Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) భారత మార్కెట్లో తమ తర్వాతి మోడల్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) మిడ్-సైజ్ సెడాన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇటీవలే ఈ మోడల్ టీజర్ ను కూడా విడుదల చేసింది. కాగా, ఇప్పుడు ఈ మోడల్ భారతదేశంలో విడుదల కాబోయే సమయం గురించి సమాచారం వెల్లడైంది.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్కోడా ఆటో తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ లో స్లావియా కారును అప్‌డేట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం, స్కోడా ఆటో ఇండియా ఈ కొత్త మిడ్-సైజ్ సెడాన్ స్లావియాను వచ్చే నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అయితే, దాని అమ్మకాలు మాత్రం 2022 ఆరంభంలో జరుగుతాయని భావిస్తున్నారు.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్లావియా మొదటి టీజర్‌ను విడుదల చేసినప్పుడు, స్కోడా ఈ సెడాన్ ను ఈ ఏడాది శీతాకాలంలో (వింటర్ 2021) విడుదల చేస్తామని ప్రకటించింది. దీన్నిబట్టి చూస్తుంటే, స్కోడా స్లావియా సెడాన్ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఖచ్చితంగా విడుదల కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఈ విషయం గురించి కంపెనీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు మరియు ఇది కేవలం అంచనా మాత్రమే.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్కోడా ఆటో తమ స్లావియా సెడాన్ ను కేవలం భారతదేశంలోనే కాకుండా, పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. భారతదేశం కోసం స్కోడా ఆటో ఇండియా ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్న రెండవ మోడల్ స్లావియా. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మొదటి మొదటి మోడల్ అయిన స్కోడా కుషాక్ ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసినదే.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్కోడా కుషాక్ మాదిరిగానే, స్కోడా స్లావియా సెడాన్ ను కూడా కంపెనీ తమ పాపులర్ MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనుంది. స్కోడా ఇటీవల పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన తమ స్లావియా సెడాన్ చిత్రాలను విడుదల చేసింది. ఇది హెవీగా క్యామోఫ్లేజ్ చేయబడి ఉన్నప్పటికీ, దాని డిజైన్ గురించి కొంత మేర సమాచారం వెల్లడైంది. హెడ్‌లైట్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ గ్రిల్‌తో సహా పలు విషయాలు ఈ చిత్రాలలో కనిపించాయి.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్కోడా స్లావియా డిజైన్ ను గమనిస్తే, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ముందు భాగంలో స్కోడా సిగ్నేచర్ గ్రిల్, దాని దిగువ భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ లు, హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన సెకండ్ గ్రిల్, ఇరు వైపులా సన్నటి హెడ్‌లైట్స్ మరియు ఫ్రంట్ బంపర్ లో అమర్చిన గుండ్రటి ఫాగ్ లైట్లు మొదలైనవి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌ లో, ఇందులోని 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు, ఇవి నలుపు రంగులో ఉండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

అలాగే, ఇందులో టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్లు, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ఈ డోర్ హ్యాండిల్స్ గుండా పోయే సైడ్ బాడీ లైన్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా, దీని బి-పిల్లర్ ను కూడా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ కారు వెనుక భాగాన్ని చిత్రంలో వెల్లడి చేయలేదు, కానీ సైడ్ నుండి చూసినప్పుడు బూట్ పొడవు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

ఈ కారులో ఆశించే ఇతర ఫీచర్లలో అన్ని ఎల్ఈడి లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ప్రీమియం ఇంటీరియర్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ కార్ కనెక్ట్ ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీతో పాటుగా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కూడా ఇందులో ఆశించవచ్చు. ఈ మిడ్ సైజ్ సెడాన్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కోడా ర్యాపిడ్ సెడాన్ కంటే పెద్దదిగా ఉంటుందని సమాచారం.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్కోడా ఆటో ఇటీవల అప్‌డేట్ చేసిన ఆక్టావియా మరియు సూపర్బ్ వంటి కార్ల నుండి స్పూర్తి పొంది స్లావియా సెడాన్ ను డిజైన్ చేసే అవకాశం ఉంది. స్కోడా బ్రాండ్, దేశీయ మార్కెట్లో తమ కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విడుదల చేయటం ద్వారా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

స్కోడా ఆటో ఇండియా తమ స్లావియా సెడాన్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు తద్వారా ఈ కారుని సరసమైన ధరకే అందించేందుకు కంపెనీ ఇందులో 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

Skoda Slavia సెడాన్ భారత మార్కెట్లో విడుదలయ్యేది ఎప్పుడంటే..?

ప్రస్తుతం, స్కోడా విక్రయిస్తున్న లేటెస్ట్ కుషాక్ ఎస్‌యూవీలో కూడా ఇవే ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. స్కోడా స్లావియా సెడాన్ ద్వారా కంపెనీ, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ప్రవేశించనుంది. స్కోడా స్లావియా ఈ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ వంటి కార్లకు పోటీగా నిలుస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia india launch timeline revealed expected features details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X