భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో (Skoda Auto) ఇటీవల తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కుషాక్‌ను విడుదల చేసి విజయపథంలో ఉన్న సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ తమ కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే ఏడాది జనవరి నెలలో మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. ఈ విషయాన్ని స్కోడా ఆటో ఇండియా ల్స్, సర్వీసెస్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ అధికారికంగా ధృవీకరించారు.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 2020లో గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది. బిఎస్-6 స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ భారత ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడల్. కోవిడ్-19 మహమ్మారి మరియు దాని తర్వాత వచ్చిన తదుపరి పరిణామాల కారణంగా, ఈ మోడల్ విడుదల మరింత ఆలస్యం అయింది. అయితే, స్కోడా ఇప్పటికే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతదేశానికి దిగుమతి చేసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

ఈ కొత్త మోడల్ రిఫ్రెష్డ్ డిజైన్ తో పాటుగా కొత్త పరికరాలను కూడా కలిగి ఉంటుంది. కొత్త 2021 స్కొడా కొడియాక్‌లో మరింత నిటారుగా ఉండే హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కి ఇరువైపులా సన్నటి డిజైన్ మరియు ఇంటిగ్రేటెడి ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, దీని వెనుక భాగంలో సి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బోనెట్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, బెటర్ విజిబిలిటీ కోసం ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ యూనిట్, ఫ్రంట్ బంపర్‍‌లో హనీకోంబ్ గ్రిల్ మరియు ఎల్-ఆకారపు సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ వంటి అంశాలు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

వెనుక భాగంలో రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉన్నట్లుగా కనిపించే స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. రూఫ్ పైభాగంలో కొత్త బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వెనుక వైపు బూట్ డోరుపై పెద్ద అక్షరాలతో కూడిన స్కొడా బ్యాడ్జింగ్, స్ప్లిట్ స్టైల్ ఎల్ఈడి టెయిల్ లైట్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైప్ డిజైన్, కొత్త 18 ఇంచ్ మరియు 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త స్లిమ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

ఇంటీరియర్స్ లో పెద్ద 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0 ఇంచ్ లేదా 9.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, కొత్త స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ , వర్చువల్ కాక్‌పిట్, పానోరమిక్ సన్‌రూఫ్, 750 వాట్ 12 స్పీకర్ ఆడియో సిస్టమ్, హీటెడ్ ఫంక్షన్‌తో పాటుగా మసాజ్ ఫంక్షన్‌ను కూడా కలిగిన ఆప్షనల్ ఎర్గోనామిక్ వెంటిలేటెడ్ సీట్స్, 10 రకాల కలర్ ఆప్షన్లు కలిగిన ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త 2021 స్కొడా కోడియాక్‌లో బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ నుండి వెలువడే శక్తిని ఈ గేర్‌బాక్స్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 7.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

కొత్త 2022 స్కోడా ​​కొడియాక్ ఫేస్‌లిఫ్ట్, రాబోయే జీప్ మెరిడియన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. స్కోడా కొడియా స్టైల్, స్కౌట్ మరియు ఎల్ అండ్ కె అనే మూడు వేరియంట్లలో విడుదల కావచ్చని సమాచారం. స్కోడా కోడియాక్ పాత మోడల్ (బిఎస్4 వెర్షన్) గతంలో రూ. 33 లక్షల నుండి రూ. 36.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అమ్ముడయ్యేది. కాగా, కొత్త 2021 కొడియాక్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

ఇదిలా ఉంటే, కొత్త సంవత్సరంలో స్కోడా తమ కొత్త స్లావియా (Skoda Slavia) మిడ్-సైజ్ సెడాన్ ను కూడా విడుదల చేయనుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారును కంపెనీ ఇప్పటికే ఆవిష్కరించింది. అంతేకాకుండా, ఈ మోడల్ కోసం ప్రీ బుకింగ్స్ ని కూడా ప్రారంభించింది. ఈ మోడల్ అమ్మకాలు కూడా వచ్చే ఏడాది నుండే ప్రారంభం కానున్నాయి. అయితే, ముందుగా కొడియాక్ అమ్మకాలు ప్రారంభమవుతాయా లేక స్లావియా అమ్మకాలు ప్రారంభమవుతాయా అనేది తెలియాల్సి ఉంది.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

స్కోడా తమ కొత్త స్లావియా సెడాన్‌ను ప్రతి నెలా సగటున 3,000 నుండి 4,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్కోడా స్లావియా సెడాన్‌ను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో అందించనుంది. వీటిలో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్‌ను మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుండంటే..?

స్కోడా స్లావియా స్టాండర్డ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే, ఇందులో మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్ మాత్రం 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. అలాగే, 1.0 లీటర్ వెర్షన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda auto ready to launch new kodiaq facelift suv in india january 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X