సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

జర్మన్ కార్ బ్రాండ్ సుజుకి అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విప్ట్‌ను భారత మార్కెట్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. స్పోర్టీ లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్‌తో ఇది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మోడల్.

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

సుజుకి తాజాగా, ఈ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ మోడల్‌లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను యూరప్ మార్కెట్లలో విడుదల చేసింది. సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హైబ్రిడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ పేరిట కంపెనీ ఇందులో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను అక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టింది.

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

మోటోజిపి ఛాంపియన్‌షిప్‌లో సుజుకి బ్రాండ్ యొక్క తాజా విజయాన్ని పురస్కరించుకొని, కంపెనీ ఈ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హైబ్రిడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్‌ను విడుదల చేసింది. యూరప్ మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి స్విఫ్ట్ ధర 20,900 యూరోలుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు 18.44 లక్షలు.

MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

కొత్త స్విఫ్ట్ స్పోర్ట్ హైబ్రిడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ డిజైన్ మరియు డీటేలింగ్స్‌ను సుజుకి బ్రాండ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేత‌గా నిలిచిన జిఎస్‌ఎక్స్ ఆర్ఆర్ రేస్ బైక్ నుండి స్పూర్తి పొంది తయారు చేశారు. దీని ఎక్స్టీరియర్‌లో ఫ్రంట్ బంపర్ నుండి బానెట్, రూఫ్ మరియు రియర్ బంపర్ మీదుగా రేసింగ్ సిల్వర్ స్ట్రైప్ ఉంటుంది.

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

ఈ లిమిటెడ్ ఎడిషన్ రూఫ్ మొత్తాన్ని సిల్వర్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. దీని బానెట్‌పై ఉన్న సిల్వర్ స్ట్రైప్‌లో సుజుకి బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. మిగిలిన బాడీ మొత్తాన్ని మెటాలిక్ బ్లూ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. సైడ్ మిర్రర్స్‌పై కూడా సిల్వర్ ఫినిషింగ్‌ను చూడొచ్చు.

MOST READ:మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

ఇక ఇంటీరియర్ డీటేల్స్‌ని గమనిస్తే, ఓవరాల్ క్యాబిన్ లేఅవుట్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ ట్రిమ్స్‌పై నియాన్ గ్రీన్ కలర్ యాక్సెంట్స్ ఉంటాయి. ఇందులో డ్యాష్‌బోర్డ్ ట్రిమ్‌పై లేటెస్ట్ మోటోజిపి ఛాంపియన్ జోన్ మీర్ సంతకం మరియు మోటార్‌సైకిల్ నెంబర్ (36) కూడా ఉంటుంది.

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

పైన పేర్కొన్న మార్పుల మినహా ఈ కొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హైబ్రిడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. మెకానికల్‌గా కూడా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. యూరప్ మార్కెట్లలో లభించే హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌నే ఇందులోనూ కొనసాగించారు.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

కొత్త 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హైబ్రిడ్ స్పెషల్ ఎడిషన్ కారులో 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

ఈ ఇంజన్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని హైబ్రిడ్ మోటార్ అదనంగా 13 బిహెచ్‌పిల శక్తిని అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 మైళ్లుగా ఉంటుంది.

MOST READ:భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

సుజుకి స్విఫ్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ విడుదల; వివరాలు!

భారత మార్కెట్ విషయానికి వస్తే, ఇంతటి ఖరీదైన స్పెషల్ ఎడిషన్ ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం లేదు. అయితే, మారుతి సుజుకి మాత్రం భారత వినియోగదారుల కోసం తమ పాపులర్ స్విఫ్ట్ కారులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Suzuki Swift Championship Edition Launched In European Markets, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X