మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువవుతోంది. ఈ సమయంలో మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తున్నాయి. వాహన వినియోగదారులు కూడా ప్రస్తుతం డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ మొబైల్ కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పుడు వివో (VIVO) కంపెనీ ఈ విభాగంలో ప్రవేశించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కంపెనీ తన అడుగులు వేయబోతోందని తెలిపింది. ఈ బాటలోనే మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడా తన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఇదివరకటి కథనాలతో తెలుసుకున్నాం.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

ఇప్పుడు తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీవో కూడా తన ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల VIVO భారత మార్కెట్ కోసం ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. అంతకంటే ముందు మరొక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OnePlus కూడా భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సమాచారం ప్రకారం, OnePlus భారతదేశంలో "Oneplus Life" కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

ఇప్పటికే చాలామంది స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారతీయ మార్కెట్ కోసం డ్రైవర్‌లెస్ కార్లు, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్లు, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బోర్డులు, రిమోట్ కంట్రోల్ వాహనాలు, సివిలియన్ డ్రోన్‌లు మరియు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ యూనిసైకిళ్లపై పని చేస్తున్నారు. కావున త్వరలో ఏ ఆధునిక వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

Oppo తన EV ని 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. Xiaomi, Huawei మరియు Apple కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కేలో విడుదల చేయనున్నాయి. మరోవైపు, స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో కంపెనీ భారతదేశం కోసం ఎలక్ట్రిక్ కారుని అందించడానికి కృషి చేస్తుంది. అయితే దీనిని కంపెనీ 2024 లో ప్రారంభించే అవకాశం ఉంటుంది.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

OPPO, Realme మరియు OnePlus వంటి బ్రాండ్‌లు BBK ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్నాయి. OPPO, Realme మరియు OnePlus వంటి అనేక బ్రాండ్లు ప్రస్తుతం భారతీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి మరియు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాయి. Oppo తన ఉత్పత్తిని 2024 ప్రారంభంలో ప్రారంభించవచ్చు.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

భారతీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు విడుదల చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కావున దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా త్వరలో వెల్లడవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ తయారీదారు వాస్తవానికి EV స్పేస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నట్లయితే, అది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కావున చాలా మంది వాహన తయారీ దారులు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను దృష్టిలో ఉంచుకుని తమ ఉనికిని చాటుకోవడానికి మరియు దేశీయ మార్కెట్లో సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి కంపెనీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. కావున ఈ విభాగంలో ప్రస్తుతం చాలా గట్టి పోటీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఆపిల్, గూగుల్, Huawei మరియు Xiaomi వంటి కంపెనీలు తమ సొంత ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంలో వివిధ దశల్లో ఉన్నాయి. కావున త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తప్పకుండా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

మొన్న OPPO నేడు VIVO.. వరుసగా ఎలక్ట్రిక్ వాహన తయారీపై పడుతున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా సాధారణ ప్రజలు డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను వినియోగించడానికి కొంత వెనుకాడుతున్నారు. ఈ కారణంగానే వారు వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా చాలా కంపెనీ దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి.

Most Read Articles

English summary
Smartphone company vivo files trademark for electric vehicle in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X