సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

స్కొడా ఆటో గత డిసెంబర్ నెలలో నిలిపివేసిన రాపిడ్ సెడాన్ 'రైడర్' వేరియంట్‌ను అనూహ్యంగా తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొత్తగా వచ్చిన స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ ధర రూ.7.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

మునుపటి ధరతో పోల్చుకుంటే ఈ కొత్త ర్యాపిడ్ రైడర్ వేరియంట్ ధర రూ.30,000 అధికంగా ఉంటుంది. గతంలో ఈ బేస్ వేరియంట్‌ని రూ.7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విక్రయించేవారు. ఈ బేస్ వేరియంట్ ధర పెరిగినప్పటికీ, ఈ విభాగంలో ఇదే సరసమైన సెడాన్‌గా కొనసాగుతుంది.

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

స్కొడా ర్యాపిడ్ లైనప్‌లో కొత్త రైడర్ వేరియంట్ వచ్చిన చేరడంతో, ఇందులో మొత్తం వేరియంట్ల సంఖ్య ఆరుకి చేరుకుంది. ఈ మోడల్ రైడర్, రైడర్ ప్లస్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో అనే వేరియంట్లలో లభిస్తుంది.

MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

స్కొడా రాపిడ్ రైడర్ వేరియంట్‌తో ధరల పెరుగుదల మినహా వేరే మార్పులేవీ లేవు. ఇది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

ఈ వేరియంట్ (రైడర్) కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ర్యాపిడ్ రైడర్ వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు. కానీ, టాప్-ఎండ్ వేరియంట్లలో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభిస్తుంది.

MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

కొత్త 2021 స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్‌లో నాలుగు స్పీకర్లు మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డబుల్ డిన్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ సాకెట్స్, 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు ఎబిఎస్ వంటి ఫీచర్లతో లభిస్తాయి.

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

కొత్త ర్యాపిడ్ రైడర్ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టడంతో పాటుగా, స్కొడా ఆటో తన ఇతర ర్యాపిడ్ వేరియంట్ల ధరలను కూడా రూ.20,000 వరకూ పెంచింది. ధరల పెరుగుదల తర్వాత స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ ఇప్పుడు రూ.8.19 లక్షలు (మ్యాన్యువల్) మరియు రూ.9.69 లక్షలు (ఆటోమేటిక్)గా ఉంది.

MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

ఇకపోతే, ఇందులో రేంజ్-టాపింగ్ వేరియంట్ అయిన ర్యాపిడ్ మోంట్ కార్లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.11.99 లక్షలు మరియు రూ.13.69 లక్షలుగా ఉన్నాయి. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

సర్‌ప్రైజ్.. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ రీలాంచ్: ధర, ఫీచర్లు

స్కొడా ర్యాపిడ్ రైడర్ భారత సెడాన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా కొనసాగుతుంది. ఈ మోడల్ లైనప్‌లో ధరల అంతరాన్ని తగ్గించేందుకు స్కొడా బేస్ వేరియంట్‌ను తిరిగి ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Rapid Rider Variant Relaunched In India, Price And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X