అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, పీపుల్స్ క్యారియర్‌గా విక్రయిస్తున్న టాటా మ్యాజిక్‌ను ఆధారంగా చేసుకొని కొత్త రకం అంబులెన్స్‌లను తయారు చేసింది. ప్రజలకు అత్యంత సరమైన అంబులెన్స్ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.

అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

టాటా మోటార్స్ వెల్లడించిన సమచారం ప్రకారం, కొత్త టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ వైద్య మరియు ఆరోగ్య సంబంధిత సేవలకు మద్దతుగా రూపొందించబడింది, ముఖ్యంగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోనుంది.

అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ దాని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఇరుకుగా ఉండా వీధుల్లోనూ మరియు రద్దీగా ఉండే నగర ట్రాఫిక్‌లోనూ సులువుగా ముందుకు సాగిపోగలదని, ఫలితంగా రోగులను వేగంగా ఆస్పత్రులకు చేర్చవచ్చని కంపెనీ చెబుతోంది.

అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ ఏఐఎస్ 125 నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని, వెనుక క్యాబిన్‌లో రోగికి మరియు పరిచారకులకు తగిన స్థలం, భద్రత మరియు సౌకర్యాన్ని అందించడానికి అవసరమైన అన్ని వసతులను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

ఈ మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో ఆటో-లోడింగ్ స్ట్రెచర్, మెడికల్ క్యాబినెట్, ఆక్సిజన్ సిలిండర్ కోసం సదుపాయం, డాక్టర్ సీటు మరియు మంటలను ఆర్పే స్ప్రేయర్, అంతర్గత లైటింగ్, మంటలను తట్టుకునే ఇంటీరియర్స్ మరియు అనౌన్స్‌మెంట్ సిస్టమ్ సహా అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయి.

అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

ఈ అంబులెన్స్‌లో ఏఐఎస్ 125 సర్టిఫైడ్ రెట్రో రిఫ్లెక్టివ్ డెకాల్స్ మరియు సైరన్‌తో కూడిన బీకన్ లైట్‌ను కూడా అమర్చబడి ఉంటుంది. ఇందులో డ్రైవర్ మరియు రోగి కంపార్ట్మెంట్లను వేరు చేయబడి ఉంటాయి. అయితే, వెనుక క్యాబిన్‌లో వారు డ్రైవర్‌ను సంప్రదించేందుకు ఇందులో చిన్నపాటి కిటికీ కూడా ఉంటుంది.

అంబులెన్స్ అవతారమెత్తిన టాటా మ్యాజిక్; కొత్త వ్యాపారంలోకి టాటా మోటార్స్

ఇంజన్ విషయానికి వస్తే, టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో 800 సిసి టిసిఐసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 44 హెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ అంబులెన్స్‌ను 2 ఏళ్లు లేదా 72,000 కిలోమీటర్ల వారంటీతో విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors Launches Magic Express Ambulance In India. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X