భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

వోల్వో కార్ ప్రియులకు చేదువార్త. భారత కార్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఎలక్ట్రిక్ కార్ విభాగంలో, ఈ స్వీడిష్ కార్ బ్రాండ్ నుండి రావల్సిన ఆల్-ఎలక్ట్రిక్ 'ఎక్స్‌సి40 రీచార్జ్' ఎస్‌యూవీ విడుదల మరింత ఆలస్యం కానుంది. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న సెమీకండక్టర్స్ చిప్స్ కొరతే ఇందుకు ప్రధాన కారణం.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

వాస్తవానికి 2021లోనే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉన్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా ఇప్పుడు 2022కి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌కు పరిచయం చేస్తామని, ఈ కారు కోసం బుకింగ్‌లను కూడా తదుపరి తేదీకి వాయిదా వేస్తున్నామని కంపెనీ ప్రకటించింది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పటికే, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి విజయాన్ని సాధించింది. వచ్చే ఏడాది ఇది భారత మార్కెట్లో కూడా సందడి చేయనుంది. భారతదేశంలో రానున్న మూడేళ్లలో 4 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు వోల్వో కార్స్ ఇండియా ప్రకటించింది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం, సెమీకండక్టర్ చిప్స్ కొరత, ప్రయాణ మరియు వ్యాపార ఆంక్షలు వంటి పలు అంశాల నేపథ్యంలో, భారతదేశంలో తమ కొత్త కార్ల విడుదల ప్రణాళికలను మరింత ఆలస్యం చేయవలసి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

ప్రపంచంలోని ఇతర ఆటోమొబైల్ సంస్థల మాదిరిగానే, వోల్వో కూడా పర్యావరణాన్ని మెరుగుపరచడానికి మరియు విద్యుదీకరించబడిన భవిష్యత్తుకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉందవి, తమ మొత్తం వాహనాల శ్రేణిలో తప్పనిసరిగా ఓ ఎలక్ట్రిక్ వెర్షన్ ఉండేలా చూసుకుంటామని కంపెనీ తెలిపింది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

ఇక వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, దీనిని కొత్త కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎమ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాటమ్‌ఫామ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసిఈ) వాహనాలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సూక్ష్మమైన మార్పులు చేసినప్పటికీ, చూడటానికి ఇది స్టాండర్డ్ డీజిల్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 మాదిరిగానే కనిపిస్తుంది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి శక్తిని మరియు 659 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. స్టాండర్డ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్‌తో పోల్చి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ గరిష్టంగా రెండు రెట్లు కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

అయితే, బరువు పరంగా చూసుకుంటే, ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌సి40 మోడల్‌లోని బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కారణంగా, ఇది స్టాండర్డ్ గ్యాసోలిన్ ఎక్స్‌సి40 కంటే 500 కిలోలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. అధిక బరువును కలిగి ఉన్నప్పటికీ, వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

ఈ ఎలక్ట్రిక్ కారులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు విడుదల చేసే శక్తిని, ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతుంది. వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 400 కి.మీ వరకూ రేంజ్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో కేవలం 40 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ కారు ముందు వైపు పెద్ద బ్యాడ్జ్, వైట్-ఫినిష్డ్ గ్రిల్, హుడ్ క్రింది భాగంలో 31 లీటర్ల స్టోరేజ్ స్పేస్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు బ్లాక్ స్టోన్ రూఫ్ మరియు డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కవర్, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఎక్స్టీరియర్ ఫీచర్లను గమనించవచ్చు.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ కారు విడుదల వాయిదా; కారణం ఏంటంటే..?

వోల్వో కార్లు అంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. అలాంటిది ఈ వోల్వో ఎక్స్‌సి40 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. వీటిలో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రన్-ఆఫ్ రోడ్ మిటిగేషన్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్, లేన్ కీపింగ్ ఎయిడ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, విప్లాష్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఐఎస్ఓఫిక్స్ అటాచ్మెంట్, బ్లైండ్ స్టీర్ అసిస్ట్‌తో కూడిన స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Semiconductor chips shortage volvo xc40 recharge india launch delayed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X