Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన తమ సరికొత్త టర్బో పెట్రోల్ వేరియంట్ 'టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో' ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ అధికారికంగా జనవరి 23వ తేదీన మార్కెట్లో అమ్మకానికి ఉంచనుంది. అదే రోజున ఈ కారు ధర మరియు ఇతర వివరాలను కూడా కంపెనీ వెల్లడించనుంది.

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తాజాగా తమ ఆల్ట్రోజ్ ఐటర్బో కారు పనితీరును, ఇందులోని స్పోర్ట్ మోడ్‌ను హైలైట్ చేసే ఓ కొత్త టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. మీకు మీరే పోటీ అనే నేపథ్యంతో తయారు చేసిన ఈ టీజర్ వీడియోలో టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో స్పీడ్, హ్యాండ్లింగ్, స్పోర్ట్ మోడ్ కోసం డెడికేటెడ్ బటన్ వంటి అంశాలను చూడొచ్చు.
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెట్రోల్ వేరియంట్ , స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ టర్బో ఇంజన్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కార్లలో ఉపయోగించిన న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ కంటే 28 శాతం ఎక్కువ శక్తిని మరియు 24 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

టాటా అల్ట్రోజ్ ఐటర్బో కేవలం 13 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఈ కారులో శక్తివంతమైన 1.2-లీటర్, త్రీ సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానుంది. తర్వాతి దశలో ఇందులో డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో కారులో అధునాతన కనెక్టింగ్ టెక్నాలజీ ఉంటుంది. నెక్సాన్ మాదిరిగానే ఇందులో కూడా ఐఆర్ఎ (ఇంటెలిజెంట్ రియల్ టైమ్ అసిస్ట్) కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు లభిస్తాయి. ఐఆర్ఎ టెక్ 5 లేయర్ కనెక్టివిటీ కింద ఇందులో మొత్తం 27 ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

వీటిని రిమోట్ కమాండ్స్, వెహికల్ సెక్యూరిటీ, లొకేషన్-ఆధారిత సేవలు, గేమిఫికేషన్, లైవ్ వెహికల్ డయాగ్నసిస్ అనే 5 లేయర్స్‌గా విభజించబడి ఉంటాయి. వీటి సాయంతో డిస్టెన్స్ టూ ఎంప్టీ, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, సోషల్ ట్రైబ్స్ మరియు వెహికల్ డ్యాష్‌బోర్డ్‌లోని వివిధ ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

ఈ లేటెస్ట్ ఐఆర్ఎ సిస్టమ్ యొక్క మరొక కొత్త హైలైట్ ఏంటంటే, ఇది హిందీ, ఇంగ్లీష్ మరియు హింగ్లిష్ వాయిస్ కమాండ్స్‌ను గ్రహించే సహజ వాయిస్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఈ కారులో కొత్తగా ఎక్స్‌ప్రెస్ కూలింగ్ అనే ఫీచర్‌ను జోడించారు. దీని సాయంతో ఇది 70 శాతం వేగంగా కారును కూల్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెట్రోల్ ఎక్స్‌టి, ఎక్స్జెడ్ మరియు ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్లలో విడుదల కానుంది. ఈ కారులో స్పోర్ట్ మరియు సిటీ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇందులోని ‘స్పోర్ట్' మోడ్, ఈ ఇంజన్ నుండి గరిష్ట పనితీరును అందిస్తుంది. సిటీ మోడ్ స్టార్ట్/స్టాప్ సిటీ ట్రాఫిక్‌కు అనువుగా ఉంటుంది.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారుతో పోల్చుకుంటే, ఆల్ట్రోజ్ ఐటర్బో బేస్ వేరియంట్లో బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్, సగం హబ్ క్యాప్లతో కూడిన 14-ఇంచ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇకపోతే, ఐటర్బో ఎక్స్జెడ్ మరియు ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్లలో 4 హార్మన్ స్పీకర్లు మరియు 2 అదనపు ట్వీటర్లతో కూడిన మెరుగైన సౌండ్ సిస్టమ్ లభ్యం కానుంది.