Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) కోసం ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ లేదని, ఈ ఎస్‌యూవీ విడుదలకు ముందే ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు తక్షణమే డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

టాటా మోటార్స్ గడచిన సెప్టెంబర్ నెలలోనే టాటా పంచ్ ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇతర కార్ కంపెనీల మాదిరిగానే టాటా మోటార్స్ కూడా సెమీ కండక్టర్ చిప్స్ కొరతను ఎదుర్కుంటున్నప్పటికీ, ఈ ప్రభావం టాటా పంచ్ ఉత్పత్తిపై పడకుండా ఉండేందుకు కంపెనీ తగు చర్యలు తీసుకుంటోంది. ఈ కారును ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్ల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే డెలివరీలను అందించేందుకు కూడా కంపెనీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

ఈ ఎస్‌యూవీ ప్రారంభానికి ముందే వచ్చిన బుకింగ్‌లను అందించడానికి తగినంత స్టాక్ తమ వద్ద అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకూ ఈ మైక్రో ఎస్‌యూవీ కోసం ఎన్ని బుకింగ్‌లు వచ్చాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతానికి మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేదని, రాబోయే రోజుల్లో వచ్చే బుకింగ్‌ల వలన వెయిటింగ్ పీరియడ్ పెరగే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

టాటా మోటార్స్ తమ పంచ్ టాటా పంచ్ ఎస్‌యూవీని రూ. 5.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 9.39 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. అయితే, ఈ ప్రారంభ ధరలు డిసెంబర్ 31, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి చూస్తుంటే, జనవరి 2022లో టాటా పంచ్ ఎస్‌యూవీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బ్రాండ్ యొక్క అన్ని కార్లతో పోలిస్తే టాటా పంచ్ కు ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో బుకింగ్‌లు వచ్చినట్లు టాటా మోటార్స్ తెలిపింది. అయితే, ఆ బుకింగ్ ల సంఖ్యను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 4, 2021 వ తేదీ నుండి టాటా పంచ్ కోసం ముందస్తు బుకింగ్ లు ప్రారంభమయ్యాయి.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

టాటా పంచ్ కోసం వచ్చే డిమాండ్ ను కంపెనీ ముందుగానే ఊహించింది. ఈ నేపథ్యంలో, కంపెనీ టాటా పంచ్ ఉత్పత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది మరియు సెమీకండక్టర్ సమస్యను అంతర్గతంగా పరిష్కరించకుంది. ప్రస్తుతానికి, ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ లేదని, వచ్చే 30 రోజుల తర్వాతే ఇది ఖచ్చితంగా తెలుస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

భారత మార్కెట్లో టాటా పంచ్ నాలుగు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటిలో ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌ అనే వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ప్యూర్ వేరియంట్ మినహా మిగిలిన మూడు వేరియంట్లు (అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌) మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ప్యూర్ వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

కాగా, ఈ వేరియంట్లను మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా మార్చుకోవడానికి కంపెనీ అదనపు యాక్ససరీ ప్యాక్ లను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో రిథమ్, డాజల్ మరియు ఐఆర్ఏ (Rythm, Dazzle మరియు iRA) కస్టమైజేషన్ ప్యాకేజీలు ఉన్నాయి. మార్కెట్లో ఈ ప్యాకేజీల ధరలు వరుసగా రూ. 35,000, రూ. 45,000 మరియు రూ. 30,000 గా ఉన్నాయి.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

టాటా పంచ్ మినీ ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, హర్మన్ సౌండ్ సిస్టమ్ మరియు ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

ఈ కారు కోసం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌ లో టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకొని, భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన చిన్నకారుగా నిలిచింది. ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

టాటా పంచ్ కారులోని ఈ నాలుగు వేరియంట్లు కూడా ఒకే రకమైన 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తాయి. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో 'ట్రాక్షన్ ప్రో' అనే డ్రైవింగ్ మోడ్ లభిస్తుంది.

Tata Punch కోసం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు.. తక్షణమే డెలివరీ..

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ చిన్న కారు కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 - 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అయితే, ఇది గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోవడానికి 16.5 సెకన్ల సమయం పడుతుంది. టాటా పంచ్ మైలేజ్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ వేరియంట్ 18.97 kmpl మరియు ఆటోమేటిక్ వేరియంట్ 18.82 kmpl సర్టిఫైడ్ మైలేజీని అందిస్తాయి.

Most Read Articles

English summary
Tata motors confirms no waiting period for punch suv and ready for immediate delivery details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X