భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

భారతీయ వాహన తయారీ దిగ్గజం Tata Motors (టాటా మోటార్స్) వినియోగదారుల నమ్మకానికి మరియు నాణ్యతకు పేరు గడించింది. Tata Motors దేశీయ మార్కెట్లో కొత్త Tata 407 CNG (టాటా 407 సిఎన్‌జి) వేరియంట్ ను విడుద చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 12.07 లక్షలు. ప్రముఖ Tata 407 CNG మోడల్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

కొత్త Tata 407 CNG మంచి క్లాస్-లీడింగ్ పర్ఫామెన్స్, విశ్వసనీయత మరియు అదనపు విలువను కలపడం ద్వారా 'నాన్-స్టాప్ ప్రాఫిట్ మెషిన్' అనే ఖ్యాతిని నెరవేర్చడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. అయితే ఈ కొత్త వెర్షన్ దాని డీజిల్ స్పెక్ వెర్షన్ కంటే 35 శాతం ఎక్కువ లాభాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

Tata 407 CNG వెర్షన్ అధిక లోడ్ మోసే సామర్థ్యం కోసం 10 అడుగుల లోడ్ డెక్ కలిగి ఉంది. ఇది I & LCV విభాగంలో 5-టన్నులు మరియు 16-టన్నుల స్థూల వాహన బరువు కలిగి ఉన్న కంపెనీ యొక్క మధ్య ఉన్న కంపెనీ CNG వాణిజ్య వాహన పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేయడానికి సహాయపడుతుంది.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

Tata Motors యొక్క Tata 407 CNG వెర్షన్ 3.8-లీటర్ సిఎన్‌జి అమర్చిన ఇంజిన్ ఎస్‌జిఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 85 బిహెచ్‌పి మరియు 285 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 5 టన్నుల వరకు బరువును తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Tata 407 CNG 180 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి మైలేజ్ కూడా అందిస్తుంది, కావున ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధిస్తుంది.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

Tata 407 CNG యొక్క క్యాబిన్ అధిక భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా ఉండటానికి, హై గ్రేడ్ స్టీల్‌తో నిర్మించబడింది. ఇందులో మంచి NVH లెవెల్స్ అందుబాటులో ఉంటాయి, కావున ఎలాంటి రోడ్డులో అయిన ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులోని NVH లెవెల్స్ కోసం పారాబొలిక్ సస్పెన్షన్‌ అమర్చబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

Tata 407 CNG లో ఒక USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అంతే కాకుండా ఇందులో బ్లూప్రింట్ మ్యూజిక్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. 407 సిరీస్ సరైన ఫ్లీట్ నిర్వహణ కోసం ఫ్లీట్ ఎడ్జ్ కనెక్ట్ చేయబడిన వెహికల్ ప్లాట్‌ఫారమ్‌తో వస్తుంది. ఇది ఆపరేటింగ్ సమయాన్ని మరింత పెంచుతుంది. ఇంద్దులో భాగంగానే కంపెనీ ఈ వెహికల్ పై 2 సంవత్సరాల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో యాజమాన్యం యొక్క మొత్తం ఖర్చును తగ్గిస్తుంది

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

Tata 407 CNG విడుదల సందర్భంగా, Tata Motors యొక్క I & LCV ప్రొడక్ట్ లైన్ వైస్ ప్రెసిడెంట్ Rudrarup Maitra మాట్లాడుతూ, దేశీయ మార్కెట్లో కొత్త Tata 407 CNG వేరియంట్‌ను విడుదల చేయడం మాకు సంతోషంగా ఉందన్నారు, అంతే కాకుండా ఇది 35 సంవత్సరాలకు పైబడి భారతదేశంలో ఉన్న అత్యంత ప్రజాదరణపొందిన కమర్షియల్ వెహికల్.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

మార్కెట్లో ఇప్పటివరకు Tata 407 CNG దాదాపు 1.2 మిలియన్ యూనిట్లకు పైగా అమ్మకాలతో నేటికి వినియోగదారుల అభిమాన వాహనంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు కంపెనీ ఈ కొత్త Tata 407 CNG వెర్షన్ పై మూడు సంవత్సరాలు లేదా 3 లక్షల కిలోమీటర్ల క్లాస్ లీడింగ్ వారెంటీని అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా సంపూర్ణ సేవా 2.0 సర్వీస్ ప్యాకేజీ కింద మెయింటెనెన్స్ కోసం పరిష్కారాలను అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన Tata 407 CNG; ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతున్న తరుణంలో, చాలామంది వాహన తయారీదారులు సిఎన్‌జి వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే సిఎన్‌జి వెహికల్స్ దేశీయ మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సిఎన్‌జి బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

సిఎన్‌జి వాహనాలు నిర్వహణ వ్యయాలను తగ్గించడంతో పాటు, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. ప్రస్తుతం, ఇంధన ధరల అధిక పెరుగుదల మరియు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువుగా ఉండటం వల్ల వీటికి కొంతవరకు ప్రత్యామ్నాయంగా, తక్కువ ధరతో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్న సిఎన్‌జి వాహనాలను ఎంచుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

Most Read Articles

English summary
Tata launched cng version of popular 407 model in india
Story first published: Monday, September 13, 2021, 18:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X