకు కొత్త వ్యూహం.. మొబైల్ షోరూమ్స్

రెనాల్ట్ కిగర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో రెండు ఇంజన్లు ఉంటాయి. అవి 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. మొదటి ఇంజిన్ 72 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగా, రెండవది 100 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
New Renault Initiative Trains Sights On Rural India, Displays Kiger At Mobile Showrooms. Read in Telugu.
Story first published: Friday, June 25, 2021, 15:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X