మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) నుండి దేశీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత చవకైన 7-సీటర్ కారు రెనో ట్రైబర్ (Renault Triber). అధిక ధర చెల్లించి మారుతి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా వంటి 7-సీటర్ కార్లను కొనలేని వారికి రెనో ట్రైబర్ చక్కటి ప్రత్యామ్నాయంగా మరియు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఆధునిక అల్ట్రా మాడ్యులర్ రూపాన్ని ప్రాక్టికాలిటీతో కలపడం వల్ల రెనో ట్రైబర్ విజయం సాధించింది. ప్రస్తుతం, ట్రైబర్ భారతదేశంలో రెనో బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఇదొక మంచి ఫ్యామిలీ కార్ మరియు ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండటం వలన, రెనో ట్రైబర్ ను ఇష్టపడే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ప్రస్తుతం, మార్కెట్లో ఈ బహుళ ప్రయోజన వాహనం (మల్టీ పర్పస్ వెహికల్ - ఎమ్‌పివి) యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.50 లక్షల నుండి రూ. 9 లక్షల మధ్యలో ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా రెనో ట్రైబర్ ఎమ్‌పివిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఈ కారు కొనడం వలన మీకు కలిగే లాభాలు మరియు నష్టాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

రెనో ట్రైబర్ ఎమ్‌పివి లాభాలు:

రెనో ట్రైబర్ యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో మొదటి దీని ఇంటీరియర్ క్యాబిన్. సరసమైన ధర, కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ, కంపెనీ దాని క్యాబిన్ విషయంలో చాలా చక్కగా డిజైన్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో చాలా విశాలమైన క్యాబిన్ మరియు 7 గురు ప్రయాణీకులు కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉంటుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఈ కారు డిజైన్ విషయంలో రెనో ఇంజనీర్లు చాలా తెలివిగా వ్యవహరించారు. ఇది కంపెనీ విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ రెనో డస్టర్ కంటే కూడా పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, ఈ కారులో ప్రయాణికులకు ఎక్కువ క్యాబిన్ స్థలం లభిస్తుంది. ఈ ఎమ్‌పివి 2636 మిమీ వీల్‌బేస్‌, 1.7 మీటర్ల వెడల్పు మరియు 1.6 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

పరిమాణం పరంగా, ఇది విటారా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సొనెట్ వంటి మోడళ్లతో పోటీ పడినప్పటికీ, ఇందులో 7-సీట్లు లభిస్తాయి. పైన తెలిపిన మోడళ్లనీ కూడా కేవలం 5-సీటింగ్ కెపాసిటీతో మాత్రమే వస్తాయి. ఇదివరకు చెప్పుకున్నట్లుగా రెనో ట్రైబర్ ఓ మంచి ఫ్యామిలీ కారు. ఈ విభాగంలో దీని ధర చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కంఫర్ట్ మరియు ఇతర ఫీచర్ల విషయంలో కంపెనీ ఎక్కడా రాజీపడలేదు.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ప్రయాణీకుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి రెనో ఇందులో అనేక ఫీచర్లను అందిస్తంది. వీచిలో రెండు గ్లవ్ బాక్స్‌లు మరియు ముందు భాగంలో రెండు పెద్ద బాటిళ్లను పెట్టుకోగల బాటిల్ హోల్డర్‌లు ఉన్నాయి. ఫ్రంట్ సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. రెండవ వరుస ప్రయాణీకుల కోసం పిల్లర్ మౌంటెడ్ ఏసి వెంట్లు కూడా ఉంటాయి. దీని సాయంతో వెనుక వరుసలో ఉండే ప్రయాణీకుల చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఈ కారులో మరొక ప్రధానమైన ఫీచర్ ఏంటంటే, రెండవ వరుసలోని ప్రయాణీకుల గరిష్ట సౌకర్యం మరియు మంచి లెగ్‌రూమ్ కోసం రిక్లైనింగ్ ఫంక్షన్ తో కూడిన సీట్లను కంపెనీ అందించింది. ఎక్కువ లగేజ్ స్పేస్ కావాలనుకున్నప్పుడు కస్టమర్లు ఈ సీట్లను 60:40 నిష్పత్తిలో కూడా మడుచుకునే సౌలభ్యం ఉంది. దీని వలన మూడవ వరుసలోకి ప్రయాణీకులు ప్రవేశించేందుకు మరియు నిష్క్రమించేందుకు వీలుగా ఉంటుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

