SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

భారత మార్కెట్లో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మూడేళ్ల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం టాటా మోటార్స్ యొక్క చిన్న మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం రండి.

SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ యొక్క ఈ భాగస్వామ్యం తరువాత, వినియోగదారులు ఇప్పుడు తమ వాణిజ్య వాహనాలను సులభంగా కొనుగోలు చేయగలని కంపెనీ తెలిపింది. తద్వారా టాటా మోటార్స్ యొక్క బిఎస్ 6 కేటగిరీ వాహనాల డిమాండ్ పెంచడానికి సహాయపడుతుంది. ఈ భాగస్వామ్యంలో, కస్టమర్లు వాణిజ్య వాహనాలపై సులభంగా లోన్స్ పొందుతారు.

SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

భారతదేశంలో ఎస్‌బిఐ బ్యాంక్ కి దాదాపు 22 వేలకు పైగా శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది, కావున ఈ భాగస్వామ్యం ద్వారా టాటా మోటార్స్ కంపెనీ తమ ఉనికిని మరింత విస్తరించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తన పరిధిని బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

కంపెనీ తన వినియోగదారులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రత్యేకమైన మరియు వినూత్నమైన ఆర్థిక సహాయాన్ని అందించగలదు. మా వినియోగదారులకు పూర్తి సేవలను అందించడానికి కంపెనీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది, అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఈ వాహనాలు పలువిధాలుగా ఉపయోగపడతాయి.

SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎస్.శెట్టి ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ, ఈ పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని పెంచడానికి మరియు భారతదేశం అంతటా కస్టమర్లకు మరియు డీలర్లకు కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక సేవలను అందించడానికి మేము ఎదురుచూస్తున్నాము. మా వినూత్న కాంటాక్ట్‌లెస్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ ద్వారా మేము బ్యాంకింగ్‌ను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాన్నారు.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయనున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ; పూర్తి వివరాలు

SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ యొక్క చిన్న మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియో మొత్తం పర్యావరణ వ్యవస్థలో అత్యంత విజయవంతమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహకారం టాటా మోటార్స్ యొక్క కమర్షియల్ వెహికల్స్ లోన్స్ పొందటానికి, ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమర్పణలను పొందటానికి అనుమతిస్తుంది.

SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టాటా మోటార్స్, ఎందుకో తెలుసా?

ఈ భాగస్వామ్యం బిఎస్ 4 మరియు బిఎస్ 6 వాహనాల మధ్య వ్యయ భేదాన్ని తగ్గించడానికి మరియు వాహనం యొక్క డౌన్‌ పేమెంట్ మరియు ఇఎంఐ చెల్లింపులను తగ్గించడానికి సహాయపడే సులభమైన ప్రణాళికలను ప్రవేశపెడుతుంది. ఏది ఏమైనా కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం వినియోగదారులకు చాలా ఉపయోగపడుతుంది.

MOST READ:కార్ విండ్‌స్క్రీన్‌ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Most Read Articles

English summary
Tata Motors And SBI Enters Into Partnership For Financial Assistance Details. Read in Telugu.
Story first published: Monday, March 29, 2021, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X