టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మొత్తం కార్ల ధరలను రూ.26,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

అయితే, జనవరి 21న లేదా అంతకన్నా ముందు బుక్ చేసుకున్న టాటా కార్లకు మాత్రమే ఈ ధరల పెంపు వర్తించదని, అవి మునుపటి ధరల ప్రకారమే ఉంటాయని కంపెనీ తెలిపింది.

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. వాహనాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్లనే వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి.

MOST READ: నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలో ప్రధాన ముడిపదార్థమైన స్టీల్ ధర, దేశంలో గత కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. దేశీయ డిమాండ్ మరియు ఇనుము ధాతువు ధరలు పెరగడం, అంతర్జాతీయ ధరలు పెరగడం మరియు ఉత్పత్తిని తగ్గించడం మరియు పరిమిత సంఖ్యలోనే దిగుమతులు చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

స్టీల్ ధరల పెరుగుదలతో పాటుగా ప్రస్తుతం భారతదేశంలో సెమీకండక్టర్ల కొరత ఏర్పడింది. ఈ సమస్య కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వాహన తయారీదారులను కూడా ఇబ్బంది పెడుతోంది.

MOST READ: లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

కోవిడ్-19 మహమ్మారికి వీటి సరఫరా సజావుగా ఉండేది, అయితే ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ల కొరత అధికమైంది. ఈ కారణం చేతనే ఫోర్డ్ ఇండియా, దేశంలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ తన ప్యాసింజ్ వాహన శ్రేణికి డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలను చూసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలలో టాటా కార్ల అమ్మకాలు 39 శాతం పెరిగాయి.

MOST READ: పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత మార్కెట్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా తమ అమ్మకాల సమఖ్యను మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే, టాటా మోటార్స్ తాజాగా ఆల్ట్రోజ్ ఐ-టర్బో అనే కారుని ఆవిష్కరించింది.

టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు

మరికొద్ది రోజుల్లోనే ఈ కారు అధికారికంగా మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఆల్ట్రోజ్ ఐ-టర్బో తర్వాత టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సరికొత్త మోడల్ టాటా సఫారీ. భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా, టాటా మోటార్స్ తమ సరికొత్త సఫారీని ప్రారంభించనుంది.

MOST READ: గుడ్ న్యూస్.. ఇకపై వారు టోల్‌గేట్ చెల్లించకుండా ఉచితంగా వెళ్ళవచ్చు.. వారెవరనుకుంటున్నారా..!

Most Read Articles

English summary
Tata Motors Increases Its Car Prices Upto Rs 26,000, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X