రెనో ట్రైబర్ ముందు మరియు వెనుక సీట్లలో ప్రయాణీకుల కోసం షేర్డ్ సెంట్రల్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందించింది. ఇంకా ఇందులో డ్రైవర్ సౌలభ్యం కోసం స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ప్రయాణీకుల వినోదం కోసం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ స్కీమ్ తో ఇది ప్రస్తుత మోడ్రన్ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

సేఫ్టీ విషయానికి వస్తే, రెనో ట్రైబర్ ఎమ్‌పిలో రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు హై స్పీడ్ వార్నింగ్ సిస్టమ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. రెనో ట్రైబర్ ఎమ్‌పివి గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఈ 7-సీటర్ MPV వయోజన ప్రయాణీకుల కోసం 17 పాయింట్లకు గాను 11.62 మరియు పిల్లల రక్షణ కోసం 49 పాయింట్లకు గాను 27 పాయింట్లను స్కోర్ చేసి మొత్తంగా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ఇక దీని ప్రయోజనాలలో చివరిది ట్రైబర్ అందించే అమేజింగ్ మైలేజ్.

రెనో ట్రైబర్ రియల్ వలర్డ్ మైలేజ్ 18.20 నుండి 20.0 కిమీ మధ్యలో ఉంటుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

రెనో ట్రైబర్ ఎమ్‌పివి నష్టాలు:

రెనో ట్రైబర్ ఎమ్‌పివిలో లాభాలు అధికంగానే ఉన్నప్పటికీ, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మార్కెట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, ట్రైబర్ ఎమ్‌పివి కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. అది కూడా చాలా చిన్న ఇంజన్ కావటం కాస్తంత ఆలోచించాల్సిన విషయం. ఇంత పెద్దటి 7-సీటర్ ఎమ్‌పివిలో కంపెనీ కేవలం 1.0-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే ఆఫర్ చేస్తుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఈ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు అనుకూలమైనప్పటికీ, ఈ ఎమ్‌పివి అద్భుతమైన పవర్, టార్క్ గణాంకాలను కలిగి ఉండదు. రియల్ వరల్డ్ లో ఈ ఎమ్‌పివిని ఫుల్ సీటింగ్ కెపాసిటీ డ్రైవ్ చేస్తున్నప్పుడు, పవర్ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

ఇందులో మరొక లోపం ఏమిటంటే, ట్రైబర్ లోని పెట్రోల్ ఇంజన్ గణనీయమైన శబ్దాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఆర్‌పిఎమ్ 3,000 దాటినప్పుడు ఇది భయంకరమైన శబ్దాన్ని విడుదల చేస్తుంది. ఈ శబ్ధం క్యాబిన్‌ లోపలకి కూడా వినిపిస్తుంది. కంపెనీ ఈ కారులో శక్తివంతమైన 1.5 లీటర్ ఇంజన్ ను కానీ లేదా టర్బో పెట్రోల్ ఇంజన్ ను కానీ పరిచయం చేసి ఉంటే బాగుండేదనేది మా అభిప్రాయం.

మార్కెట్లోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు 'Renault Triber'ని కొనొచ్చా?

రెనో ఇండియా ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో కైగర్ లో కూడా కంపెనీ టర్బో పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. కంపెనీ ఇదే ఇంజన్ ను రీట్యూన్ చేసి, ట్రైబర్ లో ఆఫర్ చేసినట్లయితే ఈ మోడల్ అమ్మకాలకు మరింత ఊపందించినట్లు అవుతుంది. మీరేమంటారు..?

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault triber advantages and disadvantages the cheapest 7 seater mpv in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X