రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల తయారు చేసే బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్, అమెరికన్ మార్కెట్లో రెండు పాపులర్ మోడళ్లను డిస్‌కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ అనే రెండు లగ్జరీ కార్లు అమెరికా మార్కెట్ నుండి తొలగిపోనున్నాయి.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

తాజా నివేదిక ప్రకారం, రోల్స్ రాయిస్ 2021 మోడల్ ఇయర్ తర్వాత అమెరికా మార్కెట్లో డాన్ మరియు వ్రైత్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. అయితే, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఈ మోడళ్ల అమ్మకాలు యధావిధిగా కొనసాగుతాయని కంపెనీ ప్రకటించింది.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

దేశంలో "రెగ్యులేటరీ సమస్యల" కారణంగానే ఈ కార్లను నిలిపివేయాల్సి వస్తోందని, కాని ఇతర దేశాల్లో వీటిని విక్రయించడం కొనసాగిస్తామని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఇతర దేశాల్లో కూడా ఈ మోడళ్ల ఉత్పత్తి 2023 వరకు మాత్రమే కొనసాగుతుందని భావిస్తున్నారు.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

రోల్స్ రాయిస్ ఇప్పుడు తమ బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి తయారు చేసే కుల్లినన్, ఘోస్ట్ మరియు ఫాంటమ్ వంటి మోడళ్లపైనే ఎక్కువ దృష్టి సారించాలని భావిస్తోంది.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

కాగా, ఈ డాన్ మరియు వ్రైత్ మోడళ్లను మాత్రం రోల్స్ రాయిస్ మాతృ బిఎమ్‌డబ్ల్యూ నుండి అరువు తెచ్చుకున్న ఎఫ్01 ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ తయారు చేసిన చివరి తరం (లాస్ట్ జనరేషన్) 7 సిరీస్ సెడాన్‌లో ఇదే ప్లాట్‌ఫామ్‌ను (ఎఫ్01) ఉపయోగించారు.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

ఈ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ తమ మొట్టమొదటి వ్రైత్ మోడల్‌ను తొలిసారిగా 2013 జెనీవా మోటార్ షోలో ప్రవేశపెట్టింది. అదే సంవత్సరంలో రోల్స్ రాయిస్ వ్రైత్ కూప్ మోడల్ అమ్మకాలకు వచ్చింది. ఇది కంపెనీ అందిస్తున్న ఫాంటమ్ కూప్ తరువాత, రోల్స్ రాయిస్ యొక్క రెండవ టూ-డోర్ మోడల్‌గా అవతరించింది. అయితే దాని అండర్ పిన్నింగ్స్‌ను మాత్రం చివరి తరం ఘోస్ట్ సెడాన్‌తో పంచుకుంది.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

రోల్స్ రాయిస్ వ్రైత్ కారులో అత్యంత శక్తివంతమైన 6.6-లీటర్ ట్విన్-టర్బో వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 624 హార్స్‌పవర్ శక్తిని మరియు 590 ఎల్‌బి-ఫీట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఆ తర్వాతి కాలంలో దీని ఇంజన్ టార్క్‌ను 605 ఎల్‌బి-ఫీట్ జనరేట్ చేసేలా అప్‌గ్రేడ్ చేశారు.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

అనంతరం, 2016లో, రోల్స్ రాయిస్ వ్రైత్ యొక్క బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్‌ను V12 ఇంజన్‌తో మరింత శక్తివంతమైన వెర్షన్‌గా విడుదల చేశారు. ఈ బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ రోల్స్ రాయిస్ వ్రైత్‌లో స్టాండర్డ్ వ్రైత్‌లో కనిపించే బ్రైట్ వర్క్‌ను తొలగించి కారుకు మరింత డార్క్ రూపాన్ని ఇచ్చారు. అప్పట్లో ఇది చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఉండేది.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

ఇక రోల్స్ రాయిస్ డాన్ విషయానికి వస్తే, కంపెనీ 2015లో డాన్ కన్వర్టిబుల్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2016లో ఈ కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి. టెక్నికల్‌గా చెప్పాలంటే రోల్స్ రాయిస్ డాన్, వ్రైత్ మోడల్‌కు కన్వర్టిబుల్ వెర్షన్‌గా ఉంటుంది.

రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

అయితే, రోల్స్ రాయిస్ వ్రైత్ మోడల్‌తో పోలిస్తే, రోల్స్ రాయిస్ డాన్ యొక్క బాడీ ప్యానెళ్లలో 80 శాతం వరకు భిన్నంగా ఉంటాయి. ఈ కారులో ట్విన్-టర్బో వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. డాన్ కారులో కూడా రోల్స్ రాయిస్ ఓ బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఇంజన్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Reports Suggest Rolls Royce To Discontinue Dawn And Wraith Luxury Cars In US Market, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X