సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ప్రస్తుతం సెమీకండక్టర్ చిప్స్ కొరత అటు ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలతో పాటుగా ఇటు భారతీయ ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇటీవలి కాలంలో కార్ల తయారీలో అత్యంత కీలకంగా మారిన ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా, మనదేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతున్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) విడుదల డేటా ప్రకారం, మనదేశంలో వార్షిక ప్రాతిపదికన గత నెలలో వాహనాల టోకు విక్రయాలలో (హోల్‌సేల్ సేల్స్) 11 శాతం క్షీణత నమోదైంది. గడచిన ఆగస్ట్ 2021 నెలలో వాణిజ్య వాహనాలు మినహా అన్ని వర్గాల వాహనాల టోకు అమ్మకాలు 17,90,115 యూనిట్ల నుండి 15,86,873 యూనిట్లకు పడిపోయాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

తాజా సియామ్ డేటా ప్రకారం, గత నెలలో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (OEMs) నుండి డీలర్లకు ద్విచక్ర వాహనాల పంపకాలు తగ్గాయి. అయితే, ఆగస్ట్ 2020 తో పోలిస్తే, గత నెలలో ప్యాసింజర్ వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాల అమ్మకాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ఆగస్ట్ 2021లో OEM ల నుండి డీలర్లకు వచ్చిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు 15 శాతం క్షీణించి, 15,59,665 యూనిట్ల నుండి 13,31,436 యూనిట్లకు తగ్గాయి. ఈ కాలంలో మోటార్‌సైకిల్ అమ్మకాలు 20 శాతం క్షీణించి 10,32,476 యూనిట్ల నుండి 8,25,849 యూనిట్లకు పడిపోయాయి. అదేవిధంగా, స్కూటర్ల అమ్మకాలు కూడా 4,56,848 యూనిట్ల నుండి 4,51,967 యూనిట్లకు తగ్గాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

అయితే, OEM ల నుండి డీలర్‌షిప్‌ల వచ్చిన కార్లు, యుటిలిటీ వాహనాలు మరియు వ్యాన్‌ల అమ్మకాలతో కలిపి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. అంతకు ముందు ఇదే సమయంలో ఇవి 2,15,916 యూనిట్లగా ఉంటే, ఇప్పుడు అవి 7 శాతం పెరిగి 2,32,224 యూనిట్లకు చేరుకున్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

మూడు చక్రాల (ఆటోరిక్షాల) వాహనాల అమ్మకాల్లో కూడా గణనీయమైన వృద్ధి కనబడింది. ఈ విభాగంలో అమ్మకాలు 60 శాతం పెరిగి 14,534 యూనిట్ల నుండి 23,210 యూనిట్లకు పెరిగాయి. ఆగస్ట్ నెల అమ్మకాలపై సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ వ్యాఖ్యానిస్తూ, సప్లయ్ చైన్ లోని సవాళ్ల కారణంగా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటుందని అన్నారు.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ఎదుర్కుంటున్న సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇప్పుడు ఇది భారత ఆటో పరిశ్రమలో వాహనాల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఆయన అన్నారు.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ఇటీవలి కాలంలో ఆటో పరిశ్రమలో సెమీకండక్టర్ల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. సాంకేతిక పురోగతులు మరియు కొత్త ఫీచర్లతో వస్తున్న మోడళ్లలో ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ల వాడకం ఎక్కువైంది. ప్రస్తుతం, మొత్తం సెమీకండక్టర్ డిమాండ్‌లో ఆటో పరిశ్రమ 10 శాతం వాటాను కలిగి ఉంది, మిగిలినవి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌లు మరియు గాడ్జెట్ల పరిశ్రమలు కలిగి ఉన్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ఈ ఎలక్ట్రానిక్స్ చిప్ కొరతతో పాటు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు పెను సవాలుగా మారాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం కారణంగా కార్ కంపెనీలు వేరే గత్యంతరం లేక తమ కార్ల ధరలను కూడా పెంచేస్తున్నాయి. దీంతో అమ్మకాలు కూడా ప్రభావితం అవుతున్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్ట్ 202 వరకు మొత్తం వాహన విక్రయాలను పరిశీలిస్తే, ప్రయాణీకుల వాహన విభాగం ఇప్పటికీ 2016-17 స్థాయిల కంటే తక్కువగానే ఉనట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే, ద్విచక్ర వాహన విభాగం 2011-12 స్థాయికి దిగువన ఉండగా, మూడు చక్రాల వాహన విభాగం చాలా సంవత్సరాలు వెనుకబడి ఉంది.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

ప్యాసింజర్ వాహన విభాగంలో, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (MSI) గత నెలలో 1,03,187 యూనిట్లను విక్రయించింది, ఇదే కంపెనీ ఆగస్టు 2020లో సవాళ్లతో కూడిన వాతరణంలోనే 1,13,033 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 9 శాతం తగ్గాయి. మరోవైపు, దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా, గత నెలలో 46,866 యూనిట్లను విక్రయించగా, ఆగస్టు 2020 లో 45,809 యూనిట్లను విక్రయిచింది.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

సెమీకండక్టర్ చిప్స్ కి ఎందుకు అంత ప్రాధాన్యత

ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆధునిక కార్లు చాలా క్లిష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయాలంటే వాటి కోసం అనేక రకాల సర్క్యూట్లు మరియు కొన్ని కీలకమైన ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా అవసరం. అలాంటి ఎలక్ట్రానిక్ చిప్స్‌లో సెమీకండక్టర్స్ చాలా ప్రత్యేకమైనవి.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

కొత్త వాహనాలు అధునాతన టెక్నాలజీతో వస్తున్న నేపథ్యంలో, వాటిలో అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉంటున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్‌లు మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్‌లు మొదలైన వాటికి ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ఎంతో అవసరం.

సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ : భారతదేంలో తగ్గుతున్న ఆటోమొబైల్ సేల్స్!

కారులోని ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే, వాటిలో సెమీకండక్టర్స్‌ను ఉపయోగించడం ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలు ఆటోమోటివ్ పరిశ్రమ నుండి వస్తున్న ప్రపంచ డిమాండ్‌ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వీటి తయారీ తగినంత మోతాదులో ఉండటం లేదు.

Most Read Articles

English summary
Semiconductor chip crisis indian auto wholesales decline by 11 percent in august 2021 details
Story first published: Saturday, September 11, 2021, 15:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X