ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

ప్రముఖ దేశీయ ఆటోమోటివ్ బ్రాండ్ టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్ట్రోజ్, నెక్సాన్, నెక్సాన్ ఈవీ మరియు హారియర్ మోడళ్లలో ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్లను మార్కెట్లో విడుదల చేసింది. పేరుకు తగినట్లుగానే ఈ ప్రత్యేకమైన మోడళ్లు వెలుపల మరియు లోపలివైపు డార్క్ థీమ్‌ను కలిగి ఉంటాయి.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

భారతదేశపు సురక్షితమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్, భారతదేశపు మొట్టమొదటి జిఎన్‌సిఎపి 5 స్టార్ రేటెడ్ కారు నెక్సాన్, ల్యాండ్ రోవర్ డిఎన్‌ఎతో డిజైన్ చేయబడిన ప్రీమియం ఎస్‌యూవీ హారియర్ మరియు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈ.వీ. మోడళ్లలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన ఈ డార్క్ ఎడిషన్ల వివరాలు ఉన్నాయి.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

టాటా ఆల్ట్రోజ్ డార్క్:

స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారుతో పోల్చుకుంటే ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ వేరియంట్‌లో కంపెనీ అనేక కాస్మెటిక్ మార్పులు చేసింది, ఇందులో కొత్త కాస్మో బ్లాక్ ఎక్స్టీరియర్ బాడీ కలర్‌, ఆర్16 అల్లాయ్ వీల్స్‌పై డార్క్ టింట్ ఫినిషింగ్ మరియు హుడ్ అంతటా ప్రీమియం డార్క్ క్రోమ్‌తో డిజైన్ చేయబడి ఉంటుంది.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

అలాగే, ఇంటీరియర్స్‌లో మెటాలిక్ గ్లోస్ బ్లాక్ మిడ్ ప్యాడ్‌తో గ్రానైట్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ మరియు డీప్ బ్లూ ట్రై-యారో హోల్స్ మరియు డెకో బ్లూ స్టిచింగ్‌తో కూడిన లెథరెట్ అప్‌హోలెస్ట్రీని అందిస్తున్నారు. ఇవన్నీ టాటా ఆల్ట్రోజ్ డార్క్ యొక్క ప్రీమియం అప్పీల్‌ను మరింత పెంచడంలో తోడ్పడతాయి.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

ఈ కారు వెలుపలి భాగంలో డార్క్ మస్కట్ మరియు లోపలివైపు ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లలోని డార్క్ ఎంబ్రాయిడరీ థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ పెట్రోల్ (న్యాచురల్ మరియు ఐటర్బో) ఇంజన్ ఆప్షన్లతో టాప్-ఎండ్ XZ+ వేరియంట్‌లో లభిస్తుంది.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

టాటా నెక్సాన్ డార్క్:

టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్‌లో కూడా డార్క్ కలర్ బాడీ పెయింట్, కొత్త చార్‌కోల్ బ్లాక్ ఆర్16 ఆల్లాయ్ వీల్స్, డార్క్ మస్కట్, సోనిక్ స్లివర్ బాడీపై హైలైట్‌లతో పాటుగా మ్యాట్ గ్రానైట్ బ్లాక్ క్లాడింగ్ ఉంటాయి. ఇవన్నీ దీని బాహ్య రూపాన్ని మరింత అందంగా కనిపించేలా చేయడంలో సహకరిస్తాయి.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

ఈ స్పెషల్ ఎడిషన్ నెక్సాన్ డార్క్ వేరియంట్లలోని ఇంటీరియర్స్‌లో సీట్లు మరియు డోర్ ట్రిమ్‍లపై ట్రై-యారో గుర్తులతో కూడిన ప్రీమియం లెథరెట్ అప్‌హోలెస్ట్రీ, ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లపై స్పోర్ట్సీ స్పెషల్ డార్క్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ డార్క్ XZ +, XZA +, XZ + (O) మరియు XZA + (O) వేరియంట్లలో, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

టాటా హారియర్ డార్క్:

టాటా హారియర్ డార్క్ ఎడిషన్ వేరియంట్లలో పెద్ద R18 బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఇంటీరియర్‌లలో, సీట్లు మరియు డోర్ ట్రిమ్‌లపై ట్రై-యారో వెంటిలేటెడ్ బెనెక్కే కాలికో లీథెరెట్ అప్‌హోలెస్ట్రీ, సీట్ల స్టిచింగ్‌లో బ్లూ లైన్ డీటేలింగ్స్ వంటి మార్పులు ఉన్నాయి. ఇవి ఈ ఎస్‌యూవీ ప్రీమియంనెస్‌ను మరింత పెంచడంలో సహకరిస్తాయి. టాటా హారియర్ డార్క్ XT +, XZ + మరియు XZA అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

టాటా నెక్సాన్ ఈవీ డార్క్:

టాటా నెక్సాన్ ఈవీ డార్క్ థీమ్ వెర్షన్ XZ + మరియు XZ + LUX అనే రెండు వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్లు ప్రీమియం మిడ్నైట్ బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌తో శాటిన్ బ్లాక్ హ్యుమానిటీ లైన్ మరియు బెల్ట్‌లైన్‌లను కలిగి ఉంటాయి. ఇందులో డార్క్ మస్కట్ మరియు సరికొత్త చార్‌కోల్ గ్రే అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

కారు లోపలి భాగాన్ని గమనిస్తే, బయటి డార్క్ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా నిగనిగలాడే పియానో ​​బ్లాక్ ఫినిష్‌లో డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ మరియి సెంటర్ కన్సోల్, సీట్లు మరియు డోర్ ట్రిమ్‌లపై ట్రై-యారో థీమ్‌తో కూడిన డార్క్ థీమ్ లెథెరెట్ అప్‌హోలెస్ట్రీ, సీట్లపై బ్లూకలర్ స్టిచింగ్ మరియు డ్యాష్‌బోర్డు, సెంటర్ కన్సోల్‌పై బ్లూ కలర్ ఇల్యుమినేషన్ మొదలైన మార్పులు ఉన్నాయి.

ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్స్ విడుదల: డీటేల్స్

ఈ కారులో ఇప్పుడు ఐటిపిఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఫీచర్ కూడా లభిస్తుంది. అదనంగా, నెక్సాన్ ఈవీ XZ + వేరియంట్లోని వెనుక సీటులో కప్-హోల్డర్లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, 60:40 స్పిల్ట్ సీట్ మరియు సర్దుబాటు చేయగల వెనుక సీటు హెడ్‌రెస్ట్‌లు మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

Most Read Articles

English summary
Tata Motors Launches Dark Editions Of Altorz, Nexon, Nexon EV And Harrier. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X