భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా, భారత మార్కెట్ కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇటీవలే తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కుషాక్‌ను విడుదల చేసిన స్కొడా, ఇప్పుడు కొత్త 2021 కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

తాజా సమాచారం ప్రకారం, స్కొడా తమ కొత్త బిఎస్6 వెర్షన్ 2021 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 13, 2021వ తేదీన ఈ బ్రాండ్ తమ కొత్త స్కొడా కొడియాక్ ఎస్‌యూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

ఇప్పటికే ఇది కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి వచ్చింది. ఈ ఏడాది చివరినాటికి ఇది భారత మార్కెట్లో కూడా అమ్ముడయ్యే అవకాశం ఉంది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 స్కొడా కొడియాక్ సరికొత్త డిజైన్ మరియు అదనపు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

కొత్త 2021 స్కొడా కోడియాక్‌లో బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

ఇంజన్ నుండి వెలువడే శక్తిని ఈ గేర్‌బాక్స్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఈ ఫోర్-వీల్ డ్రైవ్ కారు కేవలం 7.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు 4,697 మిమీ పొడవును, 1,882 మిమీ వెడల్పును మరియు 1,665 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

కొత్త 2021 స్కొడా కొడియాక్‌లో మరింత నిటారుగా ఉండే హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కి ఇరువైపులా సన్నటి డిజైన్ మరియు ఇంటిగ్రేటెడి ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, దీని వెనుక భాగంలో సి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

ఇంకా ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బోనెట్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, బెటర్ విజిబిలిటీ కోసం ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ యూనిట్, ఫ్రంట్ బంపర్‍‌లో హనీకోంబ్ గ్రిల్ మరియు ఎల్-ఆకారపు సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ వంటి అంశాలు ఉన్నాయి. అలాగే, రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉన్నట్లుగా కనిపించే స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

అంతేకాకుండా, రూఫ్ పైభాగంలో కొత్త బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వెనుక వైపు బూట్ డోరుపై పెద్ద అక్షరాలతో కూడిన స్కొడా బ్యాడ్జింగ్, స్ప్లిట్ స్టైల్ ఎల్ఈడి టెయిల్ లైట్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైప్ డిజైన్, కొత్త 18 ఇంచ్ మరియు 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

ఇంటీరియర్స్‌లో వర్చువల్ కాక్‌పిట్, పానోరమిక్ సన్‌రూఫ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 750 వాట్ 12 స్పీకర్ ఆడియో సిస్టమ్, హీటెడ్ ఫంక్షన్‌తో పాటుగా మసాజ్ ఫంక్షన్‌ను కూడా కలిగిన ఆప్షనల్ ఎర్గోనామిక్ వెంటిలేటెడ్ సీట్స్, 10 రకాల కలర్ ఆప్షన్లు కలిగిన ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌కు కొత్త 2021 స్కొడా కొడియాక్; ఏడాది చివరి నాటికి విడుదల!

గతంలో స్కొడా ఆటో భారత మార్కెట్లో తమ బిఎస్4 వెర్షన్ కోడియాక్ 4x4 మోడల్‌ను రూ.34.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. అయితే, ఈ కొత్త 2021 కొడియాక్‌లో చేసిన డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌ల కారణంగా దీని ధర కాస్తంత అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది. స్కొడా కొడియా ఈ విభాగంలో ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda To Launch New 2021 Kodiaq Facelift SUV In India By This Year-end, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X