తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'కుషాక్'ను మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం స్కొడా ఈ మోడల్‌కి సంబంధించిన తుది దశ టెస్టింగ్‌ను చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు లీక్ అయ్యాయి.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కొడైకెనాల్ ప్రాంతంలో స్కొడా ఈ ఎస్‌యూవీని పరీక్షిస్తోంది. వివరాలు బయటకు కనిపించకుండా ఉండేలా ఈ టెస్టింగ్ వాహనాన్ని భారీగా క్యామోఫ్లేజ్ చేశారు. టెస్టింగ్ చేస్తున్న వాహనాన్ని ఎక్స్‌ప్రెస్‌డ్రైవ్స్ తమ కెమెరాలో బంధించింది.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

స్కొడా కుషాక్ ఎస్‌యూవీని మార్చ్ 2021లో ప్రజల ముందుకు తీసుకవస్తామని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసినదే. స్కోడా ఆటో మరియు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై ఈ స్కొడా కుషాక్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని కూడా అభివృద్ధి చేస్తోంది. టైగన్ కూడా త్వరలోనే ఇండియాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో అనేక విడిభాగాలు, పరికరాలు ఒకేలా ఉండొచ్చని తెలుస్తోంది.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

స్కొడా ఆటో భారతదేశం కోసం ప్లాన్ చేసుకున్న 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్లాన్‌లో భాగంగా కుషాక్ మొట్టమొదటి మోడల్‌గా వస్తోంది. గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'స్కొడా విజన్ ఇన్' అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ కుషాక్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని ఎల్లో కలర్ హస్క్‌వర్నా విట్‌పిలీన్ 250 బైక్‌, ఇదే

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

భారత మార్కెట్లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీని రెండు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

ఈ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎమ్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని అంచనా.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

ఇకపోతే, 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో ఫోర్-సిలిండర్ టర్బో ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

స్కొడా కుషాక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్కొడా సిగ్నేచర్ గ్రిల్, బంపర్స్ క్రింది భాగంలో స్కఫ్ ప్లేట్స్, కారు బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్, ప్రీమియం లుక్ అండ్ ఫీల్ కోసం క్రోమ్ గార్నిష్ మరియు డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను ఆశించవచ్చు.

MOST READ:రాష్ట్రపతిచే సత్కరించబడిన సాధారణ జంట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

ఇంటీరియర్స్‌లో బేస్ వేరియంట్లలో 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లో 10-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బూట్ స్పేస్‌లో ఓ సబ్ వూఫర్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నట్లు సమాచారం.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

అంతేకాకుండా, ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, కూల్డ్ గ్లౌవ్ బాక్స్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం.

తుది దశ టెస్టింగ్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ, మార్చ్ 2021లో విడుదల

స్కొడా కుషాక్ భారత్‌లో అత్యంత పాపులర్ అయిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, టాటా హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని అంచనా.

Most Read Articles

English summary
Skoda Kushaq Spotted In Final Testing; India Launch In March 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X