భారత్‌లో విడుదలైన టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్; ధర & వివరాలు

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ తన వాహన విభాగాన్ని మార్కెట్లో మరింత బలోపేతం చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల తన కొత్త కమర్షియల్ వెహికల్ 'టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్‌'ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కమర్షియల్ వెహికల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 3.99 లక్షలు(ఎక్స్-షోరూమ్).

టాటా మోటార్స్ యొక్క ఈ చిన్న కమర్షియల్ వెహికల్ రెండు వేరియంట్లలో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అవి ఒకటి ఫ్లాట్‌బెడ్ వేరియంట్‌ కాగా మరియు రెండు హాఫ్ బెడ్ లోడ్ బాడీ వేరియంట్‌. వీటి ధరలు వరుసగా రూ. 3.99 లక్షలు మరియు రూ. 4.10 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంటుంది.

కంపెనీ ఈ కొత్త కమర్షియల్ వాహన కొనుగోలును మరింత పెంచడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం కొనుగోలుదారులు 7,500 రూపాయల లో ఇఎంఐ మరియు 90% ఆన్-రోడ్ ఫైనాన్స్ ప్రయోజనాన్ని వినియోగించుకోవచ్చు.

టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్ వేరియంట్లో 2-సిలిండర్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజిన్ యొక్క సహాయంతో ఈ చిన్న వెహికల్ 1.5 టన్నుల కంటే ఎక్కువ బరువును మోయగలదు. ఇది ఏస్ గోల్డ్ పెట్రోల్ 694 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది మరియు ఇది గతంలో టెస్ట్ సమయంలో కనిపించింది. ఈ ఇంజిన్‌లో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉపయోగించబడింది.

టాటా మోటార్స్ తన కొత్త ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్ చిన్న వాణిజ్య వాహన విభాగంలో గేమ్-ఛేంజర్‌ను ప్లే చేస్తుందని పేర్కొంది. టాటా మోటార్స్ స్మాల్ కమర్షియల్ వెహికల్ అండ్ పికప్ ట్రక్ ప్రొడక్ట్ లైన్ వైస్ ప్రెసిడెంట్ 'వినయ్ పాథక్' మాట్లాడుతూ, కొత్త ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్ లాంచ్ వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించగలిగాము.

ఈ కమర్షియల్ వెహికల్ ను ఒక చిన్న ఏనుగుతో పోల్చారు. టాటా ఏస్ దృఢమైన, నమ్మకమైన మరియు బహుళ ప్రయోజన వాహనంగా కొనసాగుతోంది, ఇది ఇప్పటివరకు ఎక్కువ మందిని ఆకర్షించింది. కంపెనీ నివేదికల ప్రకారం భారతదేశంలో ఇప్పటికే 23 లక్షల మంది భారతీయులకు జీవనోపాధి కల్పించగలిగింది. నిజంగా ఇది ప్రశంసించదగ్గ విషయం.

టాటా ఏస్ వాణిజ్య వాహన విభాగంలో ఇప్పటికే దాని సత్తా చాటుకుంది. అయితే ఇప్పుడు మరింతమంది కస్టమర్లను ఆకర్శించడానికి తగిన కొత్త స్కీమ్ లతో ఈ చిన్న కమర్షియల్ వాహనాన్ని కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కావున ఈ వెహికల్ కూడా మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Tata Ace Gold Petrol CX Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 29, 2021, 14:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X