కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

కోవిడ్-19 మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఇండియా, తమ మెయింటినెన్స్ షెడ్యూల్ యొక్క చెల్లుబాటును జూలై 31, 2021 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

అయితే, వారంటీ-సంబంధిత క్లెయిమ్‌ల పొడిగింపుకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ లాక్‌డౌన్ సమయంలో గడువు ముగిసిన మెయింటినెన్స్ సంబంధిత సేవలు జూలై 31, 2021 వరకు చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ మరియు జూన్ 2021 మధ్య కాలంలో గడువు ముగిసే కస్టమర్లకు ఇది వర్తిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు కొనసాగుతుండటంతో ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు రాలేకపోతున్నారని, ఫలితంగా ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని కంపెనీ పేర్కొంది. అందుకే, ఈ మెయింటినెన్స్ సేవల గడువును మరో రెండు నెలలో పాటు పొడగిస్తున్నామని తెలిపింది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

ఇదిలా ఉంటే, కంపెనీ తమ తర్వాతి తరం స్కోడా ఆక్టేవియా సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తోంది. అయితే, ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితులు దీనిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. కొత్త తరం స్కొడా ఆక్టేవియా ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది. అలాగే, భారతదేశంలో రాబోయే కొత్త తరం ఆక్టేవియా ఉత్పత్తిని కూడా కంపెనీ ప్రారంభించింది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

కొత్త-తరం (న్యూ జనరేషన్) స్కొడా ఆక్టేవియా సెడాన్ లోపల మరియు వెలుపల డిజైన్ అప్‌గ్రేడ్స్, కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెక్నాలజీ, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు మరియు ఫాగ్ లాంప్స్‌తో కూడిన కొత్త సొగసైన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వెడల్పాటి బట్టర్‌ఫ్లై గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మొదలైనవి మరెన్నో ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

ఇంజన్ పరంగా కొత్త 2021 స్కొడా ఆక్టేవియాలో కంపెనీ తమ సింగిల్ టిఎస్ఐ 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190-బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : స్కొడా మెయింటినెన్స్ షెడ్యూల్ గడువు పొడగింపు!

భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా, సగటు భారతీయులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దేశం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది, చాలా వ్యాపారాలు తక్కువ సిబ్బందితో నడుస్తున్నాయి లేదా పూర్తిగా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో, స్కోడా తమ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto Extends Its Maintenance Schedule In India Due To Covid-19, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X