పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, తమ కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. టాటా మోటార్స్ తమ అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ప్యాసింజర్ వాహనాల ధరలు 0.8 శాతం మేర పెరుగుతాయని కంపెనీ తెలిపింది.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

పెరిగిన కొత్త ధరలు ఆగస్టు 3 నుండే అమల్లోకి వస్తాయని టాటా మోటార్స్ పేర్కొంది. ధరల పెరుగుదలకు చేయబడుతుంది. ధరల పెరుగుదలకు సంబంధించి కంపెనీ ఎలాంటి కారణాలను వెల్లడించకపోయినప్పటికీ, ముడిసరుకుల ధరలు పెరగడం వల్లనే కంపెనీ తమ కార్ల ధరలను పెంచినట్లుగా తెలుస్తోంది.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పెరిగిన ధరలు కొత్త బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఈ ఏడాది ఆగస్ట్ 31 లేదా అంతకు ముందు రిటైల్ చేయబడిన లేదా బిల్ చేయబడిన వాహనాలపై మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్ (ధర రక్షణ) ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. అలాంటి కస్టమర్లకు పాత ధరలకే టాటా కార్లను విక్రయిస్తామని తెలిపింది.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

టాటా మోటార్స్ ఈ సంవత్సరం ధరలను పెంచడం ఇది మూడవసారి. ఈ ఏడాది జనవరి మరియు మే నెలల్లో కంపెనీ తమ వాహనాలను ధరలను పెంచిన సంగతి తెలిసినదే. గడచిన మే నెలలో కంపెనీ తమ కార్ల ధరను 1.8 శాతం మేర పెంచగా, జనవరి 2021లో సుమారు రూ.26,000 మేర ధరలను పెంచింది.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా మారుతి సుజుకి వంటి ఇతర ఆటోమొబైల్ సంస్థలు కూడా ఈ నెల ప్రారంభంలో తమ వాహనాల ధరలను పెంచాయి. మారుతి యొక్క సిఎన్‌జి కార్ల ధరలను కంపెనీ రూ.15,000 మేర పెంచగా, తమ పాపులర్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధరను కూడా పెంచింది. హోండా కార్స్ ఇండియా కూడా ఆగస్టు నెల నుండి తమ కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించింది.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్నడిమాండ్..

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ జోరందుకుంది. ఈ విభాగంలో, టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ ఈవీకి డిమాండ్ దాని డీజిల్ వేరియంట్‌తో సమాన స్థాయికి చేరుకుందని కంపెనీ పేర్కొంది.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మారింది. ఇదిలా ఉంటే, వచ్చే 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ మొత్తం కార్ల విక్రయాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2 శాతంగా ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఇది మరింత వేగంగా పెరుగుతుందని అంచనా.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

టాటా మోటార్స్ ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో రెండు పూర్తి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీ మోడళ్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ అందరికీ అందుబాటులో ఉండగా, టిగోర్ ఈవీ వాణిజ్య కొనుగోలుదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని నెలల్లో కంపెనీ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తుందని సమాచారం.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను నిర్మించిన మొదటి సంస్థ టాటా మోటార్స్ కావటం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ప్లాంట్లు మరియు అమ్మకాల తర్వాత సేవా సౌకర్యాలను ఏర్పాటు చేయటంలో కంపెనీ ముమ్మరంగా పనిచేస్తోంది. టాటా గ్రూపుకు చెందిన ఏడు కంపెనీలు (టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్, క్రోమా, టాటా ఆటో కాంపోనెంట్స్ మరియు టాటా మోటార్స్ ఫైనాన్స్) దేశంలో ఈవీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కలిసి పనిచేస్తున్నాయి.

పెరిగిన టాటా కార్ల ధరలు.. కానీ వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్..

జులైలో పెరిగిన టాటా సేల్స్

ఇదిలా ఉంటే, గడచిన జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు 92 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ సమయంలో కంపెనీ దేశీయ మార్కెట్లో 51,981 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వాహన విభాగంలో 30,185 యూనిట్లు మరియు వాణిజ్య వాహన విభాగంలో 23,848 యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇవి వరుసగా 101 శాతం మరియు 88 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Most Read Articles

English summary
Tata Motors Announces Another Round Of Price Increase On Its Passenger Vehicles, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X