ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ స్టోర్మ్ మోటార్స్, ఇటీవలే ఆవిష్కరించిన తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్ "స్టోర్మ్ ఆర్3" కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన మొదటి నాలుగు రోజుల్లోనే 7.5 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్లను దక్కించుకున్నట్లు ప్రకటించింది.

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

స్టోర్మ్ ఆర్3 ఒక ఆల్-ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ వెహికల్‌గా ఉంటుంది. ఇందులో రెండు డోర్లు, రెండు సీట్లు మరియు మూడు చక్రాలు మాత్రమే ఉంటాయి. ప్రత్యేకించి పట్టణ రవాణాను దృష్టిలో ఉంచుకొని ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేశారు.

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

స్టోర్మ్ మోటార్స ఈ ఏడాది పరిమిత సంఖ్యలో ఉత్పత్తి ఆర్3 ఎలక్ట్రిక్ వాహనాలను చేయనుంది. ప్రస్తుతం ఈ వాహనం కోసం ప్రీ-బుకింగ్‌లను ముంబై, థానే, నేవీ ముంబై, న్యూఢిల్లీ, గుర్గావ్ మరియు నోయిడా ప్రాంతాల్లో మాత్రమే స్వీకరిస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.4.50 లక్షలు మాత్రమే.

MOST READ:ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

ఈ ప్రైస్ ట్యాగ్‌తో స్టోర్మ్ ఆర్3 భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వాహనంగా మారింది. ముంబై మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.10,000 అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రాబోయే కొద్ది వారాల పాటు ఈ బుకింగ్‌లు తెరిచి ఉంటాయి.

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ముందుగా బుక్ చేసుకునే ప్రారంభ కస్టమర్‌లకు కంపెనీ సుమారు రూ.50,000 విలువైన ప్రయోజనాలను కూడా అందించనుంది. ఇందులో కస్టమైజబల్ కలర్ ఆప్షన్స్, ప్రీమియం ఆడియో సిస్టమ్స్ మరియు మూడు సంవత్సరాల ఉచిత మెయింటినెన్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

స్టోర్మ్ మోటార్స్ తమ ఆర్3 ఎలక్ట్రిక్ వాహనం కోసం ఏఆర్ఏఐ సర్టిఫికేట్ మరియు దాని వెహికల్ కంట్రోల్ యూనిట్ (విసియూ) కోసం పేటెంట్లను దాఖలు చేసింది. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 48 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

స్టోర్మ్ ఆర్3 గరిష్ట వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇందులో పెద్ద సన్‌రూఫ్, ఆన్‌బోర్డ్ చార్జర్, గెశ్చర్ మరియు వాయిస్ కమాండ్స్‌తో కూడిన ట్రిపుల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, మూడు డ్రైవింగ్ మోడ్స్ (ఎకో/నార్మల్/స్పోర్ట్స్) మరియు పూర్తి ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

అంతేకాకుండా, ఇందులో 4జి-కనెక్ట్ డయాగ్నొస్టిక్ ఇంజన్ ఆన్‌బోర్డ్‌ను కూడా ఉంటుంది. దీని సాయంతో వాహన యజమానులు తమ వాహనం యొక్క స్థితి మరియు ఛార్జింగ్ స్థాయి మొదలైన వాటిని ట్రాక్ చేయవచ్చు. అలాగే బ్రేక్ ప్యాడ్‌లు, మోటార్లు మరియు ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని క్లిష్టమైన భాగాల యొక్క పూర్తి ఆరోగ్య నివేదికను కూడా పొందవచ్చు.

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

గత 2016లో స్థాపించబడిన స్టోర్మ్ మోటార్స్ తమ 'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా' ప్లాన్‌లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని మూడు విభాగాలకు చెందిన ప్రజల కోసం డిజైన్ చేసింది. వీరిలో వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫ్లీట్ ఆపరేటర్స్ మరియు రద్దీగా ఉండే సిటీలో చిన్నపాటి దూరాలను చేరుకోవాలనుకునే కుటుంబాలు ఉన్నాయి.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

స్టోర్మ్ ఆర్3 ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే, ఇది వాస్తవ రూపం దాల్చి కస్టమర్లను చేరుకోవటానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టొచ్చు. ఈ వాహనం యొక్క డెలివరీలు 2022 ఆరంభం నాటికి ప్రారంభమవుతాయని అంచనా.

Most Read Articles

English summary
Strom R3 EV Grabs Rs 7.5 Crore Worth Orders In Just Four Days. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X