కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

మారుతి సుజుకి ఆల్టో కారు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలంగా భారత స్మాల్ కార్ మార్కెట్లో ఓ వెలుగు వెలుగుతున్న మోడల్ ఇది. బెస్ట్ బడ్జెడ్ ఫ్రెండ్లీ కారుగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు మహారథంలా మరియు యువ కస్టమర్లకు తమ ఫస్ట్ కారుగా ఎంతో మందికి చేరువైన మోడల్ ఈ మారుతి సుజుకి ఆల్టో. అందుకే, ఇది భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా అగ్రస్థానంలో ఉంది. మార్కెట్లో ఆల్టోకి పోటీగా ఎన్ని మోడళ్లు వచ్చినప్పటికీ, అవి ఈ రేసులో మాత్రం విజయం సాధించలేకపోయాయి.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

మారుతి సుజుకి ఇండియా ఈ పాపులర్ కారును కేవలం భారతదేశంలోనే కాకుండా, సుజుకి మాతృదేశమైన జపాన్ మార్కెట్లో కూడా విక్రయిస్తుంది. జపాన్ మార్కెట్లో సుజుకి ఆల్టో కారుకి ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉండి. సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇటీవలే తమ సరికొత్త తరం ఆల్టో కారును జపాన్ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే, ఇదే మనదేశంలో లభించే ఆల్టో కారుకి చాలా భిన్నంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, జపనీస్ వెర్షన్ సుజుకి ఆల్టో కారు, ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి విక్రయిస్తున్న ఎస్-ప్రెసో కారు మాదిరిగా ఉంటుంది.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

సుజుకి 1979 లో జపాన్‌లో తొలిసారిగా తమ ఆల్టో కారును ప్రవేశపెట్టింది. తాజాగా ఇందులో ఆవిష్కరించిన సరికొత్త మోడల్ ఆల్టో కారు దాని తొమ్మిదవ తరానికి చెందినది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో డిజైన్‌ను ఈ సుజుకి ఆల్టో కారుతో పరిశీలిస్తే, ఈ రెండు మోడళ్లు వాటి పేర్లను తప్ప మరేమీ పంచుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. జపనీస్ వెర్షన్ ఆల్టో కారు ఓవరాల్ బాక్సీ డిజైన్ కలిగి ఉండి, చూడటానికి ఓ మైక్రో ఎస్‌యూవీ మాదిరిగా అనిపిస్తుంది.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

సుజుకి మోటార్ భాగస్వామి అయిన మారుతి సుజుకి ఇండియా కూడా ఈ ఏడాది చివరిలో తమ కొత్త 2022 ఆల్టో కారును విడుదల చేసే అవకాశం ఉంది. డిజైన్‌ పరంగా ఈ రెండు మోడల్లలో భారీ వ్యత్యాసం ఉండనుంది. జపాన్ మార్కెట్ కోసం సుజుకి మోటార్ కార్పోరేషన్ రిలీజ్ చేసిన అధికారిక చిత్రాలు ఆల్టో యొక్క కొత్త ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్‌పై స్పష్టమైన వివరాలను తెలియజేస్తాయి. మొదటి చూపులోనే కొత్త తరం ఆల్టో డిజైన్ బాక్సీ స్టైల్ లో మారుతి ఎస్-ప్రెసో నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

పాత తరం (2014లో ప్రవేశపెట్టబడిన) జపనీస్ ఆల్టో కారుతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం ఆల్టో కారు డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఇప్పుడు మునుపటి కంటే మరింత సున్నితంగా మరియు గుండ్రంగా కనిపిస్తుంది. ముందు వైపున, కొత్త ఆల్టో ఇప్పటికీ పాత మోడల్ లాగా ట్రాపెజోయిడల్ హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది మరియు ఇప్పుడు ఇది కొత్త లైటింగ్ భాగాలతో వస్తుంది. అలాగే, బంపర్, గ్రిల్ మరియు హుడ్ అన్నీ పాత మోడల్ కంటే మరింత షార్ప్‌గా కనిపిస్తాయి.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

