యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

2007 లో భారత క్రికెట్ లో అరంగేట్రం చేసిన ప్రముఖ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు, ఎందుకంటే దాదాపు యువరాజ్ సింగ్ గురించి తెలిసిందే, ఒకే ఓవర్ లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. క్రికెట్‌కి ప్రస్తుతం యువరాజ్ సింగ్ వీడ్కోలు చెప్పి ఉండవచ్చు, కానీ అతనికి కార్ల పట్ల వ్యామోహం ఎక్కువగా.

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

కార్ల పట్ల ఎక్కువ వ్యామోహం కలిగి ఉన్న యువరాజ్ సింగ్ వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవల మరో లగ్జరీ కారు కొన్నారు. యువరాజ్ సింగ్ కొనుగోలు చేసిన కొత్త కార్ మినీ కంట్రీమాన్. యువరాజ్ సింగ్ కొత్త కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ తో కలిసి కారు డెలివరీ తీసుకున్నాడు. ఈ కంపెనీ యొక్క అతిపెద్ద హ్యాచ్‌బ్యాక్ కార్లలో కంట్రీమాన్ ఒకటి. దేశీయ మార్కెట్లో, ఈ కారును పెట్రోల్ ఇంజన్లతో రెండు మోడళ్లలో విక్రయిస్తారు. యువరాజ్ సింగ్ కొన్న కారు ఎరుపు రంగులో ఉంది.

MOST READ:భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

ఈ కారు మనదేశంలోకి సిబియు మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. మినీ కంట్రీమాన్ ప్రారంభ ధర రూ. 38.5 లక్షలు. అయితే, యువరాజ్ సింగ్ కొనుగోలు చేసిన మినీ కంట్రీమాన్ జెసిడబ్ల్యు ధర సుమారు రూ. 42.4 లక్షలు. ఈ మోడల్ కంట్రీమాన్ యొక్క స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

జెసిడబ్ల్యు మోడల్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు స్పోర్టి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ మినీ కంట్రీమాన్ ఎస్ జెసిడబ్ల్యులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 192 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మినీ కంట్రీమాన్ కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి100 కిమీ వేగవంతం అవుతుందని కంపెనీ తెలిపింది.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

ఇప్పుడు అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్న యువరాజ్ సింగ్ యొక్క మొదటి కార్ హోండా సిటీ. ప్పటికీ ఈ కారును తమ గ్యారేజీలో ఉంచుకున్నారు. యువరాజ్ సింగ్ అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. యువరాజ్ సింగ్ కలిగి ఉన్న లగ్జరీ కార్లలో బిఎండబ్ల్యు ఎమ్5, బిఎండబ్ల్యు ఎమ్3, ఆడి క్యూ 7, లంబోర్ఘిని గల్లార్డో వంటివి కలిగి ఉన్నాడు.

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

యువరాజ్ సింగ్ కలిగి ఉన్న కార్లలో ఒకటి బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5. ఈ కారులో 4395 సిసి ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 592 బిహెచ్‌పి పవర్ మరియు 795 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ. 1.68 కోట్లు.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

ఇక అతనై వద్ద వున్నా బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 కారు విషయానికి వస్తే, ఇందులో 2979 సిసి ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది 431 బిహెచ్‌పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 1.50 కోట్లు. యువరాజ్ సింగ్ లంబోర్ఘిని గల్లార్డో సూపర్ స్పోర్ట్స్ కారును కూడా కలిగి ఉన్నారు. ఈ కారులోని 5204 సిసి ఇంజన్ 570 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్ట్స్ కారు ధర సుమారు రూ. 3 కోట్లు.

యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

టీ 20 ప్రపంచ కప్‌లో ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు పోర్స్చే 911 లగ్జరీ కారును ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ బహుమతిగా ఇచ్చారు. ఏది ఏమైనా యువరాజ్ సింగ్ కి కార్లపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు, ఇతని వద్ద ఉన్న కార్లే అతనికి కార్లపై ఉన్న వ్యామోహానికి నిదర్శనం.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

Most Read Articles

English summary
Sixer King Yuvraj Singh Takes Delivery Of New Mini Countryman. Read in Telugu.
Story first published: Friday, January 1, 2021, 11:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X