బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ అయిన బిఎమ్‌డబ్ల్యూ యొక్క అత్యంత ఖరీదైన కార్లలో ఎక్స్7 ఒకటి. ఈ కారు ధర భారతదేశంలో ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం సుమారు రూ. 93 లక్షలు. అయితే ఇంత ఖరీదైన కారును ఇటీవల ఒక ప్రముఖ నటుడు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఆ ప్రముఖ నటుడు ఎవరు మరియు దీనికి సంబంధించిన మొత్తం సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 లగ్జరీ కారును కొననున్నట్లు తెలిసింది ఇందులో భాగంగానే అతడు ఈ కారుని టెస్ట్ డ్రైవ్ చేశారు. కారు టెస్ట్ డ్రైవ్ సందర్భంగా వారు తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హంగామా సైట్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 కారును టెస్ట్ చేసిన ఫోటోలను ప్రచురించింది.

బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

షాహిద్ కపూర్ ఇప్పటికే చాలా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. షాహిద్ కపూర్ మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి ఎస్ 400, రేంజ్ రోవర్ వోగ్, జాగ్వార్ ఎక్స్‌కెఆర్-ఎస్, మరియు హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ మరియు యమహా ఎమ్‌టి 1 వంటి బైక్‌లను కూడా కలిగి ఉన్నారు.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

ఇప్పుడు షాహిద్ కపూర్ మరో లగ్జరీ కారు కొనడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ లగ్జరీ కారు దేశీయ మార్కెట్లో డిపిఇ, డిపిఇ సిగ్నేచర్, 40 ఐఎమ్ స్పోర్ట్ మరియు ఎం 50 డిలలో విక్రయించబడుతుంది. ఇందులో ఎం50డి హై-ఎండ్ మోడల్. ఈ మోడల్ ధర ఎక్స్ షోరూమ్‌గా ప్రకారం రూ. 1.65 కోట్లు.

బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

డిపిఇ మరియు డిపిఇ సిగ్నేచర్ మోడళ్లలో 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 262 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 40 ఐఎం స్పోర్ట్ మోడల్‌లో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండగా, ఎం 50 డిలో 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చారు.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

ఈ ఇంజిన్లన్నింటికీ బాటిల్ షిఫ్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉన్నాయి. ఈ లగ్జరీ కారులో నాలుగు వేర్వేరు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు అడాప్టివ్ మోడ్స్.

బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

ఈ కారును 5 వే క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ తో అందిస్తున్నారు. ఈ కారణంగానే ఈచాలామంది సినీతారలు మరియు వ్యాపారవేత్తలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. షాహిద్ కపూర్ టెస్ట్ డ్రైవ్ ఈ విషయాన్ని కూడా అధికారికంగా ధ్రువీకరించారు.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

Source: Bollywood Hungama

Most Read Articles

English summary
Shahid Kapoor Takes Test Drive Of BMW X 7 Luxury Car. Read in Telugu.
Story first published: Saturday, March 13, 2021, 13:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X