సైడ్ ప్రొఫైల్‌ను చూస్తే, కొత్త ఆల్టో పాత కారు కంటే ఏటవాలుగా మరియు పెద్ద గ్లాస్ హౌసింగ్‌ను కలిగి ఉంటుంది, కాకపోతే ఇక్కడ అన్ని అంచులు కూడా వృత్తాకార ఆకారంలో ఫినిష్ చేయబడినట్లుగా ఉంటాయి. వెనుక భాగంలో, కొత్త టెయిల్‌గేట్, బంపర్‌లు మరియు కొత్త స్ట్రెయిట్ టెయిల్‌లైట్‌లు ఉన్నాయి. మొత్తమ్మీద, ఈ తొమ్మిదవ తరం సుజుకి ఆల్టో డిజైన్ దాని ముందున్న రెట్రో స్టైలింగ్‌తో పోలిస్తే కొంచెం కొత్తదిగా అనిపిస్తుంది. ఈ వాహనం యొక్క మరొక హైలైట్ ఏంటంటే, ఇది డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ తో లభ్యం కానుంది.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

కొత్త సుజుకి ఆల్టో వెలుపలి భాగం మరింత గుండ్రంగా ఉన్నట్లు ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో మరింత నిలువుగా ఇన్‌స్టాల్ చేయబడిన విండ్‌షీల్డ్ ఓ కొత్త అప్‌గ్రేడ్ గా చెప్పుకోవచ్చు. కొత్త సుజుకి ఆల్టో ఎత్తు 50 మిమీ పెరిగి 1,525 మిమీకి చేరుకుంది. దీని పొడవు 3,395 మిమీ మరియు వెడల్పు 1,475 మిమీగా ఉంటుంది మరియు ఈ కొలతలు మునుపటి తరం కంటే పెద్దగా మారలేదని తెలుస్తోంది. దీని తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా, ఇరుకైన ప్రదేశాల్లో కూడా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి కలుగుతుంది.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

ప్రత్యేకించి ఇది పట్టణ వాతావరణానికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక క్యాబిన్ లోపలకి వస్తే, దాని ఇంటీరియర్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇందులో సరికొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, రీడిజైన్ చేసిన ఏసి వెంట్‌లు, కొత్త స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు చక్కగా మరియు స్పష్టంగా కనిపించే ఇంటిగ్రేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, ముందు భాగంలో వన్-పీస్ సీటు మరియు అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగానే వెనుకవైపు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లతో కూడిన బెంచ్-స్టైల్ సీటు ఉన్నాయి.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

ఈ తొమ్మిదవ తరం సుజుకి ఆల్టో కారులో కంపెనీ సేఫ్టీ సపోర్ట్ కింద యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్‌ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇందులో లేన్ డిపార్చర్ వార్నింగ్, హై-బీమ్ అసిస్ట్ మరియు పాదచారులను గుర్తించడానికి మరియు తదుపరి ఘర్షణలను నివారించడానికి అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మొదలైన అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇతర సుజుకి కార్ల మాదిరిగానే, కొత్త సుజుకి ఆల్టో కారులో కూడా 660సీసీ త్రీ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

అయితే, ఈసారి కొత్తదనం ఏమిటంటే ఈ తొమ్మిదో తరం ఆల్టో కారు ఇప్పుడు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ జనరేటర్ (ISG) మరియు శక్తిని నిల్వ చేయడానికి చిన్న లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ మోడల్ పవర్ ఫిగర్‌లను సుజుకి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పాత మోడల్ యొక్క 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్లు కొత్త ఆల్టోలో కూడా వస్తాయని భావిస్తున్నారు.

కొత్త 2022 సుజుకి ఆల్టో ఆవిష్కరణ.. కానీ ఇది భారతదేశం కోసం కాదు..

ఇక మనదేశం విషయానికి వస్తే, మారుతి సుజుకి కూడా తమ నెక్స్ట్ జనరేషన్ ఆల్టో కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నివేదించబడింది. ఇటీవల ప్రారంభించిన సెలెరియో మాదిరిగానే, కొత్తగా రాబోయే మూడవ తరం ఆల్టో కారు కూడా కంపెనీ పాపులర్ హార్ట్‌టెక్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Suzuki reveales new 2022 alto hatchback for japan market details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X