టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ సరికొత్త టర్బో పెట్రోల్ వేరియంట్‌ను జనవరి 13వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

ఈ నేపథ్యంలో, కంపెనీ తాజాగా తమ ఐటర్బో బ్యాడ్జింగ్‌ను ఆవిష్కరిస్తూ, ఓ టీజర్ వీడియో విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూస్తుంటే, టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెట్రోల్ వేరియంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెట్రోల్ వెర్షన్ కారులో పవర్‌ఫుల్ 1.2-లీటర్, త్రీ సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1,500-5,500 ఆర్‌పిఎమ్ వద్ద 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది జతచేయబడి ఉంటుంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

ప్రస్తుతానికి ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానుంది. తర్వాతి దశలో ఇందులో డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది డ్రై-క్లచ్ డిసిటి రూపంలో రావచ్చని సమాచారం.

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ టర్బో ఇంజన్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కార్లలో ఉపయోగించిన న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ కంటే 28 శాతం ఎక్కువ శక్తిని మరియు 24 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా అల్ట్రోస్ ఐటర్బో కేవలం 13 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

టాటా మోటార్స్ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేయటంతో పాటుగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్ మరియు కలర్ ఆప్షన్లలో కూడా కంపెనీ మార్పులు, చేర్పులు చేయనుంది.

టాటా ఆల్ట్రోజ్ వేరియంట్ లైనప్‌లో మార్పులు చేసిన తర్వాత, ఇందులోని స్టాండర్డ్ వెర్షన్ మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ ప్లస్, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్.

MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

అయితే, ఇందులో టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఈ కారులో స్పోర్ట్ మరియు సిటీ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

ఇందులోని 'స్పోర్ట్' మోడ్, ఈ ఇంజన్ నుండి గరిష్ట పనితీరును అందించనుంది. వేగవంతమైన యాక్సిలరేషన్ కోసం ఇది షార్ప్ థ్రోటల్ రెస్పాన్స్‌ను కలిగి ఉంటుంది. ఇకపోతే, సిటీ మోడల్ స్టార్ట్/స్టాప్ సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారుతో పోల్చుకుంటే, ఆల్ట్రోజ్ ఐటర్బో బేస్ వేరియంట్‌లో బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్, సగం హబ్ క్యాప్‌లతో కూడిన 14-ఇంచ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇకపోతే, ఐటర్బో ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లలో 2 అదనపు ట్వీటర్లతో కూడిన మెరుగైన సౌండ్ సిస్టమ్ లభ్యం కానుంది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో ఐటర్బో బ్యాడ్జింగ్ ఆవిష్కరణ; జనవరి 13న విడుదల

అన్ని ఐటర్బో వేరియంట్లలోని ఇంటీరియర్ కలర్ స్కీమ్‌ను ఆల్-బ్లాక్ నుండి లైట్ గ్రే కలర్‌కు మార్చారు. స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కోసం కంపెనీ ఇదివరకు అందించిన సిల్వర్ కలర్ ఆప్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త మెరీనా బ్లూ కలర్ ఆప్షన్‌ను జోడించారు. ఇది ఎక్స్ఎమ్ ప్లస్ మరియు ఆపై వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Tata Altroz iTurbo Badging Unveiled; India Launch On 13th January 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X