స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

స్కొడా బ్రాండ్ నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ర్యాపిడ్ సెడాన్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ సగటున ప్రతినెలా 1,000 యూనిట్ల వరకూ అమ్ముడవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్కొడా ర్యాపిడ్ అమ్మకాలలో ఎక్కువగా టిఎస్ఐ ఇంజన్ వేరియంట్లే ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

మునుపటి పాత పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లతో పోలిస్తే ప్రస్తుత స్కొడా రాపిడ్ యొక్క టిఎస్ఐ వెర్షన్ అత్యధిక యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్లు స్కొడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. గత ఆరు నెలల కాలంలో స్కొడా ఆటో ఇండియా దాదాపు 4,000 యూనిట్ల రాపిడ్ సెడాన్లను విక్రయించింది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

అయితే, గత ఏడాది ఇదే కాలంలో పాత పెట్రోల్, డీజిల్ మోడళ్లను విక్రయించేటప్పుడు ర్యాపిడ్ సెడాన్ అమ్మకాలు కేవలం 2,700 యూనిట్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. భారతదేశంలో కేవలం పెట్రోల్ ఇంజన్ వాహనాలను మాత్రమే తయారు చేయాలన్న తమ కంపెనీ వ్యూహాన్ని జాక్ హోలిస్ గుర్తు చేశారు.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

స్కొడా ర్యాపిడ్ సెడాన్ విషయంలో గతంలో విక్రయించిన పెట్రోల్, డీజిల్ ఇంజన్ అమ్మకాలతో పోలిస్తే, ప్రస్తుతం విక్రయిస్తున్న టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ అమ్మకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని, భారతీయ కస్టమర్లు ఈ మోడల్‌ను బాగా అంగీకరించారని, తమ భవిష్యత్ ప్రణాళికలకు ఇది ఓ మంచి సంకేతమని ఆయన అన్నారు.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

స్కొడా రాపిడ్ విషయానికి వస్తే, ఈ కారులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆప్షనల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో కంపెనీ గతంలో నిలిపివేసిన రైడర్ బేస్ వేరియంట్‌ను ఈ ఏడాది ఆరంభంలో తిరిగి ప్రవేశపెట్టింది. స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్‌లో నాలుగు స్పీకర్లు మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డబుల్ డిన్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ సాకెట్స్, 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు ఎబిఎస్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

స్కొడా ర్యాపిడ్ లైనప్‌లో కొత్త రైడర్ వేరియంట్ తిరిగి మార్కెట్లో వచ్చిన తర్వాత, ఈ లైనప్‌లో మొత్తం వేరియంట్ల సంఖ్య ఆరుకి చేరుకుంది. ప్రస్తుతం స్కొడా ర్యాపిడ్ రైడర్, రైడర్ ప్లస్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ వెర్షన్‌కే అత్యధిక డిమాండ్; త్వరలోనే సిఎన్‌జి వెర్షన్ లాంచ్!

స్కొడా ర్యాపిడ్ సిఎన్‌జి వేరియంట్ వస్తోంది!

ఇదిలా ఉంటే, స్కొడా ర్యాపిడ్ అమ్మకాలను పెంచేందుకు కంపెనీ ఇందులో ఓ సిఎన్‌జి వేరియంట్‌ను కూడా ప్లాన్ చేస్తొంది. సిఎన్‌జి వెర్షన్ స్కొడా ర్యాపిడ్ ఈ ఏడాది ఎప్పుడైనా అమ్మకానికి రావచ్చని తెలుస్తోంది. కొత్త స్కొడా ర్యాపిడ్ సిఎన్‌జిలో కూడా ప్రస్తుత 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Rapid TSI Is Now High In Demand, Plans To Launch CNG Version Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X