తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశమని మనం రోజూ చెప్పుకుంటూనే ఉన్నాము, కానీ ఇప్పటికి కూడా దేశంలో చాలామంది ప్రజలు కారు కొనడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక కారు కొనడం అనేది నిజంగా సాధారణమైన విషయం కాదు, కారు కొనాలంటే ఆ ఇంట్లో అందరూ ఒకసారి ఆలోచిస్తారు. అయితే ఇటీవల ఒక యువకుడు తన తండ్రికి అధునాతన ఫీచర్స్ కలిగిన Skoda బ్రాండ్ యొక్క Kushaq కారుని గిఫ్ట్ గా అందించాడు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

యువకుడు తన తండ్రికి స్కోడా కుషాక్ అందించే వీడియో కూడా అందుబాటులో ఉంది. దీనిని మీరు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు. ఈ వీడియో ఆరంభంలో వారు స్కోడా డీలర్‌షిప్‌కి తెలుపు రంగు Hyundai Grand i10 కారులో వస్తారు. ఈ వీడియో YouTube ఛానల్ THE FOTOWALLA లో అప్‌లోడ్ చేసారు.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

వారు స్కోడా డీలర్‌షిప్‌కి వచ్చిన తరువాత కొనుగోలుకు సంబందించిన డాక్యుమెంట్స్ అందించడం జరుగుతుంది. తర్వాత కేక్ కట్ చేసి చాలా ఆనందంగా ఉంటారు, ఆ సమయంలో కారు డెలివరీ తీసుకున్నారు. ఆ విధంగా ఆ యువకుడి తండ్రి కారు డెలివరీ తీసుకునేటప్పుడు కొంచెం సెంటిమెంట్‌గా ప్రవర్తించాడని మనం చూడవచ్చు.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

ఆ యువకుడు తన తండ్రి మరియు తల్లికి కారు బహుమతిగా ఇవ్వాలనేది తన కల అని చెప్పాడు. ఆ యువకుడు స్కోడా కుషాక్ యొక్క యాక్టివ్ వేరియంట్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అంతే కాకుండా ఇది ఆధునిక పరికరాలను పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

ఈ కొత్త స్కోడా కుషాక్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

అంతే కాకుండా ఇందులో ఫీచర్లలో ఫోల్డబుల్ కీ, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, స్టోరేజ్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఫాబ్రిక్ సీట్లు, క్రోమ్ స్క్రోలర్‌లతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, హైట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ కాలమ్ మరియు రియర్ ఎసి వెంట్‌లు ఉన్నాయి. వీటితో పాటు 50 కేజీల బరువును మోయగల రూప్ రైల్, రియర్ స్పాయిలర్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై ఫాబ్రిక్, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్‌లు, యాంటీ-గ్లేర్ వింగ్ మిర్రర్స్ మరియు 12V ఛార్జింగ్ సాకెట్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

కొత్త స్కోడా కుషాక్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో 7 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతారు. ఇది 6 స్పీకర్లకు కనెక్ట్ చేయబడింది. డ్రైవర్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, బేసిక్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు డెడ్ పెడల్‌ను కూడా పొందుతాడు. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

స్కోడా కుషాక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు. ఇవి రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడతాయి. అవి 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్జి గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంచబడ్డాయి.

మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది.

తండ్రికి Skoda Kusaq గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు [వీడియో]

స్కోడా కుషాక్ ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, దీని టాప్ వేరియంట్‌ ధర రూ. 17.60 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన స్కోడా కుషాక్, Hyundai Creta (హ్యుందాయ్ క్రెటా), ఎంజి ఆస్టర్, వోక్స్వ్యాగన్ టైగన్, నిస్సాన్ కిక్స్ మరియు రెనాల్ట్ డస్టర్‌మరియు Kia Seltos (కియా సెల్టోస్‌) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Son gifted skoda kushaq to his dad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X