ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

భారత మార్కెట్లో Tata Motors (టాటా మోటార్స్) యొక్క వాహనాలకు ఎనలేని ప్రజాదరణ ఉంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ వాహనాల నాణ్యత మరియు భద్రతలపై వినియోగదారులకున్న నమ్మకం. దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ మంచి అమ్మకాలతో పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కొత్త Altroz కారుని కూడా ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తోంది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

కంపెనీ నివేదికల ప్రకారం Tata Motors (టాటా మోటార్స్) తన ప్రీమియం Altroz హ్యాచ్‌బ్యాక్ ని ఇప్పటికే 1 లక్ష యూనిట్లను తాయారు చేసినట్లు అధికారికంగా తెలిపింది. దీని బతి చూస్తే కంపెనీ యొక్క ఈ హ్యాచ్‌బ్యాక్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ వుందో తెలుస్తుంది. Tata Motors భారతీయ మార్కెట్లో కొత్త Tata Altroz హ్యాచ్‌బ్యాక్ ప్రారంభించిన కేవలం 20 నెలల కాలంలో ఈ ఉత్పత్తిని చేరుకుంది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

భారతదేశంలో అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ ఎక్కువ సంఖ్యలో Altroz హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి చేశారు. ఇది నిజంగా గరించదగ్గ విషయం. ఈ సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

కంపెనీ యొక్క Altroz హ్యాచ్‌బ్యాక్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ లో Altroz ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. అంతే కాకుండా కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ ని ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై నిర్మిస్తుంది. కావున Altroz ఈ విభాగంలో బలమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.

దేశీయ మార్కెట్లో Tata Motors అత్యధికంగా అమ్మకాలు చేపట్టడానికి Tata Altroz ఎంతగానో సహకరిస్తోంది. ఇహి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో 20 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 7,550 యూనిట్ల ఆల్ట్రోజ్‌ కార్లను విక్రయించగలిగింది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

Tata Altroz (టాటా ఆల్ట్రోజ్) కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఐపిఎల్ 2020 లో అధికారిక భాగస్వామిగా చేయబడింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మారథాన్ ఈవెంట్‌లకు ఇది ప్రధాన కారు. ఈ సంవత్సరం ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు కూడా ఈ Tata Altroz గిఫ్ట్ గా ఇవ్వబడింది. ఇందులో భాగంగానే కంపెనీ 24 మంది అథ్లెట్లకు హై స్ట్రీట్ గోల్డ్ కలర్ Tata Altroz ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను అందించింది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

Tata Altroz అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌లపై ఫాగ్ ల్యాంప్‌లు మరియు వెనుకవైపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. Tata Altroz యొక్క కొలతలను గమనించినట్లయితే, దీని పొడవు 3,990 మిమీ, వెడల్పు 1,755 మిమీ, ఎత్తు 1,523 మిమీ మరియు 2,501 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

Tata Altroz ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇంటీరియర్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, హర్మన్ సరౌండ్ సౌండ్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు రియర్ ఎసి వెంట్‌లతో కూడిన 17.78-సెంటీమీటర్ల ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

Tata Altroz అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు ISOFIX యాంకర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహనదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

కొత్త Tata Altroz రెండు ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్ కాగా, మరొకటి 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. Tata Altroz యొక్క 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

ఇక Tata Altroz యొక్క రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 90 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది.

ఉత్పత్తిలో 1 లక్ష యూనిట్లు దాటిన Tata Altroz.. తక్కువ సమయంలో అరుదైన రికార్డ్

గ్లోబల్ ఎన్‌సిఎపి ఏజెన్సీ క్రాష్ టెస్ట్‌లో Tata Altroz ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది. ఇందులో అడల్ట్ సేఫ్టీలో 17 కి గాను 16.13 పాయింట్లు మరియు చైల్ట్ సేఫ్టీలో 49 కి 29 పాయింట్లు సాధించింది. ఆల్ట్రోజ్ యొక్క అన్ని వేరియంట్లలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించబడతాయి. భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.85 లక్షల నుంచి రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Tata altroz 1 lakh unit production milestone details
Story first published: Tuesday, September 28, 2021, 16:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X