త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఇప్పుడు మ్యాట్ ఎడిషన్ల ట్రెండ్ మొదలైంది. మొరటుగా కనిపించే పెయింట్ ఫినిష్‌ తో కూడిన కార్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో, కార్ల తయారీదారులు కూడా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మ్యాట్ పెయింట్ ఫినిషింగ్‌ తో కూడిన కార్లను ప్రవేశపెడుతున్నాయి.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

ఇటీవల కొరియన్ కార్ బ్రాండ్ కియా తమ సెల్టోస్ ఎస్‌యూవీలో ఎక్స్-లైన్ ఎడిషన్ పేరిట ఓ మ్యాట్ ఫినిష్డ్ వెర్షన్‌ ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ స్కోడా ర్యాపిడ్ (Skoda Rapid) లో కంపెనీ ఓ మ్యాట్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

స్కోడా ర్యాపిడ్ మ్యాట్ ఎడిషన్ (Skoda Rapid Matte Edition) ను కంపెనీ తొలిసారిగా గతేడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించింది. కాగా, ఇప్పుడు ఈ మోడల్‌ ను కంపెనీ సెప్టెంబర్ 2021 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. స్కోడా రాపిడ్ యొక్క ఈ స్పెషల్ ఎడిషన్ కొత్త మ్యాట్ ఫినిష్ కలర్లలో లభ్యం కానుంది.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

అంతేకాకుండా, ఈ స్పెషల్ ఎడిషన్ లో మరింత స్పోర్టీనెస్ ను జోడించేందుకు దాని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో పలు చోట్ల ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్ కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ విభాగంలో ప్రత్యేకమైన మ్యాట్ ఫినిష్ కలర్లలో అందుబాటులోకి వచ్చిన మొదటి కారు కూడా ఇదే అవతుందని భావిస్తున్నారు.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

ఇటీవల బహిర్గతమైన స్పై చిత్రాలలో, ఇందులో రెడ్ యాక్సెంట్స్ కి బదులుగా బాడీ కలర్ లేదా గ్లోసీ బ్లాక్ కలర్ యాక్సెంట్స్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్), బూట్ లిడ్, బూట్ లిప్ మరియు బ్రేక్ కాలిపర్‌ లపై ఈ కలర్ యాక్సెంట్స్ కనిపించాయి. మరి మార్కెట్లో విడుదల కాబోయే, స్పెషల్ ఎడిషన్ లో కంపెనీ ఏ కలర్ యాక్సెంట్స్ ఉపయోగిస్తుందో వేచి చూడాలి.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

అంతేకాకుండా, ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కోడా రాపిడ్ మ్యాట్ ఎడిషన్ కారులో కంపెనీ కొత్త డిజైన్ తో కూడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ని కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. పొందవచ్చు, ఇది దాని ఎక్స్టీరియర్ లుక్ ని మరింత మెరుగుపరుస్తుంది. ఇందులోని ఇంటీరియర్ లను స్వల్పంగా అప్‌డేట్ చేసే అకాశం ఉంది.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

స్కోడా రాపిడ్ మ్యాట్ ఎడిషన్ ఇంటీరియర్స్ లో చేయబోయే మార్పులలో కొత్త అప్‌హోల్స్టరీని ఆశించవచ్చు. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ అయిన మోంటే కార్లో లో అందిస్తున్న ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి కూడా ఉంటాయని సమాచారం.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

స్టీరింగ్ వెనుక డ్యాష్‌బోర్డుపై ఇందులో డిజిటల్ ఎమ్ఐడి స్క్రీన్ ఉంటుంది. ఇది టెంపరేచర్, ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, గడియారం, మైలేజ్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఎమ్ఐడి స్క్రీన్ కి ఇరువైపులా అనలాగ్ స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ లు ఉంటాయి. ఇతర వేరియంట్ల మాదిరిగానే, ఇందులో కూడా విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కోడా రాపిడ్ మాంటే కార్లో (Skoda Rapid Monte Carlo) వేరియంట్ 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఈ 999 సిసి, 3 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

కాగా, ఈ కొత్త స్కోడా ర్యాపిడ్ మ్యాట్ ఎడిషన్ (Skoda Rapid Matte Edition) లో కూడా కంపెనీ అదే ఇంజన్‌ను కొనసాగించనుంది. ఇక మైలేజ్ విషయానికొస్తే, ర్యాపిడ్ టిఎస్ఐ నగరంలో సగటున లీటరుకు 12 కిమీ నుండి 14 కిమీ మైలేజీని మరియు హైవేపై సగటును లీటరుకు 18 కిమీ నుండి 20 కిమీ మైలేజీని అందిస్తుంది. దీని ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 55 లీటర్లు. అంటే, ఫుల్ ట్యాంక్ పై ఈ కారులో సులభంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

కొత్త మ్యాట్ ఎడిషన్ స్కోడా ర్యాపిడ్ లో కూడా ఈ గణంకాలు ఒకేలా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం స్కోడా ఆటో ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో స్కోడా రాపిడ్ చాలా ప్రముఖమైన మోడల్. కంపెనీ ఇప్పటికే ఈ సెడాన్ ను అనేక స్పెషల్ ఎడిషన్ల రూపంలో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, కొత్తగా రాబోయే మ్యాట్ ఎడిషన్ కు కూడా మంచి స్పందన లభిస్తుందని కంపెనీ ఆశిస్తోంది. అయితే, దీని ధర స్టాండర్డ్ వేరియంట్ల కన్నా కాస్తంత ప్రీమియంగా ఉండొచ్చని అంచనా.

త్వరలో విడుదల కానున్న Skoda Rapid Matte Edition డీటేల్స్..

స్కోడా కాంపాక్ట్ వర్క్‌షాప్స్..

ఇటీవల స్కోడా ఆటో మెట్రో కాని ప్రదేశాలలో కాంపాక్ట్ వర్క్‌షాప్‌ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాంపాక్ట్ వర్క్‌షాప్‌లు ఆయా ప్రదేశాలలోని సేల్స్ మరియు డీలర్ బ్రాంచ్‌ లతో విలీనం చేయబడతాయి మరియు కస్టమర్ల ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అవసరాలను తీర్చగలుగుతాయని కంపెనీ తెలిపింది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda rapid matte edition india launch expected in september 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X