స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

కొత్త తరం 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, ఇప్పుడు తమ సరికొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా, స్కొడా కుషాక్ ఎస్‌యూవీకి సంబంధించిన ఓ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

స్కొడా ఇండియా బ్రాండ్ నుండి ఇది రెండవ అతిపెద్ద లాంచ్ కానుంది. స్కొడా ఆటో ఇప్పటికే ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అఫీషియల్ లాంచ్‌కు ముందుగా కంపెనీ ఈ కొత్త స్కొడా కుషాక్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కుషాక్ ఇంజన్ వివరాలతో పాటు దాని ప్రొడక్షన్ అవతార్‌ను చూపిస్తుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

ఈ కొత్త టీజర్‌లో స్కొడా కుషాక్ ముందు భాగం మాత్రమే చూడవచ్చు. ఇందులో కుషాక్ ఫ్రంట్ గ్రిల్, స్కొడా లోగో మరియు మెరుస్తున్న హెడ్‌లైట్లను చూడవచ్చు మరియు ఇందులో దాని రూఫ్ రెయిల్ కూడా కనిపిస్తుంది. సరికొత్త స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ముందు వైపు నుండి ఇది చాలా స్టైలిష్ మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

స్కొడా కుషాక్ వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో కూడిన స్కొడా బ్యాడ్జింగ్ మరియు ఆకర్షణీయమైన టెయిల్ లైట్స్ డిజైన్‌ను గమనించవచ్చు. ఈ టీజర్‌లో స్కొడా కుషాక్ ఫ్రంట్ బానెట్‌పై ఉన్న క్రీజ్ లైన్స్‌ను కూడా చూపిస్తుంది. ఆ తర్వాత కారును ప్రారంభించేటప్పుడు స్టార్ట్ / స్టాప్ బటన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపబడుతుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

ఇంకా ఇందులో స్టీరింగ్ వీల్‌కు ఇరువైపులా ఉన్న కంట్రోల్ బటన్లను కూడా గమనించవచ్చు. ఈ కారులోని స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఇందులో హైలైట్ చేశారు. ఈ అల్లాయ్ వీల్స్ చాలా విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

ఇక ఇంజన్ విషయనికి వస్తే, ఇందులో మొదటిది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ ఉంటుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇదే ఇంజన్‌ను ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించనున్నారు.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

స్కొడా ఇండియా, భారత మార్కెట్ కోసం తయారు చేయబోయే అన్ని భవిష్యత్ మోడళ్లను ఎమ్‌క్యూబి-ఏ0-ఇన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ సంస్థ యొక్క గ్లోబల్ ఎమ్‌క్యూఓ ప్లాట్‌ఫామ్ యొక్క భారతీయ వెర్షన్‌గా ఉంటుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

స్కొడా కుషాక్ తయారీలో కంపెనీ 95 శాతం స్థానికికంగా భారతదేశంలో లభించే విడిభాగాలను ఉపయోగిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే, ఇది దాదాపుగా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనొచ్చు. స్కొడా కుషాక్ పరిమాణం విషయానికి వస్తే, ఇది 2,671 మిమీ‌వీల్ బేస్‌ను, 4,256 మిమీ పొడవును మరియు 1,589 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

కుషాక్ ఎస్‌యూవీ ఇంటీరియర్లలో లభించే ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, సబ్‌ వూఫర్‌తో కూడిన 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో-ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ మొదలైనవి ఉన్నాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ టీజర్ విడుదల; అంచనా ధర, ఇతర వివరాలు!

భారతదేశంలో స్కొడా కుషాక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభమైంది. త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, ఎమ్‌జి హెక్టర్ వంటి మోడళ్లతో పోటీ పడబోతోంది.

Most Read Articles

English summary
Skoda Kushaq SUV New Teaser Released Ahead Of India Launch Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X