Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్‌ (Skoda Kushaq) అమ్మకాల పరంగా అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ కారు వలన స్కోడా ఆటో మొత్తం అమ్మకాలు భారీగా పెరిగాయి. మొదట్లో కంపెనీ ఈ కారును 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్ట్ నెలలో ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కొత్త 1.5 లీటర్ కుషాక్ వేరియంట్లలో కొన్ని అప్‌డేట్‌లను చేయబోతోంది. ప్రస్తుతం స్కోడా కుషాక్ (Skoda Kushaq) యొక్క టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌లో మాత్రమే కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ఫీచర్‌ను అందింస్తోంది. ఈ వేరియంట్లో, 1.5 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు మరియు ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

కాగా, ఇప్పుడు స్కోడా ఇండియా (Skoda India) తమ కుషాక్ 1.5 టిఎస్ఐ స్టైల్ యొక్క ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌ లో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌ ల ఫీచర్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది స్కోడా కుషాక్ (Skoda Kushaq) లైనప్‌లోనే అత్యంత ఖరీదైన వేరియంట్ గా ఉంటుంది. అంతేకాకుండా, ఈ వేరియంట్ లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా అందుబాటులో ఉంటుంది.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

గతంలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కంపెనీ తమ మాన్యువల్ వేరియంట్‌ కు మాత్రమే పరిమితం చేసింది. స్కోడా కుషాక్ యొక్క స్టైల్ వేరియంట్ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో విక్రయించబడుతోంది. అయితే, ఈ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్లు లభించే సూచనలు కనిపించడం లేదు.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

స్కోడా కుషాక్ యొక్క 1.0 లీటర్ టిఎస్ఐ స్టైల్ వేరియంట్‌ను కంపెనీ మరింత సరసమైన వేరియంట్‌గా అందిస్తోంది. కుషాక్ యొక్క ఇతర సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ-కొలైజన్ బ్రేకింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే), ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు రోల్ ఓవర్ ప్రొటెక్షన్ మొదలైనవి ఉన్నాయి.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

ప్రస్తుతం మార్కెట్లో స్కోడా కుషాక్ ఎస్‌యూవీ ధరలు రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ 3 సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా కంపెనీ తమ స్కోడా కుషాక్‌ను తయారు చేసింది. ఈ ఎస్‌యూవీ తయారీలో ఉపయోగించే విడిభాగాలలో 95 శాతం భాగాలను స్థానికంగానే సేకరిస్తోంది. భవిష్యత్తులో దీనిని 100 శాతానికి పెంచాలని కంపెనీ యోచిస్తోంది.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

స్కోడా కుషాక్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉండే బోనెట్ వండి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే, వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, పెద్ద రియర్ బంపర్, సైడ్‌లో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు పై భాగంలో సన్‌రూఫ్ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

ఈ కారులో ప్రధానం లభించే ఫీచర్ల విషయానికి వస్తే, కుషాక్ టాప్-ఎండ్ వేరియంట్లలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదలైన 'స్కోడా కుషాక్' (Skoda Kushaq) ఎస్‌యూవీ మొత్తం మూడు వేరియంట్లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) లభిస్తుంది. ఇందులోని ప్రతి వేరియంట్లో కూడా కంపెనీ ఉత్తమమైన ఫీచర్లను అందిస్తోంది. - స్కోడా కుషాక్‌లో వేరియంట్ల వారీగా అందిస్తున్న ఫీచర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Skoda Kushaq 1.5 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్స్!

స్కోడా కుషాక్ రాకతో కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్ సుమారు 15 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఆగస్టు 2021 నాటికి కొత్తగా 100 నగరాల్లో తమ టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయడంతో కంపెనీ యొక్క సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ల సంఖ్య 170 కి చేరుకోనుంది. అంతేకాకుండా, 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 225 కి పైగా టచ్ పాయింట్లను కలిగి ఉండాలని స్కోడా ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kushaq 1 5 litre tsi at variant to get additional safety features details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X