స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

స్కొడా ఆటో నిన్న (గురువారం మార్చి 18, 2021వ తేదీన) తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కుషాక్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. భారతదేశంలో తయారు కానున్న ఈ ఎస్‌యూవీ, మనదేశంలోనే కాకుండా వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అమ్ముడుకానుంది.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

తాజాగా స్కొడా కుషాక్ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్స్ మరియు డెలివరీల సమయాన్ని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ కోసం బుకింగ్‌లను జూన్ 2021లో ప్రారంభిస్తామని, డెలివరీలను జులై 2021లో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్న హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు స్కొడా కుషాక్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. తాజాగా ఆవిష్కరించబడిన స్కొడా కుషాక్ యొక్క ప్రీమియం ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ కార్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

విమర్శకులు కూడా ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లకు సరైన పోటీదారు మరియు ప్రత్యామ్నాయ ఎంపిక కావడం ఖాయమని చెబుతున్నారు. కొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీ యాక్టివ్, అంబిషన్, స్టైల్ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

కొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీలో అందమైన గ్రిల్ మరియు ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఆకర్షణీయమైన హెడ్‌లైట్ క్లస్టర్‌లు, ఫ్రంట్ బంపర్‌లో స్టైలిష్ స్కిడ్ ప్లేట్ మరియు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని బేస్ వేరియంట్లలో 16 ఇంచ్ వీల్స్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో 17 ఇంచ్ డ్యూయెల్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

ఇది ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బూమరాంగ్ ఆకారంలో ఎల్‌ఈడీ టైల్ లైట్స్, రూఫ్ స్పాయిలర్, ర్యాక్డ్ విండ్‌స్క్రీన్, ఆకర్షణీయంగా ఉండే బంపర్, ఫాక్స్ సిల్వర్ బాష్ ప్లేట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. క్యాబిన్‌ లోపలి భాగంలో ఆరంజ్ ఎలిమెంట్స్ మరియు డాష్‌బోర్డ్‌లో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

ఇంకా ఇందులో ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బూమరాంగ్ ఆకారంలో ఎల్‌ఈడీ టైల్ లైట్స్, రూఫ్ స్పాయిలర్, ర్యాక్డ్ విండ్‌స్క్రీన్, డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, ఫాక్స్ సిల్వర్ బాష్ ప్లేట్, ఫేక్ ఎయిర్ వెంట్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, పెద్ద అక్షరాలతో స్కొడా బ్యాడ్జింగ్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

క్యాబిన్‌ లోపలి భాగంలో ఆరంజ్ ఎలిమెంట్స్ మరియు డాష్‌బోర్డ్‌లో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

ఇకపోతే రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆప్షన్స్ ఉన్నాయి.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

భారత్‌లో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇదే గనుక జరిగితే, ధర పరంగా ఇది హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ ఎస్‌యూవీల జోరుకు చెక్ పెట్టడం ఖాయం.

స్కొడా కుషాక్ బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

స్కొడా ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా వస్తున్న మొట్టమొదటి మోడల్ ఇది. స్కొడా ఆటో 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని తయారు చేశారు. ఈ ఎస్‌యూవీని ఫోక్స్‌వ్యాగన్-స్కొడా కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు.

Most Read Articles

English summary
Skoda Kushaq SUV Bookings And Deliveries Timeline Revealed, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X