స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో, భారత విపణిలో ఇటీవల విడుదల చేసిన సరికొత్త 'స్కోడా కుషాక్' ఎస్‌యూవీ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. జూన్ 28వ తేదీన కంపెనీ ఈ కారుని భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ స్కోడా కుషాక్ ఎస్‌యూవీ కోసం 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

స్కోడా కుషాక్ వేరియంట్లు ధరలు:

స్కోడా కుషాక్ భారత మార్కెట్లో యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.10.49 లక్షల నుండి రూ.17.59 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ప్రారంభంలో కంపెనీ ఈ మోడల్‌ను 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో విడుదల చేసింది. కాగా, ఈ నెలలో ఇందులో మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టనుంది.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

స్కోడా కుషాక్ ఇంజన్ ఆప్షన్స్:

స్కోడా కుషాక్ కేవలం పెట్రోల్ ఇంజన్‌లతో మాత్రమే లభ్యం కానున్నాయి. కంపెనీ ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే విషయం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కోడా కుషాక్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

కాగా, స్కోడా ఈ ఎస్‌యూవీలో మరింత శక్తివంతమైన 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఈ ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందులోని 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్‌జి గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటాయి.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

స్కోడా కుషాక్ ప్లాట్‌ఫామ్:

భారతదేశం కోసం ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తున్న ఎమ్‌క్యూబి-ఏ0-ఇన్ డిజైన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కంపెనీ స్కోడా కుషక్‌ను తయారు చేసింది. ఈ ఎస్‌యూవీ ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ దీని తయారీలో 95 శాతం స్థానికీకరణను ఉపయోగించుకుంది.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

స్కోడా కుషాక్ డిజైన్ మరియు ఫీచర్లు:

స్కోడా కుషాక్ ఎస్‌యూవీ ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉండే బోనెట్ వండి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే, వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, పెద్ద రియర్ బంపర్, సైడ్‌లో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు పై భాగంలో సన్‌రూఫ్ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

ఈ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఆసక్తిగల కస్టమర్లు కొత్త స్కోడా కుషాక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా అధికారిక స్కోడా డీలర్‌షిప్‌ల ద్వారా రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

జులై 2021లో భారీగా పెరిగిన సేల్స్:

స్కోడా కుషాక్ ఎస్‌యూవీ రాకతో గడచిన జులై నెలలో కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. జూలై 2020లో స్కోడా ఆటో కేవలం 922 కార్లను మాత్రమే విక్రయిస్తే, గడచిన జులై 2021లో కంపెనీ దేశీయ మార్కెట్లో 3,080 యూనిట్లను విక్రయించి 234 శాతం వృద్ధిని సాధించింది.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

స్కోడా ఆటో గతేడాది భారతదేశంలో కేవలం 10,000 కార్లను మాత్రమే విక్రయించింది. కాగా, ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో 30,000 కార్లను మరియు 2022 చివరి నాటికి 60,000 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండేళ్లలో కంపెనీ విడుదల చేయబోయే కొత్త కార్లతో ఇది సాధ్యమవుతుందని స్కోడా ధీమా వ్యక్తం చేసింది.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు.. కారణం ఏంటంటే..

స్కోడా మిడ్-సైజ్ సెడాన్:

ఇదిలా ఉంటే, స్కోడా ఆటో భారత మార్కెట్ కోసం ఓ కొత్త మిడ్-సైడ్ సెడాన్‌ను ప్లాన్ చేస్తోంది. ఇది విభాగంలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా రాబోతోంది. ఈ కొత్త కారు స్కోడా ర్యాపిడ్ కంటే పెద్ద సైజులో ఉంటుంది మరియు కంపెనీ దీనిని కూడా ఎమ్‌క్యూబి-ఏ0-ఇన్ డిజైన్ ప్లాట్‌ఫామ్‌పైనే అభివృద్ధి చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త స్కోడా మిడ్-సైజ్ సెడాన్ విడుదల అవుతుందని అంచనా.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kushaq suv bags over 6000 bookings since launched details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X